Family Murder
-
యూపీలో దారుణం.. నలుగురి కుటుంబ సభ్యుల హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఓ ఉపాధ్యాయుడి కుటుంబం అత్యంత దారుణ హత్యకు గురైంది. గురువారం ఉపాధ్యాయుడికి ఇంట్లో చొరబడిన గుర్తుతెలియని దుండగులు నాలుగురు కుటుంబ సభ్యులపై కాల్పులు జరిపారు. అమేథీలోని శివరతంగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ నగర్ క్రాస్‌రోడ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన ఉపాధ్యాయుడిని సునీల్ కుమార్(35)గా గుర్తించారు. ఆయన పన్‌హౌనాలోని కాంపోజిట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. దుండగుల కాల్పల్లో సునీల్ భార్య పూనం (32), వారి కుమార్తె దృష్టి (6), ఏడాది వయసున్న కుమార్తె మృతి చెందారు.ఈ ఘటపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. టీచర్ భార్య ఆగస్టు 18న చందన్ వర్మా అనే వ్యక్తి రాయ్ బరేలీ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తమకు, తమ కుటుంబానికి ఏమైనా జరిగినే చందన్ వర్మానే బాధ్యుడు అని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్లు ఎస్పీ అనూప్ కుమార్ సింగ్ తెలిపారు. ఆమెను వేధింపులకు గురిచేసినట్లు కూడా కేసులో ఆమె ప్రస్తావించటం గమనార్హం. అయితే ఈ హత్యకు సంబంధించి అనుమానితుడు చందన్ వర్మా ఆచూకీ ఇంకా దొరకలేదని, ఆయన పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఈ కుటుంబ హత్యకు సంబంధించి పూర్తి స్పష్టత రాలేదని అన్నారు.పోలీసుల దర్యాప్తులో భాగంగా చందన్ వర్మా వాట్సాప్ చాట్ బయపడినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు కుటుంబ సభ్యులను హత్య చేసి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకోవాలనే ప్లాన్ అందులో ఉన్నట్లు వెల్లడించారు. ‘‘ ఐదుగురు చనిపోతారు" అని వర్మ వాట్సాప్ చాట్‌లో వ్రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్యాప్తు చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ యూనిట్, స్పెషల్ ఆపరేషన్ గ్రూపులు కూడా దర్యాప్తులో పాల్గొంటున్నాయని తెలిపారు. -
‘బిల్కిస్’ దోషులకు... శిక్ష తగ్గింపు చెల్లదు
న్యూఢిల్లీ/దాహోద్: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఆమెపై అత్యాచారం, కుటుంబీకుల హత్య కేసులో 11 మంది దోషులకు శిక్షా కాలం తగ్గిస్తూ గతేడాది గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేసింది. వారు రెండు వారాల్లోగా కోర్టులో లొంగిపోవాల్సిందిగా ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ఈ మేరకు 251 పేజీల తీర్పు వెలువరించింది. ఓ మహిళపై ఇంతటి క్రూర నేరాలకు పాల్పడ్డ కేసుల్లో శిక్ష తగ్గింపునకు అసలు ఆస్కారమెలా ఉంటుందని గుజరాత్ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇలాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాధితురాలి జాతి, మత విశ్వాసాలతో నిమిత్తం ఉండకూడదని స్పష్టం చేసింది. ‘‘శిక్ష తగ్గింపు (రెమిషన్) గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న మతిలేని నిర్ణయం. ఈ విషయంలో దోషులతో ప్రభుత్వం పూర్తిగా కుమ్మక్కైంది. వారి విడుదల కోసం అన్నివిధాలా తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడింది’’ అంటూ కడిగి పారేసింది. ‘‘సుప్రీంకోర్టులో రెమిషన్ పిటిషన్ సందర్భంగా దోషులు ఈ కేసులో వాస్తవాలను దాచారు. తద్వారా అత్యున్నత న్యాయస్థానాన్నే ఏమార్చారు. తద్వారా రెమిషన్‌పై పరిశీలనకు ఆదేశాలు పొందారు’’ అంటూ ఆక్షేపించింది. ఆ తీర్పు కూడా చెల్లుబాటు కాబోదని ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పును బాధితురాలితో పాటు ప్రధాన రాజకీయ పక్షాలన్నీ స్వాగతించాయి. బానో స్వస్థలంలో ఆమె బంధుమిత్రులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. జైలుకు వెళ్లిన అనంతరం రెమిషన్ కోసం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించే అవకాశం దోషులకు ఉంది. గుజరాత్ ప్రభుత్వానికి అధికారం లేదు గుజరాత్లో 2002లో గోధ్రా రైలు దహనకాండ అనంతరం మత ఘర్షణలు చెలరేగడం తెలిసిందే. ఆ సందర్భంగా మిగతా బిల్కిన్ బానో ఉదంతం చోటుచేసుకుంది. ఐదు నెలల గర్భిణి అయిన 21 ఏళ్ల బిల్కిస్‌పై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె మూడేళ్ల కూతురుతో పాటు కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు. ఈ కేసులో 11 మందిని దోషులుగా సీబీఐ ప్రత్యేక కోర్టు ఖరారు చేసింది. వారికి జీవిత ఖైదు విధిస్తూ 2008లో తీర్పు వెలువరించింది. దీన్ని బాంబే హైకోర్టు కూడా సమరి్థంచింది. 15 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాక తమను విడుదల చేయాలంటూ వారిలో ఒకరు 2022 మేలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీన్ని పరిశీలించాలన్న కోర్టు ఆదేశం మేరకు గుజరాత్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. దాని సిఫార్సు ఆధారంగా మొత్తం 11 మందికీ రెమిషన్ మంజూరు చేయడంతో 2022 ఆగస్టు 15న వారంతా విడుదలయ్యారు. దీనిపై బిల్కిస్ తీవ్ర ఆవేదన వెలిబుచి్చంది. రాజకీయ పారీ్టలతో పాటు అన్న విర్గాలూ వారి విడుదలను తీవ్రంగా తప్పుబట్టాయి. గుజరాత్ ప్రభుత్వ చర్యపై దేశమంతటా నిరసనలు వ్యక్తమయ్యాయి. వారి విడుదలను సుప్రీంకోర్టులో బిల్కిస్‌తో పాటు పలువురు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. 11 రోజుల వాదనల అనంతరం 2023 అక్టోబర్ 12న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. రెమిషన్‌ను కొట్టేస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. ఈ కేసులో విచారణ జరిగి దోషులకు శిక్ష పడింది మహారాష్ట్రలో గనుక వారికి రెమిషన్ ప్రసాదించే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. లేని అధికారాన్ని చేతుల్లోకి తీసుకుని శిక్ష తగ్గించిందంటూ తప్పుబట్టింది. రెమిషన్ నిర్ణయాన్ని కొట్టేసేందుకు ఈ ఒక్క ప్రాతిపదికే చాలని పేర్కొంది. ‘‘2022లో సుప్రీంకోర్టుకు వెళ్లిన నిందితులు కేసులో వాస్తవాలను దాచి ధర్మాసనాన్ని తప్పుదోవ పట్టించి పునఃసమీక్షకు తీర్పును పొందారు. ఈ విషయంలో గుజరాత్ ప్రభుత్వం కూడా వారితో కుమ్మకైంది’’ అంటూ ఆక్షేపించింది. ‘‘రెమిషన్ కోసం దోషుల్లో ఒకరు 2019లోనే గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా మహారాష్ట్ర ప్రభుత్వం వద్దకు వెళ్లాల్సిందిగా సూచించింది. 2020లోనూ మరో పిటిషన్ పెట్టుకున్నా కొట్టేసింది. దాంతో దోషి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించినా లాభం లేకపోయింది. రెమిషన్ ఇవ్వొద్దంటూ సీబీఐతో పాటు సీబీఐ ప్రత్యేక జడ్జి కూడా సిఫార్సు చేశారు. ఈ వాస్తవాన్ని సుప్రీంకోర్టు ముందు దాచిపెట్టారు’’ అంటూ మండిపడింది. రెమిషన్ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలంటూ బానో నేరుగా సుప్రీంకోర్టులో పిల్ వేయడం ఆరి్టకల్ 32 ప్రకారం సబబేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘శిక్ష విధించాల్సింది ప్రతీకార దృష్టితో కాదు. నేరం పునరావృతం కాకుండా చూసేందుకు. దాంతోపాటు దోషుల్లో మార్పు తెచ్చేందుకు’’ అన్న గ్రీకు తత్వవేత్త ప్లేటో సూక్తిని జస్టిస్ నాగరత్న ప్రస్తావించారు. శిక్ష తగ్గింపు నిర్ణయానికి కూడా దీన్ని వర్తింపజేయాల్సి ఉంటుందన్నారు. దోషుల హక్కులతో పాటు బాధితుల హక్కులనూ పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరని స్పష్టం చేశారు. బాక్సు తీర్పుపై స్పందనలు... ‘‘బానో అవిశ్రాంత పోరాటం ఎట్టకేలకు ఫలించింది. అన్యాయంపై, బీజేపీ సర్కారు అహంకారంపై ఆమె సాధించిన విజయమిది. ఎన్నికల లబ్ధి కోసం నేరగాళ్లకు ఆశ్రయమిస్తున్నదెవరో, న్యాయానికి పాతరేస్తున్నదెవరో సుప్రీంకోర్టు తీర్పుతో మరోసారి తేటతెల్లమైంది’’ – కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ‘‘ఇది సాహసోపేతమైన తీర్పు. ఇందుకు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు’’ – తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ‘‘బానోకు కేంద్రం తక్షణం క్షమాపణలు చెప్పాలి’’ – మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ‘‘మహిళలపై జరిగే అన్యాయాలను జాతి సహించబోదని ఈ తీర్పు మరోసారి నిరూపించింది’’ – బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత -
క్రైమ్ షోల ఎఫెక్ట్.. కుటుంబాన్ని గొడ్డలితో నరికి చంపిన బాలుడు
అగర్తల: క్షణికావేశంలో దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు వ్యక్తులు. సొంతవారినే పొట్టనబెట్టుకుంటున్నారు. తల్లి, సోదరి సహా మొత్తం నలుగురు కుటుంబ సభ్యులను దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు ఓ 17ఏళ్ల రాక్షసుడు. ఆ తర్వాత వారి మృతదేహాలను బావిలో పడేశాడు. ఈ దారుణ సంఘటన త్రిపురలోని ధలాయ్ జిల్లాలోని మారుమూల గ్రామంలో జరిగింది. నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి కుటుంబం మొత్తం ఇంట్లో నిద్రపోతోంది. ఈ క్రమంలో తాత, తల్లి, సోదరి, అత్తమ్మలను గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు బాలుడు. నిందితుడిని ఆదివారం ఉదయం మార్కెట్ సమీపంలో అరెస్ట్ చేశారు. ‘ఓ మైనర్ బాలుడు తన నలుగురు కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేశాడు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశాం. నేరానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. బాలుడి తండ్రి ఇంటికి వచ్చి చూడగా.. ఎక్కడ చూసినా రక్తంతో నిండిపోయి కనిపించింది. మృతదేహాలు సమీపంలోని బావిలో పడేశాడు.’ అని త్రిపుర పోలీసులు వెల్లడించారు. నిందితుడు టీవీకి బానిసయ్యాడని, తరుచూ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ షోలు చూస్తుంటాడని స్థానికులు తెలిపారు. గతంలో సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డాడని, ఈ హత్యలు చేస్తున్నప్పుడు ఇంట్లో సౌండ్ పెంచి మ్యూజిక్ ప్లే చేసినట్లు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: యాక్సిడెంట్‌గా చిత్రీకరించి మర్డర్‌కి ప్లాన్! మాజీ ఇంటిలిజెన్స్ ఆఫీర్ మృతి -
ఒకే ఫ్యామిలీలో ఐదుగురు దారుణ హత్య.. యువతిపై అత్యాచారం..?
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. కాగా, మృతిచెందిన వారిలో రెండేళ్ల చిన్నారి కూడా ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ప్రయాగ్‌రాజ్‌లోని సంగం నగరంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఇందులో ఓ చిన్నారి, దివ్యాంగురాలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే, గారాపూర్ నుంచి సికంద్రా వెళ్లే రోడ్డు పక్కన రాజ్‌కుమార్ యాదవ్(55) తన ఫ్యామిలీతో కలిసి నివాసిస్తున్నాడు. కాగా, గుర్తు తెలియని కొందరు వ్యక్తులు శనివారం ఉదయం వారి ఇంట్లోకి ప్రవేశించి రాజ్‌కుమార్ యాదవ్, అతని భార్య కుసుమ్ దేవి(52), కోడలు సవిత(27), దివ్యాంగురాలైన కుమార్తె మనీషా(25), మనవరాలు మీనాక్షి(2)ని దారుణంగా హత్య చేశారు. దుండగుల దాడి నుంచి యాదవ్ మనుమరాలు సాక్షి(5) తప్పించుకోగా యాదవ్ కుమారుడు ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలు కాపాడుకున్నాడు. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో సోదాలు నిర్వహిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు.. మనీషా బట్టలు చిందరవందరగా ఉండటంతో హత్యకు ముందు ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇది కూడా చదవండి: విషాదంగా ప్రేమ పెళ్లి.. ఇంటి నుంచి వెళ్లిపోయి.. -
షబ్నమ్.. ఒక వెంటాడే కథ
భారతదేశానికి స్వతంత్రం వచ్చాక మొదటిసారి ఒక మహిళా ఖైదీకి ఉరి వేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఆ మహిళా ఖైదీ పేరు షబ్నమ్. 2008లో తన ప్రియుడితో కలిసి ఆమె తన కుటుంబ సభ్యులనే హతమార్చిందని ఈ తీర్పు. అంతవరకే అయితే ఈ కథ వెంటాడదు. షబ్నమ్ ఇంగ్లిష్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. టీచర్‌గా పని చేసి విద్యార్థుల ఇష్టమైన టీచర్‌గా మారింది. ఆమె కాలేజీ ఫీజులు కట్టగా చదువుకున్న జూనియర్ ఆమె జైలుకు వెళ్లడంతో ఆమె కొడుకును దత్తత తీసుకున్నాడు. ఆమె సైఫి ముస్లిం, ప్రియుడు పఠాన్ ముస్లిం కావడం వీరి ప్రేమకు ప్రధాన అడ్డంకి అయ్యింది. ‘ఆస్తి కోసం తన వాళ్లను హతమార్చారు’ అని ఒకసారి, ‘ప్రియుడే చంపాడు’ అని ఒకసారి ఆమె చెప్పింది. అవన్నీ పక్కన పెడితే– భారతదేశంలో ఉరిశిక్షలు నిర్థారణ అయ్యి ఉరికి ఎదురు చూస్తున్న 12 మంది స్త్రీలు వెనుకబడిన, మైనారిటీ వర్గాలకు చెందినవారే కావడం వెనుక ‘నేరానికి–శిక్షకి–వెనుకబాటుతనానికి’ ఉన్న లంకె కూడా చర్చకు వస్తోంది. ‘ఉరిశిక్ష’ అని ఈ దేశంలో చర్చ జరిగినప్పుడల్లా ఆ ఉరిశిక్ష ‘ఎవరికి’ పడింది అనేది పెద్ద గమనార్హం అవుతుంది. చట్టం, న్యాయం అందరికీ సమానమే అని అనుకుంటాం, చెబుతుంటారు గాని చట్టం, న్యాయం అందరికీ సమానమేనా అని సందేహం వచ్చే గణాంకాలు ఎదురుగా ఉంటాయి. ఈ దేశంలో చకచకా శిక్షలు అమలయ్యేది బలహీనుల మీదేననీ, ఉరిశిక్ష అమలయ్యేది కూడా బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల మీదేనని ఆలోచనాపరులు గణాంకాలు చూపిస్తే వాటిని కాదనే జవాబు ఎవరి దగ్గరా లేదు. అలాగని ఈ ఆలోచనాపరులు నేరాలకు శిక్షలు వద్దని చెప్పడం లేదు. శిక్షల అమలులో వివక్ష ఉంది అని మాత్రమే చెబుతుంటారు. ఇప్పుడు ఉరిశిక్ష వార్తలలో ఉన్న షబ్నమ్ ఒక స్త్రీ కావడం, ఆమెకు క్షమాపణ దక్కకపోవడం, ఆమెలా ఈ దేశంలో ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తున్న 12 మంది స్త్రీలు కేవలం బలహీన, మైనారిటీ వర్గాల వారే కావడంతో వీరంతా ‘అడ్డంకులు లేని పూర్తి శిక్ష’కు యోగ్యులుగా భావించే భావజాలం ఉందని గ్రహించాల్సి వస్తుంది. ఎవరీ షబ్నమ్? శిక్ష కచ్చితంగా అమలవ్వాలి అని భారత పాలనావ్యవస్థ గట్టిగా అనుకుంటే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక మొదటిసారి ఉరిశిక్ష అమలయ్యే ఖైదీగా చరిత్రలో నిలవబోతున్న పేరు షబ్నమ్. ఈమెది ఉత్తర ప్రదేశ్‌లోని అమ్రోహాలోని బవాన్‌ఖేడి గ్రామం. తన ఇంటి ఎదురుగా కలప మిల్లులో పని చేసే సలీమ్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఇద్దరూ కలిసి 2008 ఏప్రిల్‌లో తమ ప్రేమకు అడ్డుగా ఉన్న షబ్నమ్ కుటుంబ సభ్యులు ఏడుగురిని దారుణంగా హతమార్చారని అభియోగం. కోర్టులో నేరం నిరూపణ కావడంతో 2012లో స్థానిక కోర్టు ఇరువురికీ ఉరిశిక్ష విధించింది. ఆ తర్వాత హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా ఆ శిక్షలను బలపరిచాయి. రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా నిరాకరింపబడింది. కనుక షబ్నమ్‌కు ఉరితీత తప్పదని ప్రస్తుతం వార్తలు వినవస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఒక జైలులో, సలీమ్ ఒక జైలులో ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో స్త్రీలను ఉరితీసే ఉరికంబం కేవలం మధుర జైలులోనే ఉంది. దానిని ఉపయోగించి 150 ఏళ్లు అవుతోంది. షబ్నమ్‌ను ఉరి తీయాలంటే అక్కడే తీయాలి. అందుకు జైలు అధికారులు తలారీని సిద్ధం చేశారు. డెత్ వారెంట్ రావడమే తరువాయి. సరే.. షబ్నమ్ ఎవరు? షబ్నమ్ ఇంగ్లిష్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసింది. ఊళ్లో టీచర్‌గా పని చేసింది. ఆమెది ముస్లింలలో ఒక తెగ. ఆమె ప్రేమించిన సలీమ్ ది మరో తెగ. ఈ తెగల అంతరం వీరి ప్రేమకు అడ్డంకిగా మారింది. అంతే కాదు సలీం కేవలం ఆరో క్లాసు చదువుకున్నాడు. పేదవాడు. అది కూడా షబ్నమ్ తల్లిదండ్రులకు నచ్చలేదు. కాని అప్పటికే ఆమె గర్భం దాల్చింది. ఈ ప్రేమ, గర్భం ఆమెను విచక్షణను కోల్పోయేలా చేశాయి. ఒకరోజు ప్రియుణ్ణి అర్ధరాత్రి ఇంట్లోకి రానిచ్చింది. ఇద్దరూ కలిసి షబ్నమ్ కుటుంబం లో 7గురిని హతమార్చారు. ఆ తర్వాత షబ్నమ్ ‘ఆస్తి కోసం నా వాళ్లను చంపారు’ అని ఒకసారి ‘సలీమ్ నిర్ణయం ఇది’ అని ఒకసారి చెప్పింది. అదే సంవత్సరం డిసెంబర్లో జైలులోనే షబ్నమ్ కొడుకుకు జన్మనిచ్చింది. అతనికి తాజ్ అని పేరు పెట్టింది. ఆరేళ్లవరకూ తల్లి దగ్గరే ఉన్న తాజ్‌ను షబ్నమ్తో పాటుగా కాలేజీలో చదువుకున్న ఆమె జూనియర్, ప్రస్తుతం జర్నలిస్ట్ అయిన ఉస్మాన్ సైఫీ దత్తత తీసుకున్నాడు. ‘నాకు తెలిసిన షబ్నమ్ ఈమె కాదు. షబ్నమ్ నా కాలేజీ ఫీజు కట్టింది. టీచర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె రుణం తీర్చుకోవడానికి ఆమె కొడుకును దత్తత తీసుకోవాలని నేను నా భార్యతో చెప్పాను’ అన్నాడు ఉస్మాన్ సైఫీ. అతని దగ్గర పెరుగుతున్న షబ్నమ్ కొడుకు ప్రతి మూడు నెలలకు తల్లిని చూసి వస్తుంటాడు. ఇటీవల అతను ‘మా అమ్మను క్షమించండి’ అని రాష్ట్రపతికి అప్పీలు చేశాడు. ‘నన్ను చూడాలని బలవంతం చేయకు. బాగా చదువుకో. నన్ను ఎప్పటికీ మర్చిపోకు’ అని షబ్నమ్ తన కొడుక్కి చెప్పింది. ఏం దారి ఉంది? షబ్నమ్ తన క్షమాభిక్ష కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. తన క్షమాభిక్ష నిరాకరింపబడటాన్ని సుప్రీం కోర్టులో తిరిగి సవాలు చేయనుంది. ‘ఇది షబ్నమ్‌కు, సలీమ్‌కు పడ్డ ఉరిశిక్ష. ఇరువురికీ సకల న్యాయపరమైన అప్పీల్స్ ముగిశాకనే ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంటుంది’ అని షబ్నమ్ తరఫున న్యాయవాది తెలిపింది. షబ్నమ్‌ను ఆమె బంధువులు ఎవరూ కనికరించడం లేదు. ‘ఆమె చనిపోతే ఆమె మృతదేహాన్ని కూడా తీసుకోం’ అని వారు అన్నారు. షబ్నమ్ ఒక జీవచ్ఛవం. ఆమె మరణించిందని ఉరిశిక్ష ద్వారా అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. – సాక్షి ఫ్యామిలీ -
వారిది షేర్డ్ సైకోటిక్ డిజార్డర్ కావచ్చు!
మదనపల్లెలో ఇద్దరు విద్యాధికులైన తల్లిదండ్రులు ఒక ఉన్మాదం లాంటి స్థితిలో తమ ఇద్దరు కూతుళ్లనూ హత్య చేశారు. కలియుగం అంతమైపోయి ఆ మర్నాటి నుంచి సత్యయుగం ప్రారంభమవుతుందని నమ్మారు. తమ కూతుళ్లను ఆ యుగంలోకి పంపేందుకు పూజలు నిర్వహిస్తూ బిడ్డలను హతమార్చారు. పైగా తమ బిడ్డలు మరణించలేదనీ... కొద్దిసేపట్లో జీవించి తిరిగి లేస్తారని చెబుతున్నారు. యుగాంతమైపోతుందన్న నిహిలిస్టిక్ డెల్యూషన్స్‌తో పాటు మరెన్నో భ్రాంతులకు లోనైన ఈ తాజా సంఘటన ఇటీవలే మదనపల్లెలో చోటుచేసుకుంది. సరిగ్గా పైన చెబుతున్న సంఘటనతో పోలికలు కనిపిస్తున్న ఉదంతం దాదాపు రెండేళ్ల కిందట ఢిల్లీ బురారీలో జరిగింది. ఆ సంఘటనలో ఒకే ఇంట్లో పదకొండు మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సంఘటనలో... చాలాకాలం కిందటే ఢిల్లీలోని నారాయణి దేవి అనే ఆవిడ భర్త చనిపోయాడు. ఆయన మరణించాక ఆ కుటుంబం కష్టనష్టాలకు లోనైంది. ఆ తర్వాత కుటుంబ పెద్ద తాలూకు రెండో కొడుకైన లలిత్ భాటియా తీవ్రమైన సైకోటిక్ డిజార్డర్‌కు గురయ్యాడు. దాంతో కొన్ని భ్రాంతులకు లోనయ్యాడు. ఆ భ్రాంతులనే నిజమని నమ్ముతూ... తమ నాన్న తమతో మాట్లాడుతూ, బిజినెస్ సలహాలు ఇస్తున్నాడని భ్రమపడేవాడు. వాటిని పాటిస్తున్నందువల్లనే బిజినెస్ పుంజుకుందనీ, తమ కష్టాలు గట్టెక్కాయని నమ్ముతుండేవాడు. ఈ నమ్మకం ముదిరి, తాంత్రిక పూజల్లోకి దిగి, వటవృక్ష పూజ అనే తంతును నిర్వహిస్తే... కుటుంబ సభ్యులందరికీ మోక్షం తప్పదనీ, వటవృక్షపు ఊడల్లా వేలాడుతూ, తాము ఉరికి పాల్పడితే కొంత సమయం తర్వాత తామంతా తిరిగి బతుకుతామనీ విశ్వసించారు. దాంతో కుటుంబసభ్యులంతా పూజలో భాగంగా ఉరేసుకున్నారు. ఉరివేసుకున్న తర్వాత వారు బతకలేదు సరికదా... కుటుంబంలోని 11 మందీ చనిపోయారు. ఈ రెండు సంఘటనలలో ఇంట్లో ఎవరికో ఒకరికి పూజలూ, ప్రాణాలను అర్పించడాలపై నమ్మకం కలిగింది. కాకపోతే అక్కడ లలిత్భాటియా నమ్మాడు. అలాగే మదనపల్లెలో కుటుంబపెద్ద పురుషోత్తం నాయుడో లేదా అతడి భార్య పద్మజనో నమ్మారనుకుందాం. మరి కూతుళ్ల విచక్షణ ఏమైంది? ఆ పూజలతో తాము తిరిగి బతుకుతామనే నమ్మకానికి ఎందుకు వచ్చారనే ప్రశ్నలు ఉద్భవిస్తాయి. అలా ఒకరి నమ్మకాన్ని... కుటుంబసభ్యులందరూ కలిసి బలంగా విశ్వసించి, అలా తాను నమ్మిన సైకోటిక్ వైఖరిని మిగతావారికీ ‘షేర్’ చేసే వ్యాధి పేరే ‘‘షేర్డ్ సైకోసిస్’’. ఢిల్లీలో కుటుంబపెద్ద విశ్వాసానికి 11 మంది ప్రాణాలు కోల్పోతే... మదనపల్లె సంఘటనలో మంచి భవిష్యత్తు ఉన్న యువతులు తమ జీవితాలను కోల్పోయారు. పైగా ఈ సంఘటనలో పురుషోత్తం నాయుడు భార్య పద్మజ తనను తాను శివుని అంశగానూ, కొన్నిసార్లు, శివుడిగానే కొన్నిసార్లు భ్రమిస్తున్నారు. ఇలా భ్రాంతులకు (డెల్యూషన్స్కు) గురవడాన్ని డెల్యూషనల్ డిజార్డర్‌గా కూడా చెప్పవచ్చు. ఇక్కడ ఆ కుటుంబం రెండు రకాల డెల్యూషన్స్లో ఉంది. ఒకటి షేర్డ్ సైకోసిస్ డిజార్డర్ కాగా ఆమె భ్రాంతులతో కూడిన డెల్యుషన్ డిజార్డర్‌తోనూ బాధపడుతున్నారు. ఇక్కడ ఈ భార్యాభర్తల్లో ఎవరో ఒకరు మరొకర్ని ప్రభావితం చేసి ఉండవచ్చు. దాంతో భార్యాభర్తలలో సైకోసిస్ ‘షేర్’ అయి ఉండవచ్చు. ‘షేర్డ్ సైకోసిస్’ అంటే? ఇది భ్రాంతులు కలిగించే ఒక రుగ్మత. దీన్నే ఇండ్యూస్డ్ డెల్యూజన్ డిజార్డర్ అని కూడా అంటారు. ఈ భ్రాంతి రుగ్మతకు వైద్యపరమైన మరో ఫ్రెంచ్ పేరు కూడా ఉంది. అదే ‘ఫోలీ ఎ డ్యుయో’ అంటే వాస్తవంగా డ్యుయో అంటే రెండు అని అర్థం. మదనపల్లె ఉదంతంలోనూ భార్యాభర్తలు ఇరువురి లో ఒకరు మరొకరిని ప్రభావితం చేసి ఉండవచ్చు. అలాంటప్పుడు ఇది ‘ఫోలీ ఏ డ్యూయో’ అవుతుంది. ఒకవేళ ఇది కుటుంబ సభ్యుల్లో ఇద్దరికంటే ఎక్కువగా చాలామందికి వచ్చిందనుకోండి. అప్పుడు దీన్నే ‘ఫోలీ ఎన్ ఫ్యామిలే’ అంటారు. కానీ కూతుళ్లు ప్రభావితమయ్యారో లేదో అని ముందే అనుకున్నాం. ఒకవేళ అదే కుటుంబాన్ని దాటి ఇంకా చాలామందికి వచ్చిందనుకోండి. అప్పుడు దాన్ని ‘ఫోలీ ఎ ప్లసియర్స్’ అంటారు. ఇక మదనపల్లె దంపతుల్లో వారు యుగాంతం వస్తుందని నమ్మారు. ఇలా నమ్మడాన్ని ‘నిహిలిస్టిక్ డెల్యూషన్స్’ అంటారు. ఇలా ఆ దంపతులు ఈ నిహిలిస్టిక్ డెల్యూజన్స్ అనే మరో భ్రాంతికీ గురయ్యారు. ఢిల్లీలోని బురారీ కుటుంబంలో ఒకరు ప్రేరేపించడం వల్ల అందరూ ఆత్మహత్యలు చేసుకుంటే, మదనపల్లెలో మళ్లీ బతుకుతారంటూ తల్లిదండ్రులే కూతుళ్లను చంపేశారు. పోలీసులు రావడం ఆలస్యమైతే వారూ చనిపోయేరంటూ వస్తున్న వార్తలను బట్టి చూస్తే ఇది కూడా షేర్డ్ సైకోసిస్‌లోని పోలీ ఎన్ ఫ్యామిలే అనేందుకే ఆస్కారం ఎక్కువగా కనిపిస్తోంది. షేర్డ్ సైకోసిస్ అనే ఈ రకమైన సైకియాట్రీ ప్రవర్తనను, రుగ్మతను ఫ్రెంచ్ సైకియాట్రిస్ట్‌లు అయిన చార్లెస్ లేసెగ్, జీన్ పెర్రీ ఫార్లెట్ను 19వ శతాబ్దంలో కనుగొన్నారు. అందుకే దీన్ని లేసెగ్–ఫార్లెట్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఈ వ్యాధిలోని చిత్రం ఏమిటంటే... కనీసం ఇద్దరు భ్రాంతులకు గురైనప్పుడు కానీ దీన్ని గుర్తించడం సాధ్యం కాదు. గుర్తించడమెలా? తమకు ఎవరెవరో కనిపిస్తున్నారనీ, ఏవేవో వినిపిస్తున్నాయనీ చెప్పే స్కీజోఫ్రీనియా వంటి లక్షణాలు వీరిలోనూ కనిపిస్తాయి. పైగా వీరిలో కొందరు అందరికీ కనిపించే తాను తాను కాదనీ, తాను దైవాన్ననీ చెబుతూ ఉంటారు. యుగాంతం సంభవించబోతుందని అంటారు. రకరకాల భ్రాంతులకు గురవుతూ అవి నిజమని నమ్ముతుంటారు. చికిత్స ఇలాంటి సైకోటిక్ రుగ్మతలు కౌన్సెలింగ్‌తో తగ్గవు. తప్పనిసరిగా మందులతో చికిత్స తీసుకోవాల్సిందే. పేషెంట్స్ మెదడులో జరిగిన మార్పుల కారణంగా ఆ భ్రాంతులు వాళ్లవరకు నిజమే. కానీ ఆరోగ్యవంతులు అది సరికాదంటూ వారితో వాదించకూడదు. అందుకే పేషెంట్స్‌తో వ్యవహరించాల్సిన తీరుపై కుటుంబసభ్యులకు కొంత కౌన్సెలింగ్ అవసరమవుతుంది. కానీ ఈ వ్యాధులు కౌన్సెలింగ్‌తో తగ్గవు. ఈ తరహా రోగులకు యాంటీసైకోటిక్ మందులు, యాంగై్జటీని తగ్గించే మందులు, నిద్రలేమికి ఇవ్వాల్సిన ట్రాంక్విలైజర్లతో చికిత్స చేయాల్సి రావచ్చు. ఏమిటీ డెల్యూషన్ డిజార్డర్లు షేర్డ్ సైకోసిస్’కు వ్యక్తులు ఎందుకు, ఎలా గురవుతారో తెలుసుకునే ముందర... అసలు సైకోసిక్ అనే మానసిక రుగ్మతకు ఎలా గురవుతారోతెలుసుకోవాలి. మన మెదడులో పది పక్కన పన్నెండు సున్నాలు పెట్టినంత పెద్ద సంఖ్యలో నాడీకణాలు ఉంటాయి. మళ్లీ ఒక్కో కణానికీ పక్కనున్న పొరుగు కణాలతో అనేక కనెక్షన్లు ఉంటాయి. ఈ కనెక్షన్ల మధ్య కొన్నిచోట్ల ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఖాళీ స్థలంలో మెదడుకు సంబంధించిన కొన్ని రసాయనాలు ఉంటాయి. మెదడులోని రసాయనాలలో డోపమైన్, సెరిటోనిన్, ఎపీనెఫ్రిన్ వంటివి కొన్ని రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలు తమ నార్మల్ స్థాయిని దాటి పెరిగినప్పుడు ‘సైకోటిక్ డిజార్డర్స్’ వస్తాయి. అంటే నిజానికి ఏ సంఘటనా జరగకపోయినా, మెదడు లో ఈ రసాయనాల మార్పులు జరిగినప్పుడు... వారికి నిజంగా ఏదో జరిగినట్లు భ్రాంతి కలుగుతుంది. అలా జరగని సంఘటనను జరిగినట్లుగా భావించే అనుభూతినే ఇంగ్లిష్‌లో ‘హేలూసినేషన్స్’ అంటారు. ఈ హేలూసినేషన్స్తో సైకోసిస్‌కు గురైన వారు మళ్లీ... ఇతరులను ప్రభావితంచేస్తే... పక్కవారిలోనూ కనిపించే మానసిక సమస్యనే ‘షేర్డ్ సైకోసిస్’ అంటారు. దాంతోపాటు తల్లిదండ్రులిద్దరూ డెల్యూషన్ డిజార్డర్‌తోనూ బాధపడుతున్నారు. డాక్టర్ శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై హెచ్ఓడీ అండ్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ, ఎమ్జీఎమ్ గవర్నమెంట్ హాస్పిటల్, వరంగల్ సూచన: ఎవరైనా విచిత్రంగా, వింతగా వ్యవహరించడం, వాళ్ల ఆలోచనలూ అసాధారణంగా ఉండి, వివరణలకు అందకుండా ఉండటం వంటి లక్షణాలతో మానసిక రుగ్మతలను తేలిగ్గా గుర్తించవచ్చు. ఇలా ఎవరైనా ప్రవర్తిస్తూ ఉంటే వారిని తక్షణం గుర్తించి, వీలైనంత త్వరగా వారిని సైకియాట్రిస్ట్‌ల దగ్గరికి తీసుకెళ్లడం అవసరం. -
అనుమానం అంతం చేసింది
సాక్షి, హైదరాబాద్: ప్రేమ అన్నాడు. సహజీవనం చేశాడు. ఓ కుమార్తె జన్మకు కారణమయ్యాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం.. ఆమె వేరొకరితో సన్నిహితంగా ఉండటంతో ప్రేమికురాలిని దారుణంగా చంపాడు. కుమార్తెను, ప్రేమికురాలి తల్లిని కూడా హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లా చందానగర్‌లో శనివారం జరిగిన ఈ మూడు హత్యల ఉదంతం సోమవారం ఉదయం వెలుగు చూసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన గుడూరి జయమ్మ(50)కు కుమార్తె అపర్ణాదేవి(33), కుమారుడు వంశీకృష్ణ ఉన్నారు. అపర్ణ అమ్మమ్మ ఊరు పాలకొల్లు మండలం ఉల్లంపర్రు. అదే గ్రామానికి చెందిన రావాడ మధు కేపీహెచ్బీలో సెల్ఫోన్లు రిపేర్ చేస్తుంటాడు. అమ్మమ్మ ఇంటికి వెళ్లినప్పుడు పదేళ్ల క్రితం మధుతో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అప్పటికే తనకు వివాహమై ఇద్దరు పిల్లలున్నారన్న విషయాన్ని దాచి అపర్ణతో సహజీవనం చేయసాగాడు. వీరికి ఐదేళ్ల వయస్సున్న పాప కార్తీకేయ కూడా ఉంది. చందానగర్‌లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో ఎల్జీ ప్రమోటర్‌గా పనిచేస్తున్న అపర్ణ ప్రస్తుత ఫ్లాట్‌లో రెండున్నర నెలలుగా తల్లి, కుమార్తెతో కలసి ఉంటోంది. దుర్వాసన రావడంతో వెలుగులోకి ... బయట నుంచి తాళం వేసిన ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని నారాయణరావు అనుమానం వచ్చి వెనక వైపు కిటికీలో నుంచి చూశాడు. హత్యకు గురైన అపర్ణ కాళ్లు కనిపించాయి. ఎంత పిలిచినా పలకలేదు. దీంతో సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. కిచెన్‌లో రక్తపు మడుగులో పడి అపర్ణ మృతి చెంది ఉంది. బెడ్‌పై జయమ్మ, కార్తికేయ తనువు చాలించి ఉన్నారు. అపర్ణ తలపై బలంగా కొట్టి చంపినట్టుగా అనవాళ్లు ఉన్నాయని చెప్పిన పోలీసులు చెప్పారు. జయమ్మ, కార్తికేయ ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని తెలిపారు. క్లూస్ టీం, ప్రత్యేక డాగ్ స్క్వాడ్లు ఘటనాస్థలాన్ని పరిశీలించాయి. ఘటనాస్థలిని సైబరాబాద్ జాయింట్ పోలీసు కమిషనర్ షానవాజ్ ఖాసీం, మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ పరిశీలించారు. షానవాజ్ ఖాసీమ్ మాట్లాడుతూ ‘అపర్ణను తలపై రోకలిబండతో మోది కిచెన్‌లో హత్య చేశారు. బెడ్‌పై పడుకున్న జయమ్మ, కార్తికేయను గొంతుకు పిసికి చంపి ఉండొచ్చు. లేదంటే విషమిచ్చి చంపి ఉండవచ్చ’న్నారు. హత్య చేసిన అనంతరం బయటి నుంచి తాళం వేసి వెళ్లిపోయాడన్నారు. సీసీటీవీ కెమెరాల పరిశీలన... హత్య ఎప్పుడు, ఎవరు చేశారనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు వేముకుంటలోని ఫ్లాట్ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. అపర్ణ సెల్‌ఫోన్ కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. చందానగర్‌లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ నుంచి శనివారం 2.48 గంటలకు విధుల్లో నుంచి బయటకు వస్తున్నట్టుగా సీసీటీవీలో రికార్డయింది. భోజనం చేసి వస్తానని చెప్పి వెళ్లిన అపర్ణ రాకపోవడంతో 3.30 గంటలకు సహచర ఉద్యోగి ఫసీయుద్దీన్ ఫోన్ చేయగా కలవలేదు. రెండు నెలలుగా గొడవ... అపర్ణతో సహజీవనం చేస్తున్న మధు తరచూ వేముకుంటలోని నివాసానికి వస్తుండేవాడు. అయితే, అపర్ణను వదిలేయంటూ మొదటి భార్య నుంచి ఒత్తిడి ఎక్కువ కావడం, అదే సమయంలో పెళ్లి చేసుకోవాలంటూ అపర్ణ కూడా బలవంతం చేస్తుండడంతో ఇద్దరి మధ్య రెండు నెలల నుంచి గొడవలు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ హత్యలు చోటుచేసుకున్నాయి. అయితే, అపర్ణతో తాను సహజీవనం చేస్తున్నానని, మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకనే హత్య చేశానని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిసింది. శనివారం మధ్యాహ్నం అపర్ణ ఇంటికి రాగానే తలుపు తీశానని, వెంటనే ఆమె తలను గోడకేసి బాది చంపానని నిందితుడు అంగీకరించినట్లు తెలిసింది. -
‘అపర్ణ వేరే వ్యక్తితో చనువుగా ఉంటుందనే హత్య చేశా’
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని చందానగర్‌లో ట్రిపుల్ మర్డర్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు మధు సోమవారం చందానగర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మూడు హత్యలను తానే చేసినట్లు అతడు అంగీకరించాడు. పోలీసుల విచారణలో అతడు పలు విషయాలు వెల్లడించాడు. ‘ అపర్ణతో పదేళ్లుగా సహజీవనం చేస్తున్నాను. అయితే ఆమె వేరే వ్యక్తితో చనువుగా ఉంటుంది. దాన్ని సహించలేకే హత్య చేశారు. ముందుగా కార్తికేయ, అపర్ణ తల్లి విజయమ్మను గొంతు నులిమి చంపాను. ఆ తర్వాత అపర్ణను గోడకేసి కొట్టి చంపాను.’ అని తెలిపాడు. కాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన అపర్ణ .. కూకట్‌పల్లికి చెందిన మధుతో కలిసి చందానగర్‌లో నివాసం ఉంటోంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. ప్రముఖ ఎలక్ర్టానిక్ కంపెనీలో అపర్ణ సేల్స్ ఉమెన్‌గా పనిచేస్తుండగా.. ఆమెతో పాటు తల్లి విజయలక్ష్మి కూడా ఉంటోంది. రెండు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడం.. ఇంటి నుంచి వాసన రావాడాన్ని సోమవారం ఉదయం గమనించిన వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళాలు పగులగొట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బలమైన గాయాలతో.. రక్తపు మడుగులో అపర్ణ కిచెన్‌లో.. ఆమె తల్లి, కుమార్తె ఒక గదిలో హత్యకు గురయ్యారు. అయితే మధు ఇది వరకే జరిగిన పెళ్లిని దాచిపెట్టి తనను రెండో పెళ్లి చేసుకున్నాడని ఇటీవల అపర్ణకు, భర్త మధుకు మధ్య గొడవలు జరిగాయని తెలుస్తోంది. దీంతో ఇరువురు చందానగర్ పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మధు.. అపర్ణను, కుమార్తెను సరిగా చూసుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే మధు మొదటి భార్య కుటుంబం, అపర్ణను బెదిరించినట్టు కూడా చెబుతున్నారు. తన భర్తను మోసం చేసి రెండో పెళ్లి చేసుకుందని అపర్ణపై, మొదటి భార్య కుటుంబ సభ్యులు ద్వేషం పెంచుకున్నట్టు తెలుస్తోంది. -
చందానగర్‌లో కుటుంబం హత్య కలకలం
-
ట్రిపుల్ మర్డర్: అపర్ణ భర్త లొంగుబాటు
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలోని శేరలింగపల్లిలో ఓ కుటుంబం హత్య గురికావడం కలకలం రేగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన అపర్ణ అనే మహిళకు కూకట్‌పల్లికి చెందిన మధు అనే వ్యక్తితో ప్రేమ వివాహం జరిగింది. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. ప్రముఖ ఎలక్ర్టానిక్ కంపెనీలో అపర్ణ సేల్స్ ఉమెన్‌గా పనిచేస్తుండగా.. ఆమెతో పాటు తల్లి విజయలక్ష్మి కూడా ఉంటోంది. రెండు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడం.. ఇంటి నుంచి వాసన రావాడాన్ని సోమవారం ఉదయం గమనించిన వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళాలు పగులగొట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బలమైన గాయాలతో.. రక్తపు మడుగులో అపర్ణ కిచెన్‌లో.. ఆమె తల్లి, కుమార్తె ఒక గదిలో హత్యకు గురయ్యారు. అయితే మధు ఇది వరకే జరిగిన పెళ్లిని దాచిపెట్టి తనను రెండో పెళ్లి చేసుకున్నాడని ఇటీవల అపర్ణకు, భర్త మధుకు మధ్య గొడవలు జరిగాయని తెలుస్తోంది. దీంతో ఇరువురు చందానగర్ పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మధు.. అపర్ణను, కుమార్తెను సరిగా చూసుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే విధంగా మధు మొదటి భార్య కుటుంబం, అపర్ణను బెదిరించినట్టు కూడా చెబుతున్నారు. తన భర్తను మోసం చేసి రెండో పెళ్లి చేసుకుందని అపర్ణపై, మొదటి భార్య కుటుంబ సభ్యులు ద్వేషం పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ కారణాలతో అపర్ణ, ఆమె తల్లి, కుమార్తె హత్యకు గురయ్యారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు అపర్ణ భర్త మధు ఇవాళ మధ్యాహ్నం చందానగర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. -
కృపాకర్ కుటుంబం హత్య కేసులో ఐజాక్ అరెస్ట్
కడప: కడపలో సంచలనం కలిగించిన కృపాకర్ కుటుంబం హత్య కేసులో ఆయన తండ్రి రాజారత్నం ఐజాక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. శాంతి సంఘం జిల్లా అధ్యక్షుడు, జియోన్ స్కూల్ యజమాని రాజారత్నం ఐజక్ కుమారుడు కృపాకర్, కోడలు మౌనికతోపాటు ముగ్గురు పిల్లలు ఏడాది క్రితం మాయమయ్యారు. మౌనిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కుటుంబ సభ్యులు ఐదుగురూ హత్యకు గురైనట్టు విచారణలో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రామంజనేయ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేయగా, మరో నిందితుడిగా ఉన్న రాజారత్నంను అదుపులోకి తీసుకున్నారు. -
వీడిన కృపాకర్ కుటుంబం హత్య కేసు మిస్టరీ
కడప: కడపలో ఏడాది క్రితం జరిగిన ఓ కుటుంబం హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. శాంతి సంఘం జిల్లా అధ్యక్షుడు, జియోన్ స్కూల్ యజమాని రాజారత్నం ఐజక్ కుమారుడు కృపాకర్, కోడలు మౌనికతోపాటు ముగ్గురు పిల్లలు ఏడాది క్రితం మాయమయ్యారు. మౌనిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కుటుంబ సభ్యులు ఐదుగురూ హత్యకు గురైనట్టు విచారణలో తేలింది. కృపాకర్ తన భార్య మౌనిక వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో హత్యకు పథకం వేసినట్టు జిల్లా ఎస్పీ నవీన్ చెప్పారు. కృపాకర్ భార్య మౌనికతో పాటు ముగ్గురు పిల్లలను హత్య చేయించినట్టు తెలిపారు. అనంతరం కృపాకర్ ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్పీ చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రామంజనేయ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. ఈ విషయాలన్నీ తెలిసినా రాజారత్నం నిజాన్ని బయటపెట్టలేదని, ఆయన్ను కూడా అరెస్ట్ చేస్తామని ఎస్పీ చెప్పారు. జియోన్ స్కూల్ ఆవరణలోనే మృతదేహాలను పాతిపెట్టినట్టు ఎస్పీ తెలిపారు. అయిదుగురి అస్థిపంజరాలు వెలికి తీశారు. ........... -
కడపలో సంచలనం :ఓ ప్రముఖ కుటుంబం హత్య!
కడప: నగరంలో ఏడాది క్రితం మాయమైన ఓ ప్రముఖుడి కుటుంబానికి చెందిన అయిదుగురు హత్యకు గురయ్యారు. ఈ వార్త కడపలతో సంచలనం సృష్టించింది. శాంతి సంఘం జిల్లా అధ్యక్షుడు, జియోన్ స్కూల్ యజమాని రాజారత్నం ఐజక్, కుమారుడు కృపాకర్, కోడలు మౌనికతోపాటు ముగ్గురు పిల్లలు ఏడాది క్రితం మాయమయ్యారు. రాజారత్నం ఐజక్కు నగరంలో మంచి పేరుంది.నగర ప్రముఖులు అందరితో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. సభలు, సమావేశాలలో ఆయన ఎక్కువగా పాల్గొంటుంటారు.ఈ కుటుంబం మొత్తం ఏడాది నుంచి కనిపించడంలేదని మౌనిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కుటుంబానికి చెందినవారిని తానే హత్య చేసినట్లు ఓ నిందితుడు పోలీసులకు చెప్పాడు. మృతదేహాలను జియోన్ స్కూల్ ఆవరణలోనే పాతిపెట్టినట్లు తెలిపాడు. దాంతో పోలీసులు అక్కడ తవ్వకాలు మొదలుపెట్టారు. అయిదుగురి అస్థిపంజరాలు వెలికి తీశారు. కిరాయి హంతకులు ఈ హత్యలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల దృష్టిలో అయిదారుగురు నిందితులు ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాల కారణంగా ఈ హత్యలు జరిగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. తవ్వి బయటకు తీసిన అస్థిపంజరాలు కృపాకర్, అతని భార్య మౌనిక, ముగ్గురు పిల్లలివిగా భావిస్తున్నారు. అయితే పోస్ట్‌మార్టం తరువాత మాత్రమే ఆ అస్థిపంజరాలు ఎవరివినేది తెలుస్తుందని పోలీసులు చెప్పారు. పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. వారి అస్థిపంజరాలు దొరికనప్పటికీ అవి ఎవరివి, హత్యలు ఎలా జరిగాయి, ఎవరు హత్యలు చేశారు, ఎందుకు హత్యలు చేశారు....తదితర విషయాలు తెలియవలసి ఉంది. ** -
ఓ ప్రముఖ కుటుంబం హత్య!