Tripura Teen Murdered Four Members Of His Family With An Axe - Sakshi
Sakshi News home page

17ఏళ్ల రాక్షసుడు.. క్రైమ్‌ షోలు చూసి నలుగురు కుటుంబ సభ్యులను చంపేశాడు

Published Sun, Nov 6 2022 3:31 PM | Last Updated on Sun, Nov 6 2022 3:48 PM

Tripura Teen Murdered Four Members Of His Family With An Axe - Sakshi

తల్లి, సోదరి సహా మొత్తం నలుగురు కుటుంబ సభ్యులను దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు ఓ 17ఏళ్ల రాక్షసుడు...

అగర్తల: క్షణికావేశంలో దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు వ్యక్తులు. సొంతవారినే పొట్టనబెట్టుకుంటున్నారు. తల్లి, సోదరి సహా మొత్తం నలుగురు కుటుంబ సభ్యులను దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు ఓ 17ఏళ్ల రాక్షసుడు. ఆ తర్వాత వారి మృతదేహాలను బావిలో పడేశాడు. ఈ దారుణ సంఘటన త్రిపురలోని ధలాయ్‌ జిల్లాలోని మారుమూల గ్రామంలో జరిగింది. నిందితుడిని ఆదివారం అరెస్ట్‌ చేశారు పోలీసులు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి కుటుంబం మొత్తం ఇంట్లో నిద్రపోతోంది. ఈ క్రమంలో తాత, తల్లి, సోదరి, అత్తమ్మలను గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు బాలుడు. నిందితుడిని ఆదివారం ఉదయం మార్కెట్‌ సమీపంలో అరెస్ట్‌ చేశారు. ‘ఓ మైనర్‌ బాలుడు తన నలుగురు కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేశాడు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని అరెస్ట్‌ చేశాం. నేరానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. బాలుడి తండ్రి ఇంటికి వచ్చి చూడగా.. ఎక్కడ చూసినా రక్తంతో నిండిపోయి కనిపించింది. మృతదేహాలు సమీపంలోని బావిలో పడేశాడు.’ అని త్రిపుర పోలీసులు వెల్లడించారు.  

నిందితుడు టీవీకి బానిసయ్యాడని, తరుచూ క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ షోలు చూస్తుంటాడని స్థానికులు తెలిపారు. గతంలో సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డాడని, ఈ హత్యలు చేస్తున్నప్పుడు ఇంట్లో సౌండ్‌ పెంచి మ్యూజిక్‌ ప్లే చేసినట్లు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: యాక్సిడెంట్‌గా చిత్రీకరించి మర్డర్‌కి ప్లాన్‌! మాజీ ఇంటిలిజెన్స్‌ ఆఫీర్‌ మృతి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement