axe attack
-
నిద్రమత్తులో ఉన్న భార్యపై గొడ్డలితో దాడి..ఆపై భర్త కూడా..
సాక్షి, పరిగి: నిద్రమత్తులో ఉన్న భార్యను గొడ్డలికామతో తలపై కొట్టి హత్య చేసి.. ఆపై దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కావలి భీమయ్య (55) కావలి పెంటమ్మ(50) దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వీరి వివాహం చేసి అత్తవారిళ్లకు పంపించారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా కొద్ది రోజులుగా భీమయ్య మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో వైద్యం చేయిస్తున్నారు. ఎప్పటిలాగే దంపతులిద్దరూ గురువారం రాత్రి భోజనాలు ముగించుకుని నిద్రకు ఉపక్రమించారు. ఈ సమయంలో పెంటమ్మ నిద్రలోకి జారుకోగా భీమయ్య లేచి గొడ్డలి కామతో ఆమె తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. భార్య చనిపోయిందనే భయంతో భీమయ్య కూడా దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూలీ పనికి తీసుకెళ్లేందుకు పెంటమ్మ వద్దకు వచ్చిన గ్రామస్తులు తలుపులు గడియ పెట్టి ఉండటాన్ని గమనించారు. ఎన్నిసార్లు పిలిచినా స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. అందరూ వచ్చిన తర్వాత గడియ పగలగొట్టి చూడగా.. పెంటమ్మ రక్తపు మడుగులో పడి ఉంది. భీమయ్య దూలానికి వేలాడుతూ కనిపించాడు. వీరి పెద్ద కూతురు కృష్ణవేణి అత్తవారి ఇంటి వద్ద జరుగుతున్న భూవివాదాల నేపథ్యంలో మృతులు కొంతకాలంగా మనస్తాపానికి గురవుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే భీమయ్య మతిస్థిమితం కోల్పోయినట్లు సమాచారం. కూతురు కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ విఠల్‌రెడ్డి తెలిపారు. (చదవండి: మన్నెగూడ కేసు: రహస్య ప్రాంతంలో వైశాలి.. జాడలేని నవీన్ రెడ్డి) -
క్రైమ్ షోల ఎఫెక్ట్.. కుటుంబాన్ని గొడ్డలితో నరికి చంపిన బాలుడు
అగర్తల: క్షణికావేశంలో దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు వ్యక్తులు. సొంతవారినే పొట్టనబెట్టుకుంటున్నారు. తల్లి, సోదరి సహా మొత్తం నలుగురు కుటుంబ సభ్యులను దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు ఓ 17ఏళ్ల రాక్షసుడు. ఆ తర్వాత వారి మృతదేహాలను బావిలో పడేశాడు. ఈ దారుణ సంఘటన త్రిపురలోని ధలాయ్ జిల్లాలోని మారుమూల గ్రామంలో జరిగింది. నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి కుటుంబం మొత్తం ఇంట్లో నిద్రపోతోంది. ఈ క్రమంలో తాత, తల్లి, సోదరి, అత్తమ్మలను గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు బాలుడు. నిందితుడిని ఆదివారం ఉదయం మార్కెట్ సమీపంలో అరెస్ట్ చేశారు. ‘ఓ మైనర్ బాలుడు తన నలుగురు కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేశాడు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశాం. నేరానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. బాలుడి తండ్రి ఇంటికి వచ్చి చూడగా.. ఎక్కడ చూసినా రక్తంతో నిండిపోయి కనిపించింది. మృతదేహాలు సమీపంలోని బావిలో పడేశాడు.’ అని త్రిపుర పోలీసులు వెల్లడించారు. నిందితుడు టీవీకి బానిసయ్యాడని, తరుచూ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ షోలు చూస్తుంటాడని స్థానికులు తెలిపారు. గతంలో సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డాడని, ఈ హత్యలు చేస్తున్నప్పుడు ఇంట్లో సౌండ్ పెంచి మ్యూజిక్ ప్లే చేసినట్లు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: యాక్సిడెంట్‌గా చిత్రీకరించి మర్డర్‌కి ప్లాన్! మాజీ ఇంటిలిజెన్స్ ఆఫీర్ మృతి -
Viral video: రోడ్డుపై గొడ్డలితో రెచ్చిపోయిన ట్రాఫిక్ పోలీస్!
చండీగఢ్: రోడ్డుపై ట్రాఫిక్ నియంత్రణ చేయటం అంత సులభమైన పనేమి కాదు. నిత్యం ఎండలో నిలబడి ట్రాఫిక్ సూచనలు చేస్తుంటారు ట్రాఫిక్ పోలీసులు. కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోతుంటారు. అలా.. రోడ్డుపై గొడ్డలి పట్టుకుని వాహనదారులను బెదిరిస్తూ హల్చల్ చేస్తున్న ఓ ట్రాఫిక్ పోలీసు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన హర్యానాలోని ఫరిదాబాద్‌లో జరిగింది. ఈ వీడియోలో.. ఓ బైక్‌పై ముగ్గురు యువకులు రాగా.. వారి వైపు గొడ్డలితో దూసుకెళ్లారు పోలీసు. వారిని కాలితో తన్నుతున్నట్లు కనిపిస్తోంది. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించకపోవటం, ముగ్గురు ఎక్కటంతో అలా చేసినట్లు తెలుస్తోంది. హెల్మెట్ ధరించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ గొడ్డలి పట్టుకుని బైక్‌పైన ఉన్న వారిని బెదిరించారు. వెనక్కి వెళ్లిపోవాలంటూ గద్దరించారు. మంగళవారం ఉదయం ఫరిదాబాద్‌లోని బాటా చౌక్‌లో ఈ సంఘటన జరిగింది. వీడియో వైరల్‌గా మారిన క్రమంలో ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ‘ దర్యాప్తునకు ఆదేశించాం. వీడియోలోని వ్యక్తిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. ఆ గొడ్డలిని వాహనదారుల నుంచి లాక్కున్నట్లు తెలిసింది. నిజానిజాలు వెల్లడైన తర్వాత చర్యలు తీసుకుంటాం.’ అని హర్యానా పోలీస్ ప్రతినిధి సుబే సింగ్ తెలిపారు. ఇదీ చదవండి: Viral Video: ‘మై దునియా సే నికల్ జావూంగా’.. పిల్లాడి హోమ్ వర్క్ ఫ్రస్ట్రేషన్ చూడండి! -
భూతగాదాలకు దంపతులు బలి
పాలకుర్తి(రామగుండం): భూతగాదాలు దంపతుల హత్యకు దారితీశాయి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రామారావుపల్లికి చెందిన మంచినీళ్ల వెంకటి (55), తమ్ముడు రాజయ్య మధ్య కొన్నేళ్లుగా భూవివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో రాజయ్య కుమారుడు రవితేజ గురువారం పొలం వద్దకు వెళ్లి బావి నీటి విషయమై వెంకటితో ఘర్షణ పడ్డాడు. గొడ్డలితో దాడి చేయడంతో ప్రాణాలొదిలిన వెంకటిని లాక్కెళ్లి సమీపంలోని పొదల్లో పడేశాడు. పొలంలో కలుపుతీస్తున్న వెంకటి భార్య కనకమ్మ గమనించి పరుగెత్తుకుంటూ వస్తుండగా ఆమెపైనా గొడ్డలితో దాడి చేశాడు. దీంతో కనకమ్మ అక్కడికక్కడే కుప్పకూలింది. అనంతరం నిందితుడు బసంత్‌నగర్ పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. మృతిచెందిన వెంకటి దంపతులకు కూతురు రాధ, కుమారుడు రమేష్ ఉన్నారు. రాధకు వివాహం కాగా, రమేష్ కరీంనగర్‌లోచదువుకుంటున్నాడు. వెంకటి గతంలో గ్రామ ఎంపీటీసీగా పనిచేశారు. పంపకాల్లో తేడాలతోనే... వెంకటి, రాజయ్యల వారసత్వ భూమిలో ఇదివరకు సబ్సిడీ బావిని తవ్వారు. భూపంపకాల అనంతరం ఆ బావిలో రాజయ్యకు వాటా లేదని వెంకటి అనడంతో వివాదం మొదలైంది. ఆరేళ్లుగా ఇరువురి మధ్య వ్యవసాయబావి, భూముల విషయమై తరచూ గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. వివాదం పోలీసుస్టేషన్ వరకు వెళ్లినా అది సివిల్ సమస్య కావడంలో పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే రవితేజ పథకం ప్రకారం పెద్ద నాన్న, పెద్దమ్మను గొడ్డలితో నరికి చంపాడని గ్రామస్థులు భావిస్తున్నారు. కాగా, ఐదేళ్ల క్రితం ఆస్తి తగాదాల నేపథ్యంలో గ్రామానికి చెందిన కొండ గట్టయ్య దంపతులను వారి కుమారులు కల్లుగీత కత్తితో గొంతులు కోసి హత్య చేశారు. ప్రస్తుతం అదేరీతిన భూవివాదాల నేపథ్యంలో సొంత పెద్దమ్మ, పెద్దనాన్నను కుమారుడి వరసైన యువకుడు గొడ్డలితో హత్య చేసి చంపాడు. -
రూ.70 కోసం వాగ్వాదం: గొడ్డలితో దాడి
ఖమ్మం అర్బన్: కేవలం రూ.70 కోసం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడి చివరకు గొడ్డలితో దాడి చేసుకునేంత వరకు దారి తీసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా ధంసలాపురంలోని కొత్తకాలనీకి చెందిన ఆటో డ్రైవర్ కొమ్ము ఉప్పలయ్య సమీప బంధువైన కొమ్ము కోటయ్యకు రూ.70 ఎప్పుడో ఇచ్చాడు. అయితే తనకివ్వాల్సిన రూ.70 కోసం బుధవారం రాత్రి అడగ్గా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. స్థానికులు సర్దిచెప్పి పంపించారు. అయినా అది మనస్తాపంలో పెట్టుకుని ఇంటికెళ్లాక కోటయ్య కుమారుడు అశోక్‌కు తెలిసి అతను గొడ్డలి తీసుకెళ్లి ఉప్పలయ్యపై దాడి చేశాడు. భుజానికి తీవ్ర గాయంతో ఆస్పత్రిలో చేరాడు. గురువారం పోలీసులకు ఫిర్యాదు అందింది. -
పొలం గట్టు విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ.. గొడ్డలి తీసుకుని..
మైలవరం (జమ్మలమడుగు రూరల్): పొలం గట్టు విషయం అన్నదమ్ముల మధ్య గొడవకు దారి తీసింది.తమ్ముడిపై అన్న గొడ్డలితో దాడి చేశాడు. మైలవరం మండలం తొర్రివేముల గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ బి.రామకృష్ణ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తొర్రివేముల గ్రామానికి చెందిన గూడెంచెరువు కనకరాజ్, బాలయ్య అన్నదమ్ములు, వీరి మధ్య పొలం గట్టు విషయంలో గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. సోమవారం బాలయ్య తన కుమారుడు సుదర్శన్‌తో కలిసి పొలం పనులు చేసుకుంటుండగా అన్న కనకరాజ్ వచ్చి గొడ్డలితో తలపై దాడి చేశాడు. దీంతో బాలయ్య తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: ఒక్కగానొక్క కూతురు.. అల్లారు మద్దుగా పెంచారు.. పుట్టిన రోజునే.. -
యువకుడిపై గొడ్డలితో దాడి
కొత్తగూడెం రూరల్: పాత కక్షలు మనసులో ఉంచుకున్న కొందరు పుట్టినరోజు వేడుకలకు పిలిచి ఓ యువకుడిపై గొడ్డలితో దాడి చేసిన ఘటన గురువారం అర్ధరాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఇందిరానగర్ కాలనీలో చోటుచేసుకుంది. కొత్తగూడెం పట్టణంలోని గణేశ్ ఆలయం ప్రాంతానికి చెందిన మిర్యాల శ్రీకాంత్‌కు, లక్ష్మీదేవిపల్లి మండలం ఇందిరానగర్ కాలనీలోని సంపత్‌కు మధ్య పాతకక్షలున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సంపత్ పుట్టినరోజు కావటంతో మిర్యాల శ్రీకాంత్‌ను ఇందిరానగర్ వద్దకు గురువారం అర్ధరాత్రి పిలిచారు. కేక్ కోసిన అనంతరం సంపత్‌తోపాటు అతడి స్నేహితులు భరత్, అఖిల్, మరికొందరు ముందుగా తెచ్చుకున్న గొడ్డలి, కర్రలతో శ్రీకాంత్‌పై దాడి చేసి అక్కడ్నుంచి పారిపోయారు. శ్రీకాంత్ శరీరంపై 14 చోట్ల గాట్లు పడి తీవ్రంగా రక్తస్రావమైంది. కేకలు విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా..మెరుగైన చికిత్స కోసం అక్కడ్నుంచి ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై శ్రీకాంత్ సోదరి సింధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
అక్కపై దారుణం, ఎంత పనిచేశావ్ తమ్ముడు
పూణే:"అమ్మా నాన్నలు అక్కని ప్రేమగా చూసుకుంటున్నారు. కానీ నన్ను మాత్రం పట్టించుకోవడం లేదు. నేనేం పాపం చేశాను. ఎందుకు ఈ పార్షియాలిటీ. కూతుర్ని ఎలాగైతే చూసుకుంటున్నారో.. నన్నుకూడా అలాగే చూసుకోవాలి కదా. కానీ అలా చేయడం లేదంటూ" ఆగ్రహం వ్యక్తం చేసిన తమ్ముడు.. నిద్రపోతున్న అక్కపై గొడ్డలితో దాడి చేశాడు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. పూణేలోని హింగ్నే ఖుర్ద్ ప్రాంతానికి చెందిన మనీషా,శంకర్ అక్కా తమ్ముడు. మనీషాకు పెళ్లై తన భర్తతో కలిసి వేరే ప్రాంతంలో నివాసం ఉంటుంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తుంది. అయితే తల్లిదండ్రులను చూసేందుకు పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 5గంటల సమయంలో నిద్రపోతున్న అక్క మనీషాపై తమ్ముడు శంకర్ గొడ్డలితో దాడి చేశాడు. అడ్డొచ్చిన తల్లిదండ్రుల్ని బెదిరించాడు. దాడి జరిగే సమయంలో పక్కనే ఉన్న మనీషా కొడుకు రోహన్ దారుణాన్ని ఆపేందుకు ప్రయత్నించాడు. మేనమామ శంకర్‌ను పక్కకు తోసేసి తీవ్రగాయాల పాలైన తల్లిని ఆస్పత్రికి తరలించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆస్తికోసమే దారుణం..! దర్యాప్తులో భాగంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణ సమయంలో తల్లిదండ్రులు తన అక్క మనీషాను ప్రేమగా చూసుకుంటున్నారని, తనని మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే మనీషా కొడుకు రోహన్ మాత్రం.. వారసత్వం కింద తాతకు చెందిన ఆస్తి మనవడికి రాయడం మేనమామ శంకర్ నచ్చలేదని, అందుకే తన తల్లిపై దాడి చేశాడని తెలిపాడు. -
భార్యమీద కోపంతో వేళ్లు నరికిన కిరాతక భర్త..
భార్య భర్తల మధ్య అలకలు, గొడవలు సాధారణ విషయం. ఎప్పుడు గొడవపడినా కొంత సమయానికి దానిని మరిచిపోయి మళ్లీ నార్మల్ అయిపోయేవారు కొందరైతే, చిన్న చిన్న గొడవలకే ప్రాణాల మీదకు తెచ్చుకునేవారు మరికొందరు. తాజాగా చిన్నగా గొడవపడి నిద్రపోతున్న భార్య వేళ్లను గొడ్డలితో నరికిన భర్త బాగోతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. రాష్ట్రంలోని బేతుల్ జిల్లా చిచోలి గ్రామానికి చెందిన రాజు వన్ష్కర్‌కు అతని భార్యతో కుటుంబ సమస్యలపై తరచూ గొడవలు ఏర్పడేవి. ఈ క్రమంలో ఓ రోజు వీరిద్దరి మధ్య గొడవ తీవ్ర స్థాయికి వెళ్లడంతో.. భార్యపై కోపంతో రగిలిపోయిన రాజు గురువారం(మార్చి25) తెల్లవారుజామున భార్య నిద్రపోతుండగా ఆమెపై దాడికి తెగబడ్డాడు. గొడ్డలితో భార్య చేతి బొటనవేలు, మరో చేతి మూడు వేళ్లను కిరాతకంగా నరికాడు. దీంతో తీవ్రంగా గాయపడిన మహిళను బోపాల్ నగరంలోని హమీదియా ఆసుపత్రికి తరలించారు. భార్య వేళ్లు నరికిన భార్యపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఘటనలో ఓ వ్యక్తి తన భార్య క్యారెక్టర్‌పై అనుమానం వచ్చి తన చేతులను నరికి ఆమెను అడవిలో పడేశాడు. ఈ దారుణ ఘటన ఈనెల 22న మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో జరిగింది. అనంతరం బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు శస్త్ర చికిత్స చేసి ఆమె చేతులను తిరిగి కుట్టేందుకు 9 గంటల సమయం పట్టింది. కాగా రాష్ట్రంలో వరుస దారుణ ఘటనలు చోటుచేసుకుండటంతో సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘోరమైన నేరాలను నివారించేందుకు నిందితులను కఠినంగా శిక్షించేలా కొత్త చట్టాలు రూపొందిస్తామని సీఎం పేర్కొన్నారు. చదవండి: ప్రేమ వివాహం.. భార్యను దారుణంగా కొట్టి మహిళ గొంతు కోసిన కానిస్టేబుల్.. -
విచక్షణ కోల్పోయి: భార్య, కుమారుడిపై...
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, కుమారుడిపై గొడ్డలితో దాడి చేశాడో వ్యక్తి. ఈ సంఘటన నల్లజర్ల మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నల్లజర్ల మండలం జగన్నాధపురానికి చెందిన రాంబాబు(50) కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, కుమారుడు అచ్చారావుపై గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ హుటాహుటిన ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు స్థానికులు. అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ కుమారుడు బుధవారం కన్నుమూశాడు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి : పబ్జీ: ఫోన్ ఇవ్వలేదన్న కోపంతో.. -
దారుణం.. అసలు చేతులెలా వచ్చాయో
ముంబై: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లారు.. ఇంట్లో ఉన్న 3 నుంచి 12 సంవత్సరాల వయసు ఉన్న నలుగురు తోబుట్టువులను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు దుండగులు. వింటినే ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన మహారాష్ట్రలోని జల్గావ్లో చోటు చేసుకుంది. వివరాలు.. మధ్యప్రదేశ్‌కి చెందిన మెహతాబ్, రుమాలి భీలాలా దంపతులు పని నిమిత్తం మహారాష్ట్ర, జల్గావ్ బోర్ఖేడా గ్రామానికి వచ్చారు. వీరికి నలుగురు పిల్లలు సైతా (12), రావల్ (11), అనిల్ (8), సుమన్ (3) ఉన్నారు. ఇక్కడ ముస్తఫా అనే వ్యక్తి పొలంలో పనికి కుదిరారు. ఈ నేపథ్యంలో దంపతులు శుక్రవారం పని నిమిత్తం బయటకు వెళ్లారు. కాసేపటికి వీరి ఇంటికి వచ్చిన పొలం యజమాని ముస్తఫా పిల్లలు రక్తపు మడుగులో పడి ఉండటం చూసి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. పోలీసులకు కూడా తెలపడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. (చదవండి: ఏడాదిగా భార్యను టాయిలెట్లో బంధించి..) దర్యాప్తులో భాగంగా పోలీసులు పిల్లల మృతదేహాల దగ్గర ఒక గొడ్డలిని గుర్తించారు. నిందితుడు పిల్లలందరిని ఈ గొడ్డలితో హత్య చేసి ఉండవచ్చిన పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఒక ఐపీఎస్ అధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అధికారులు. పోస్ట్‌మార్టం నిమిత్తం చిన్నారుల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. -
‘మీ నాన్నను చంపేశాను’
సాక్షి, పూడూరు: మతిస్థితిమితం కోల్పోయిన ఓ మహిళ తాను కట్టుకున్న భర్తపై గొడ్డలితో దాడి చేసి చంపేసింది. వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ అరుణ్‌కుమార్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని సోమన్గుర్తి గ్రామానికి చెందిన మంగళి యాదమ్మ, వెంకటయ్య(60) దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు, ఓ కూతురు ఉండగా వారి వివాహం జరిగింది. యాదమ్మ, వెంకటయ్య గ్రామంలో వేరుగా నివాసముంటున్నారు. అయితే, మూడేళ్లుగా యాదమ్మ మతిస్థిమితం కోల్పోయి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తోందని కుటుంబీకులు తెలిపారు. పలు ఆస్పత్రుల్లో ఆమెకు వైద్యం చేయించారు. కొంతకాలంగా యాదమ్మ మాత్రలు వాడుతోంది. అయితే, గత 15 రోజులగా వినియోగించడం లేదు. ఇదిలా ఉండగా, బుధవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో యాదమ్మ తన భర్త వెంకటయ్య మెడపై గొడ్డలితో తలపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం రక్తం మరకలు నీటితో కడిగేసింది. ఆ తర్వాత గ్రామంలో ఉంటున్న కుమారుడి వద్దకు వెళ్లిన యాదమ్మ ‘మీ నాన్నను చంపేశాను’ అని తెలిపింది. దీంతో కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పరిగి సీఐ మొగులయ్య సందర్శించి వివరాలు సేకరించారు. తానే గొడ్డలితో నరికి చంపినట్లు యాదమ్మ పోలీసులకు చెప్పింది. అయితే, నిందితురాలు భర్త హత్య అనంతరం రక్తం మరకలను శుభ్రం చేయడంతో ఆమెకు మతిస్థిమితం లేకపోవచ్చని సీఐ మొగులయ్య అనుమానం వ్యక్తం చేశారు. ఈమేరకు మృతుడి కుమారుడు మంగళి బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మహిళా హోంగార్డ్‌పై గొడ్డలితో తండ్రి దాడి
పశ్చిమగోదావరి, భీమడోలు: మహిళా హోంగార్డుపై ఆమె తండ్రి గొడ్డలి దాడి చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో మంగళవారం జరిగింది. మహిళా హోంగార్డ్ కుడివైపు మెడపై గొడ్డలితో నరికిన ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే త్రుటిలో ప్రాణాప్రాయస్థితి నుంచి తప్పించుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భీమడోలుకు చెందిన తుమరాడ జ్యోతి నాలుగేళ్లుగా భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డ్‌గా పని చే స్తోంది. ఈమె భర్త హోంగార్డ్‌గా పని చేస్తూ చనిపోవడం వల్ల కారుణ్య నియామకాల్లో ఈ మెకు ఉద్యోగం వచ్చింది. జ్యోతికి ఒక పాప,బాబు ఉన్నారు. పిల్లలతో తండ్రి చీర రామకృష్ణ ఇంట్లోనే నివాసముంటోంది. తండ్రి చీర రామకృష్ణ నిత్యం మద్యం సేవించి అప్పులు చేస్తున్నాడు. ఆ అప్పులు తీర్చాలని జ్యో తిపై రుణదాతలు ఒత్తిడి చేస్తున్నారు. దీనిపై పలుమార్లు తండ్రిని జ్యోతి మందలించింది. అయినా తండ్రి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అదే గ్రామంలో వేరుగా పిల్లలతో నివాసముంటోంది. మంగళవారం మధ్యాహ్నం డ్యూటీ నుంచి భోజనానికి జ్యోతి ఇంటి కి వచ్చింది. ఈ సమయంలో అక్కడకు వచ్చి న తండ్రి రామకృష్ణ జ్యోతితో ఘర్షణ పడ్డాడు. ఒక్కసారిగా ఆగ్రహించి తన వద్ద ఉన్న గొడ్డలితో జ్యోతి మెడపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన జ్యోతిని కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
బాలింత దారుణహత్య
కోనేటినాయునిపాళ్యం (కేఎన్ పాళ్యం)లో దారుణం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన బాలింత హత్యకు గురైంది. దుండగుడు గొడ్డలితో నరికి చంపిన ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కనగానపల్లి: కేఎన్ పాళ్యం గ్రామానికి చెందిన బోయ తిప్పన్న, అంజినమ్మ దంపతుల కుమార్తె భారతి (23)కి రెండేళ్ల కిందట ఇదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ లక్ష్మన్నతో వివాహమైంది. వీరికి ఆరు నెలల కుమారుడు ఉన్నాడు. బాలింత అయిన భారతి మంగళవారం తెల్లవారుజామున బహిర్భూమి కోసం సమీపంలోని ముళ్లపొదల వద్దకు వెళ్లింది. అప్పటికే అక్కడ కాపు కాచిన దుండుగుడు ఒక్కసారిగా ఆమెపైకి దూకాడు. అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న గొడ్డలితో భారతిని విచక్షణారహితంగా నరికి చంపాడు. కాసేపటి తర్వాత హత్య విషయం బయటపడింది. రక్తపుమడుగులో పడి ఉన్న భారతిని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. హత్యాస్థలిని పరిశీలించిన డీఎస్పీ బాలింత హత్యకు గురైనట్లు సమాచారం అందుకున్న ధర్మవరం డీఎస్పీ రామవర్మ, రామగిరి సీఐ యుగంధర్ వెంటనే కేఎన్ పాళ్యం గ్రామానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం పక్కనే రక్తపు మరకలున్న గొడ్డలి, పురుషుడి చెప్పులు పడి ఉన్నాయి. జాగిలాన్ని రప్పించి హత్యాస్థలిని క్షుణ్ణంగా పరిశీలింపజేశారు. జాగిలాలు నేరుగా గ్రామంలోని అంజి అనే యువకుడి ఇంటివద్దకు వెళ్లి ఆగాయి. అయితే ఆ సమయంలో అంజి లేకపోవడంతో అతడి తండ్రి రామప్పతోపాటు కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేసిన అనంతరం కేసు నమోదు చేస్తామని డీఎస్పీ వెల్లడించారు. గతంలో ఒకసారి అంజి అసభ్యంగా ప్రవర్తించడంతో భారతి తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వారు అతడిని మందలించారు. అయినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదని తెలుస్తోంది. -
వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయుల దాష్టీకం
సాక్షి, బెస్తవారిపేట: అధికార పార్టీ టీడీపీ వర్గీయుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తాజాగా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయులు గొడ్డలితో దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పచ్చర్ల వెంకటాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. వైఎస్ఆర్ సీపీ కార్యకర్త తిరుపతిరెడ్డిపై టీడీపీ వర్గీయులు చిన్న పిచ్చయ్య, అతని అనుచరులు గొడ్డలితో దాడికి చేసి దాష్టీకానికి దిగారు. గాయపడ్డ తిరుపతిరెడ్డిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన డాక్టర్లు 13 కుట్లు వేశారు. బాధితుడు తిరుపతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్థలం విషయంలో తనతో గొడవ పడి చిన్న పిచ్చయ్య, మరికొందరు వ్యక్తులు కలిసి తనపై అన్యాయంగా దాడికి పాల్పడ్డారని వాపోయాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇంతలా బరితెగించి దాడులు పాల్పడుతండటంపై స్థానికంగా విస్మయం వ్యక్తమవుతోంది. దాడి చేసిన టీడీపీ వర్గీయులు మద్యం సేవించి ఉన్నారని తెలుస్తోంది. -
నిద్రిస్తున్న అన్నను గొడ్డలితో..
అమ్రాబాద్: నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. సొంత తమ్ముడే నిద్రిస్తున్న అన్నను గొడ్డలితో నరికి చంపాడు. వివరాలు.. బీకే తిర్మలాపురం గ్రామంలోని గెట్టగోని కాశయ్య(34), శ్రీశైలం అనే వ్యక్తులు అన్నదమ్ములు. వీరి మధ్య గత కొంతకాలంగా కుటుంబ తగాదాలు, ఆస్తి గొడవలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో నిద్రిస్తున్న అన్న కాశయ్యను తమ్ముడు గొడ్డలితో నరికి చంపాడు. కాశయ్య భార్య అరుణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జర్మనీలో గొడ్డలితో దొరికినవారిని దొరికినట్లు..
జర్మనీ: విదేశాల్లో వరుస దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఓపక్క అమెరికాలో జాతి విద్వేశంతో తెల్ల జాతి దుండగులు కాల్పులతో రెచ్చిపోతుండగా జర్మనీలో ఓ వ్యక్తి గొడ్డలితో రాక్షసంగా ప్రవర్తించాడు. ఓ రైల్వే స్టేషన్లోకి చొరబడి విచక్షణా రహితంగా దొరికిన ప్రతి ఒక్కరిని నరకడం మొదలుపెట్టాడు. దీంతో దాదాపు ఏడుగురు గాయాలపాలయ్యారు. జర్మనీలోని డస్సెల్‌డార్ఫ్ నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గతంలో కూడా ఇలాంటి దాడులు ఇక్కడ జరుగగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం గురువారం రాత్రి యుగోస్లావియాకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్న ఓ 36 ఏళ్ల వ్యక్తి మానసికంగా బాధపడుతున్నాడు. అతడు అనూహ్యంగా గొడ్డలి తీసుకొని రాత్రి 8.50గంటల ప్రాంతంలో రైల్వేస్టేషన్‌లోకి అడుగుపెట్టి గొడ్డలితో తీవ్రంగా దాడికి చేశాడు. పోలీసులు అక్కడి చేరుకోవడంతో అతడు పారిపోయేందుకు ఓ పెద్ద గోడ నుంచి దూకి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే ప్రస్తుతం అతడిని విచారించే పరిస్థితిల్లో లేడని, మానసికంగా దెబ్బతిని ఉన్నాడని మాత్రం తమకు అర్ధం అయిందని చెప్పారు. ఈ ఘటన కారణంగా స్టేషన్ ప్రాంగణంలో భయానక వాతావరణం నెలకొందని, ఎక్కడికక్కడా ట్రాఫిక్ జామ్ కూడా అయిందని అన్నారు. రైల్వే స్టేషన్ ప్రాంగణం ఎక్కడ చూసిన రక్తపు మరకలతో దర్శనం ఇచ్చింది. -
జర్మనీలో గొడ్డలితో దొరికినవారిని దొరికినట్లు..
-
మేనకోడలిపై గొడ్డలితో దాడి..
నెల్లిమర్ల: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి సొంత మేన కోడలిపై కిరాతకంగా దాడి చేశాడు. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వారిద్దరిని ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరి పరస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని సెగిడి వీధిలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న లచ్చన్న(60)కు మేనకోడలు పట్నాల రామలక్ష్మి(35)కి మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇంటి ముందు పని చేసుకుంటున్న రామలక్ష్మిపై మేనమామ లచ్చన్న గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం ఇంట్లోకి వెళ్లి పురుగుల మందు తాగాడు. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గొడ్డలితో దాడిచేసిన వృద్ధురాలు!!
అవును.. మీరు సరిగ్గానే చదివారు. గొడ్డలితో వృద్ధురాలిపై దాడి జరగలేదు, ఆమే గొడ్డలి పట్టుకుని నానా హడావుడి చేసింది. ఈ ఘటన ఢిల్లీలోని కుతుబ్‌మినార్ మెట్రోస్టేషన్లో జరిగింది. ఆమె వయసు సుమారు 65 సంవత్సరాలుంటుంది. ఆమె గొడ్డలి పట్టుకుని తోటి ప్రయాణికులపై దాడి చేసింది. మెట్రో రైల్లో కేవలం మహిళల కోసం ఒక బోగీ రిజర్వు అయి ఉంటుంది. ఆ బోగీలో సీటు కోసం జరిగిన గొడవలో.. ఆమె గొడ్డలితో హల్చల్ చేసింది. రైలు బోగీలోకి ఆమె ఎక్కేసరికి సీట్లన్నింటిలోనూ మహిళలు కూర్చుని ఉన్నారు. అంతలో సీనియర్ సిటిజన్ల కోసం రిజర్వు చేసిన సీట్లో ఒక 32 ఏళ్ల మహిళ కూర్చుని ఉండటాన్ని ఆమె చూసింది. ఆ సీటు ఖాళీ చేసి తనకు ఇవ్వాలని వృద్ధురాలు కోరగా.. ఆమె నిరాకరించింది. దాంతో ఆ వృద్ధురాలు ఆమెను చెంపమీద కొట్టింది. ఆ సమయంలో మిగిలిన ప్రయాణికులు కలగజేసుకుని.. రైల్లో గొడవలు వద్దని చెప్పారు. దాంతో ఆమెకు మరింత కోపం వచ్చి, బ్యాగులోంచి గొడ్డలి తీసి వారిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఆమె చేతిలో ఆయుధం చూసిన మహిళలు ఒక్కసారిగా భయపడి.. సాయం కోసం గట్టిగా అరిచారు. కొంతమంది మాత్రం ఎలాగోలా ధైర్యం చేసి ఆమెను పట్టుకుని, ఆమె చేతుల్లోంచి గొడ్డలి లాగేసుకున్నారు. తర్వాతి స్టేషన్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది సాయంతో ఆమెను దించేశారు. సాధారణంగా మెట్రోస్టేషన్లలో సెక్యూరిటీ చెకింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ, దాన్నంతటినీ దాటుకుని మరీ ఆమె తన బ్యాగులో ఈ గొడ్డలి పెట్టుకుని వచ్చింది. అయితే.. ఆమె దాడి చేయబోతుండగా తోటి మహిళలంతా కలిసి ఆమెను అడ్డుకుని, పట్టుకుని తదుపరి స్టేషన్లో సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించారు. అయితే.. వాళ్లు ఆమె వయసును దృష్టిలో పెట్టుకుని అదుపులోకి తీసుకోకుండా, గొడ్డలి స్వాధీనం చేసుకుని, ఆమెను హెచ్చరించి పంపేశారు. -
కృష్ణాజిల్లాలో దారుణం
విజయవాడ : కృష్ణాజిల్లా చాట్రాయి మండలం కోటపాడుతో బుధవారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భార్య, మామను భర్త గొడ్డలిలో నరికి దారుణంగా హత్య చేశాడు. ఆ క్రమంలో అడ్డొచ్చిన అత్త, బావమరిదిపైనా అతడు దాడి చేశాడు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నిందితుడు అక్కడ నుంచి పరారైయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్య జరిగిన ఘటన స్థలాన్ని నూజివీడు, తిరువూరు డీఎస్పీలు పరామర్శించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
జర్మనీలో ఆఫ్ఘాన్ యువకుడు బీభత్సం
-
జర్మనీలో ఆఫ్ఘాన్ యువకుడు బీభత్సం
జర్మనీ : జర్మనీలో ఓ యువకుడు మంగళవారం బీభత్సం సృష్టించాడు. రైలులో ప్రయాణికులపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న జర్మనీ భద్రత సిబ్బంది రంగంలోకి దిగి... యువకుడిని కాల్చి చంపాయి. దాడికి పాల్పడిన యువకుడు 17 ఏళ్ల ఆఫ్ఘాన్ శరణార్థిగా భద్రత దళాలు గుర్తించాయి. ఈ దాడికి ఐసీస్‌కు సంబంధాలు అనే కోణంలో భద్రత దళాలు దర్యాప్తు చేస్తున్నాయి. అయితే ఈ దాడిలో గాయపడిన నలుగురు యువకుల్లో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. సోమవారం అర్థరాత్రి రైలు ట్రూచిన్జెన్ నుంచి వువర్జ్బర్గ్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. -
యువకుడి దారుణ హత్య
పెద్దకూరపాడు: గుంటూరు జిల్లా పెద్దకూరపాడు మండలంలోని తాళ్లూరు, కాశిపాడు గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై ఓ యువకుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కంభవరం గ్రామానికి చెందిన గోపి (25)ని గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపారు. శుక్రవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా... వారు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
భర్తపై భార్య గొడ్డలితో దాడి
సత్తుపల్లి (ఖమ్మం): భర్త పెట్టే చిత్రహింసలకు తాళలేక ఓ భార్య తిరగబడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గంగారం 15వ గిరిజన బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కొమరం నరేష్ మద్యం తాగి వచ్చి నిత్యం భార్య శ్రావ్యను చితకొట్టేవాడు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో భార్యను కొట్టి మద్యం సేవించి మళ్లీ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో నిద్రపోతున్న మూడేళ్ల కుమార్తెపై చేయిచేసుకుంటుండగా శ్రావ్య అడ్డుపడింది. దీంతో ఆమెను కూడా కొట్టడంతో ఒక మూలన పడిపోయింది. అక్కడే ఉన్న గొడ్డలిని తీసుకొని నరేష్‌పై దాడి చేసింది. మెడ, ఛాతి, చేయిపై తీవ్ర గాయాలపాలైన నరేష్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చుట్టుపక్కల వారు సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. 2009లో కొమరం నరేష్‌కు శ్రావ్యతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. -
తండ్రిని గొడ్డలితో నరికి చంపిన తనయుడు
గుంటూరు: గుంటూరు జిల్లాలోని నూజెండ్ల మండలం ముప్పరాజుపాలెంలో దారుణం చోటుచేసుకుంది. కన్నతండ్రిని తనయుడు వీరాంజి గొడ్డలితో నరికి అతిదారుణంగా హతమార్చాడు. ఆస్తి వివాదాలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడు వీరాంజి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
భార్యపై భర్త గొడ్డలితో దాడి, పరిస్థితి విషమం
వరంగల్: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని పరకాల మండలం కౌకుంటలో శుక్రవారం చోటుచేసుకుంది. అనుమానం పెనుభూతమై విచక్షణ లేకుండా భార్యపై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం వరంగల్ ఎమ్జీఎమ్ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.