దారుణం.. అసలు చేతులెలా వచ్చాయో | 4 Siblings in Jalgaon Village Found Butchered With Axe | Sakshi
Sakshi News home page

నలుగురు చిన్నారులను నరికి చంపారు

Published Fri, Oct 16 2020 3:06 PM | Last Updated on Fri, Oct 16 2020 3:11 PM

4 Siblings in Jalgaon Village Found Butchered With Axe - Sakshi

ముంబై: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లారు.. ఇంట్లో ఉన్న 3 నుంచి 12 సంవత్సరాల వయసు ఉన్న నలుగురు తోబుట్టువులను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు దుండగులు. వింటినే ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన మహారాష్ట్రలోని జల్గావ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. మధ్యప్రదేశ్‌కి చెందిన మెహతాబ్‌, రుమాలి భీలాలా దంపతులు పని నిమిత్తం మహారాష్ట్ర, జల్గావ్‌ బోర్ఖేడా గ్రామానికి వచ్చారు. వీరికి నలుగురు పిల్లలు సైతా (12), రావల్ (11), అనిల్ (8), సుమన్ (3) ఉన్నారు. ఇక్కడ ముస్తఫా అనే వ్యక్తి పొలంలో పనికి కుదిరారు. ఈ నేపథ్యంలో దంపతులు శుక్రవారం పని నిమిత్తం బయటకు వెళ్లారు. కాసేపటికి వీరి ఇంటికి వచ్చిన పొలం యజమాని ముస్తఫా పిల్లలు రక్తపు మడుగులో పడి ఉండటం చూసి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. పోలీసులకు కూడా తెలపడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. (చదవండి: ఏడాదిగా భార్యను టాయిలెట్‌‌లో బంధించి..)

దర్యాప్తులో భాగంగా పోలీసులు పిల్లల మృతదేహాల దగ్గర ఒక గొడ్డలిని గుర్తించారు. నిందితుడు పిల్లలందరిని ఈ గొడ్డలితో హత్య చేసి ఉండవచ్చిన పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఒక ఐపీఎస్‌ అధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అధికారులు. పోస్ట్‌మార్టం నిమిత్తం చిన్నారుల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement