siblings dead
-
అక్క వెంటే చిట్టితల్లి.. హృదయాన్ని కదిలించిన దృశ్యం
స్వార్థంతో కూడిన ప్రపంచంలో బంధాలకు విలువ ఏమాత్రం?. అండగా ఉండాల్సిన వాళ్లే.. కష్టకాలంలో కానీవాళ్లుగా మారిపోతున్నారు. అలాంటిది మరణంలోనూ ఆ బంధం ఒక్కటిగా కనిపించడం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. కారణం.. అవి కల్లాకపటం ఎరుగని పసిహృదయాలు కాబట్టి. కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో మంగళవారం వెలుగుచూసిన విషాద ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు చిన్నారులు సజీవ సమాధి అయ్యారు. అయితే.. సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది అక్కడి దృశ్యాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు. అక్కాచెల్లెళ్లు అయిన ఆ పిల్లలు.. ఒకరి చేతులు మరొకరు పట్టుకుని విగత జీవులుగా కనిపించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. శ్రుతి(11), జననశ్రీ(6) అక్కాచెల్లెళ్లు. దక్షిణ కన్నడ జిల్లా సుబ్రమణ్యలోని కుసుమధారలో ఉంటోంది వీళ్ల కుటుంబం. సోమవారం సాయంత్రం సుబ్రమణ్యలో భారీ వర్షం కురిసింది. రాత్రి ఏడు గంటల సమయంలో భారీ శబ్దం వినిపించడంతో స్థానికులంతా ఉలిక్కి పడ్డారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ సమయంలో ఇంటి వరండాలో కూర్చుని చదువుకుంటోంది శ్రుతి. భారీ శబ్దానికి భయంతో ఇంట్లోకి పరిగెత్తింది. అక్కను చూసి వెంటే చెల్లి జననశ్రీ కూడా లోపలికి వెళ్లింది. అయితే వంట గదిలో ఉన్న ఆ పిల్లల తల్లి.. ఆ శబ్దానికి బయటకు వచ్చేసింది. పిల్లలు కూడా బయటే ఉన్నారు కదా ఆ తల్లి పొరపడింది. సరిగ్గా అదే సమయంలో పైన ఉండే కొండచరియలు విరిగి.. ఆ ఇంటిపై పడ్డాయి. అంతే.. భారీ వృక్షం పడిపోవడం, దారులన్నీ నీటితో నిండిపోవడంతో సహాయక చర్యలు ఆలస్యం అయ్యాయి. దీంతో మరుసటి రోజే శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు సిబ్బంది. నాలుగైదు గంటలు శ్రమించి.. చివరకు ఆ చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. భయంతో ఒకరినొకరు పట్టుకుని ఉంటారని భావిస్తున్నారు సిబ్బంది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. ఉత్తర కన్నడ జిల్లా భక్తల్ తాలుకా ముట్టాలిలో కొండ చరియలు విరిగిపడిన మరో ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. -
బడికి బయలుదేరి..మృత్యు ఒడికి
చేగుంట (తూప్రాన్): ఇద్దరు తమ్ముళ్లను అన్న బైక్‌పై ఎక్కించుకున్నాడు. స్కూల్లో దింపడానికని బయలుదేరాడు. అప్పుడే అకస్మాత్తుగా వచ్చిందో మాయదారి లారీ. వేగంగా బైక్‌ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలై ముగ్గురు అన్నదమ్ములు మృతిచెందారు. మెదక్ జిల్లా చేగుంటలోని జీవిక పరిశ్రమ వద్ద సోమవారం జరిగిందీ ప్రమాదం. గేటు నుంచి లారీ అకస్మాత్తుగా వచ్చి.. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఉల్లి తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన పండ్ల రాకేశ్ (20).. తన సొంత తమ్ముడైన ప్రదీప్ (15)తో పాటు వరుసకు తమ్ముడైన పండ్ల రాజు (14)ను చేగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దింపడానికి సోమవారం బైక్‌పై బయలుదేరాడు. చేగుంట శివారులోకి రాగానే జీవిక పరిశ్రమ గేటు నుంచి అకస్మాత్తుగా బయటకు వచ్చిన లారీ.. బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో రాకేశ్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలైన ప్రదీప్, రాజులను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. రెండు కుటుంబాల్లో తల్లులే ఇంటి పెద్దగా.. రాకేశ్ పాలిటెక్నిక్, తమ్ముడు ప్రదీప్ 10వ తరగతి చదువుతున్నారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో వీళ్లను తల్లి చంద్రకళ పోషిస్తోంది. ఇద్దరికి ఒక సోదరి ఉన్నారు. పండ్ల రాజు 8వ తరగతి చదువుతున్నాడు. ఇతడి తండ్రి చిన్నతనంలోనే చనిపోగా తల్లి పెంటమ్మ పోషిస్తూ చేగుంటలో చదివిస్తోంది. రాజుకు ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఉన్నారు. ఇంటి నుంచి బయలుదేరిన పిల్ల లు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. పరిశ్రమ ఎదుట గ్రామస్తుల నిరసన ప్రమాద స్థలానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రామస్తులు పరిశ్రమ ఎదుట నిరసన తెలిపారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో పాటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండల శాఖ అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు ప్రమాద స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. తగిన న్యాయం చేస్తామని పరిశ్రమ యాజమాన్యం హామీ ఇవ్వడంతో పాటు అంత్యక్రియలకు చెరో రూ. 50 వేలు ఇచ్చింది. -
దారుణం.. అసలు చేతులెలా వచ్చాయో
ముంబై: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లారు.. ఇంట్లో ఉన్న 3 నుంచి 12 సంవత్సరాల వయసు ఉన్న నలుగురు తోబుట్టువులను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు దుండగులు. వింటినే ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన మహారాష్ట్రలోని జల్గావ్లో చోటు చేసుకుంది. వివరాలు.. మధ్యప్రదేశ్‌కి చెందిన మెహతాబ్, రుమాలి భీలాలా దంపతులు పని నిమిత్తం మహారాష్ట్ర, జల్గావ్ బోర్ఖేడా గ్రామానికి వచ్చారు. వీరికి నలుగురు పిల్లలు సైతా (12), రావల్ (11), అనిల్ (8), సుమన్ (3) ఉన్నారు. ఇక్కడ ముస్తఫా అనే వ్యక్తి పొలంలో పనికి కుదిరారు. ఈ నేపథ్యంలో దంపతులు శుక్రవారం పని నిమిత్తం బయటకు వెళ్లారు. కాసేపటికి వీరి ఇంటికి వచ్చిన పొలం యజమాని ముస్తఫా పిల్లలు రక్తపు మడుగులో పడి ఉండటం చూసి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. పోలీసులకు కూడా తెలపడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. (చదవండి: ఏడాదిగా భార్యను టాయిలెట్లో బంధించి..) దర్యాప్తులో భాగంగా పోలీసులు పిల్లల మృతదేహాల దగ్గర ఒక గొడ్డలిని గుర్తించారు. నిందితుడు పిల్లలందరిని ఈ గొడ్డలితో హత్య చేసి ఉండవచ్చిన పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఒక ఐపీఎస్ అధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అధికారులు. పోస్ట్‌మార్టం నిమిత్తం చిన్నారుల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. -
బిడ్డా.. జర భద్రం!!
'బిడ్డా.. జర భద్రం'.. ఇవే ఆ తల్లి తన బిడ్డతో మాట్లాడిన చివరి మాటలు. పొద్దున్నే లేచి, శుభ్రంగా తయారై బ్యాగు తగిలించుకుని, క్యారేజి పట్టుకుని బస్సు మెట్లు ఎక్కేముందు ఆ మూడు గ్రామాల్లోని దాదాపు 20 మందికి పైగా తల్లులు తమ కన్న బిడ్డలను భద్రంగా వెళ్లి రమ్మంటూ టాటా చెప్పారు. అలా చెప్పి గంట సేపు కూడా గడిచిందో.. లేదో, అంతలోనే వాళ్లు ఎక్కిన బస్సును రైలు ఢీకొన్న విషయం తెలిసింది. ఆ తల్లుల గుండెలు ఝల్లుమన్నాయి. ఉరుకులు పరుగుల మీద సంఘటన స్థలానికి చేరుకున్నారు. కానీ అక్కడకు వెళ్లేసరికే చిరునవ్వులు చిందించాల్సిన తమ చిన్నారులు రక్తమోడుతూ విగతజీవులుగా కనిపించారు. అంతే.. వాళ్ల గర్భశోకానికి అంతులేదు. చాలామంది అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయారు. బస్సులో ఆడుతూ పాడుతూ వెళ్తున్న చిన్నారులు.. ఒక్కసారిగా దూసుకొచ్చిన రైలు తమ బస్సును ఢీకొనడంతో ఏం జరిగిందో తెలిసేలోపే వారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. గుండేటిపల్లెకు చెందిన 11 మంది పిల్లలు ఈ ప్రమాదంలో మరణించారు. కొన్ని కుటుంబాల్లో వాళ్ల పిల్లలంతా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గుండేటిపల్లెకు చెందిన వరుణ్ -శ్రుతి, కృష్ణాపూర్‌కు చెందిన రజియా-వహీద్ ఇలా మరణించినవారే. వీరిలో రజియా-వహీద్‌ల తల్లి తన బిడ్డలు లేరన్న విషయాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మరణించగా, వాళ్ల తండ్రికి కూడా గుండెపోటు వచ్చి ఆస్పత్రిలో చేరారు.