కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి సొంత మేన కోడలిపై కిరాతకంగా దాడి చేశాడు.
నెల్లిమర్ల: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి సొంత మేన కోడలిపై కిరాతకంగా దాడి చేశాడు. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వారిద్దరిని ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరి పరస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని సెగిడి వీధిలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న లచ్చన్న(60)కు మేనకోడలు పట్నాల రామలక్ష్మి(35)కి మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరగుతున్నాయి.
ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇంటి ముందు పని చేసుకుంటున్న రామలక్ష్మిపై మేనమామ లచ్చన్న గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం ఇంట్లోకి వెళ్లి పురుగుల మందు తాగాడు. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.