అక‍్కపై దారుణం, ఎంత పనిచేశావ్‌ తమ్ముడు | Man Attacks Her With Axe Over Parents Giving Attention To Elder Sister | Sakshi
Sakshi News home page

అక‍్కపై దారుణం, ఎంత పనిచేశావ్‌ తమ్ముడు

Published Sat, Jul 3 2021 11:27 PM | Last Updated on Sat, Jul 3 2021 11:35 PM

Man Attacks Her With Axe Over Parents Giving Attention To Elder Sister  - Sakshi

పూణే:"అమ్మా నాన్నలు అక్కని ప్రేమగా చూసుకుంటున్నారు. కానీ నన్ను మాత్రం పట్టించుకోవడం లేదు.  నేనేం పాపం చేశాను. ఎందుకు ఈ పార్షియాలిటీ. కూతుర్ని ఎలాగైతే చూసుకుంటున్నారో.. నన్నుకూడా అలాగే చూసుకోవాలి కదా. కానీ అలా చేయడం లేదంటూ" ఆగ్రహం వ్యక్తం చేసిన తమ్ముడు.. నిద్రపోతున్న అక్కపై గొడ్డలితో దాడి చేశాడు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. పూణేలోని హింగ్నే ఖుర్ద్ ప్రాంతానికి చెందిన మనీషా,శంకర్‌ అక్కా తమ్ముడు. మనీషాకు పెళ్లై తన భర్తతో కలిసి వేరే ప్రాంతంలో నివాసం ఉంటుంది. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తుంది. అయితే తల్లిదండ్రులను చూసేందుకు పుట్టింటికి వచ్చింది.  ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 5గంటల సమయంలో నిద్రపోతున్న అక్క మనీషాపై తమ్ముడు శంకర్‌ గొడ్డలితో దాడి చేశాడు. అడ్డొచ్చిన తల్లిదండ్రుల్ని బెదిరించాడు. దాడి జరిగే సమయంలో పక్కనే ఉన్న మనీషా కొడుకు రోహన్‌ దారుణాన్ని ఆపేందుకు ప్రయత్నించాడు. మేనమామ శంకర్‌ను పక్కకు తోసేసి తీవ్రగాయాల పాలైన తల్లిని ఆస్పత్రికి తరలించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

ఆస్తికోసమే దారుణం..!
దర్యాప్తులో భాగంగా నిందితుడ‍్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణ సమయంలో తల్లిదండ్రులు తన అక్క మనీషాను ప్రేమగా చూసుకుంటున్నారని, తనని మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే మనీషా కొడుకు రోహన్‌ మాత్రం.. వారసత్వం కింద తాతకు చెందిన ఆస‍్తి మనవడికి రాయడం మేనమామ శంకర్‌ నచ్చలేదని, అందుకే  తన తల్లిపై దాడి చేశాడని తెలిపాడు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement