Brother and sisters
-
Rakhi Purnima 2024: ఒకరికొకరు అండాదండా
శ్రావణ పూర్ణిమ, వరలక్ష్మీ వ్రతం అంటే తెలియని వారు ఉండవచ్చునేమో కానీ, రాఖీపూర్ణిమ అంటే తెలియని వారుండరు. పేరు తెలిసినా ఆ సంప్రదాయ బద్ధంగా ఆనాడు ఏం చేయాలో... రాఖీ కట్టడంలోని అంతరార్థం ఏమిటో తెలిసినవారు అరుదనే చె΄్పాలి.పూర్ణిమనాడు శ్రవణానక్షత్రం ఉన్న మాసానికి శ్రావణ మాసమని పేరు. శ్రావణమాసంలో రాత్రివేళ పూర్ణిమ తిథి ఉన్న రోజును రక్షికా పూర్ణిమ అన్నారు పెద్దలు. రక్షించగలిగిన పూర్ణిమ, రక్షణ కోరుకునే వారికోసం ఉద్దేశింపబడిన పూర్ణిమ అని అర్థం. ఈ పండుగ కాస్తా కాలక్రమంలో రాఖీపూర్ణిమగా పేరు మార్చుకుంది.శ్రావణ పూర్ణిమనాడు ఉదయమే స్నానం చేయాలి. ఎవరిని రక్షించదలిచామో– అంటే నేటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికి అండగా ఉండదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖీ)ని దైవం ముందుంచి పూజ చేయాలి. వరుడు కట్టబోయే మంగళ సూత్రానికి ఎలా మాంగల్యబల పూజ చేస్తారో, ఆ పూజాశక్తి దానిలో ప్రవేశించి ఆ సూత్రాన్ని కట్టించుకున్న ఆమెకీ, కట్టిన వ్యక్తికీ ఆపదల్లేకుండా చేస్తుందో అంతటి శక్తి ఉన్నది ఇక్కడ రక్షికకి. కాబట్టి దీనికీ పూజ చెయ్యాలి. అంటే పూజ ద్వారా పూజాశక్తిని దానిలోనికి ప్రవేశింప చెయ్యాలన్నమాట.అలా పూజాశక్తితో కూడుకున్న ఈ రక్షికని ఒక సంవత్సర కాలంపాటు– మనం ఎవరిని రక్షించడానికి అండగా నిలువదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి కడుతూ– ‘ఆ రక్షిక మీద అక్షతలని వేయాలి. ఇలా కట్టడాన్ని అపరాహ్ణసమయంలో (అహ్నం అంటే పగలు. అపరం అంటే మధ్యాహ్నం 12 దాటాక. కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య అని అర్థం) మాత్రమే చేయాలి. అయితే ఇది ఇప్పటి ఆచారం కాదు... ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయమే!రక్షాబంధనం కట్టడం పూర్తయింది కదా అని ఇక అంతటితో వదిలేయకూడదు. ఆ బంధానికి కట్టుబడి ఒకరికి ఒకరు అన్నింటా అండగా నిలవాలి. మరో ముఖ్య విశేషమేమిటంటే ఇది కేవలం స్త్రీలు మాత్రమే కట్టాలనే నియమం లేదు. స్త్రీలకి స్త్రీలూ పురుషులకి పురుషులూ కూడా కట్టుకోవచ్చు, అలా అండగా నిలవాలనే పవిత్రోద్దేశ్యం ఉంటే. అంతేకాదు.. దేశ రక్షణలో పాల్గొనే సరిహద్దు భద్రతాదళాలకు ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వారి విజయాన్ని, శ్రేయస్సును కాంక్షిస్తూ ప్రతి సంవత్సరం శ్రావణ పున్నమిరోజు రక్షాబంధనం కడుతుండటం శుభపరిణామం.స్థితి కారుడైన శ్రీహరి జన్మనక్షత్రం శ్రవణం నిండుగా ఉండే ఈ శ్రావణ పూర్ణిమనాడే నేను ఫలాని వారికి రక్షణ కోసం కడుతున్నాను. కాబట్టి ఆ శ్రీహరి అనుగ్రహం నా మీద ప్రసరించి నేనూ రక్షించేవాడిగానే ఉండాలని అర్థం చేసుకోవడానికే శ్రావణపూర్ణిమని ఈ పండుగ రోజుగా నిర్ణయించారని గమనించాలి. అంతేకాదు, అపరాహ్ణ సమయంలో రక్షికని కడుతున్న నా రక్షికాబంధానికి ఆ ప్రత్యక్ష కర్మసాక్షి సూర్యుడని తెల్పడానికే. యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలఃతేన త్వామపి బధ్నామి రక్షే! మా చల మాచల!రాక్షసులకి రాజూ, మహాబలవంతుడూ అయిన బలి చక్రవర్తి ఏ రక్షాబంధన శక్తి కారణంగా శ్రీహరికి వశమై΄ోయాడో, దేవతలంతా తమ తమ తపశ్శక్తిని శ్రీహరికి బాసటగా ఉంచుతూ రక్షికని కట్టారో, ఆ రక్షికా శక్తి నాలో ప్రవేశించిన నేను కూడ ఈ మిత్రునికి లేదా మిత్రురాలికి ఈ రక్షికని ముడి వేస్తున్నాను. ఓ రక్షికా! రక్షణశక్తి నీనుండి తొలగకుండును గాక! అని పై శ్లోకానికి అర్థం. ఈ పండుగలోని హంగులు, ఆర్భాటాల మాట ఎలా ఉన్నా, తమకు రక్షణ ఇవ్వవలసిందిగా కోరుతూ... తమ సోదరులకు దుష్టశక్తుల పీడ లేకుండా, వాహన ప్రమాదాలు తదితర విపత్తుల బారినుంచి కాపాడి భగవంతుడు ఈ సంవత్సరమంతా రక్షగా నిలవాలని కాంక్షిస్తూ ఎంతో దూరాభారాలకు ఓర్చి పుట్టింటికి వచ్చి సోదరుల చేతికి రక్షాబంధనం కట్టడం, వారికి తీపి తినిపించడం, ‘నీకు అండగా నేనున్నాను’ అని అభయమిస్తూ సోదరులు వారి శక్తికొలది పసుపు కుంకుమలు, చీరసారెలతో సత్కరించడం ఇటీవల వెల్లివిరుస్తున్న ఒక సత్సంప్రదాయÆ . ఈ సంప్రదాయాన్ని ఒక పండుగలా జరుపుకోవడంతో çమాత్రం సరిపెట్టకూడదు. అందులోని అంతస్సూత్రాన్ని అర్థం చేసుకుని, దానిని ఆచరణలో పెట్టాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. – డి.వి.ఆర్. -
అక్క ఆశీర్వాదమే.. అతనికి ఆఖరి రోజు..
మహబూబాబాద్: అక్క ఆశీర్వాదం కోసం వచ్చిన తమ్ముడు రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఈ ఘటన మండలంలోని కొండపర్తి గ్రామంలో జరిగింది. మామునూరుకు చెందిన ఎర్ర భానుప్రకాష్ (26) మంగళవారం రాత్రి కొండపర్తిలో నివాసమంటున్న తన అక్కాబావ మాదాసు భార్గవి, శ్రీధర్ ఇంటికి వచ్చాడు. బుధవారం సాయంత్రం బైక్‌పై మామునూరుకు వెళ్తున్నాడు. అదే సమయంలో వరంగల్ నుంచి కొండపర్తికి ఆటో వస్తుంది. ఈ క్రమంలో కొండపర్తి గ్రామ చివర మలుపు వద్ద ఎదురెదురుగా ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో భాను ప్రకాష్‌కు తీవ్ర గాయాలుకావడంతో స్థానికులు ఎంజీఎం తరలించారు. అయితే భానుప్రకాష్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, భాను ప్రకాశ్‌కు గాయత్రితో వివాహం కాగా ఇటీవల కొడుకు జన్మించాడు. మంగళవారం కొడుకుకు 21 రోజు ఫంక్షన్‌ను చేశాడు. మరుసటి రోజు అక్క ఆశీర్వాదం తీసుకోవడం వారి సంప్రదాయం. దీంతో అతను కొండపర్తికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి పెద్దనాన్న కొడుకు భరత్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. భాను ప్రకాష్ మామునూరు బెటాలియన్‌లో అవుట్ సోర్సింగ్ కుక్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. -
అన్నను బలితీసుకున్న నిద్ర.. 'అన్నా.. లే, మాట్లాడు అంటూ'.. ఇద్దరు చెల్లెళ్ల రోదన..
వరంగల్: అనారోగ్యంతో బాధపడుతున్న నానమ్మను చూసేందుకు తల్లిదండ్రులతో కలిసి ఆటోలో వెళ్తున్న ఓ బాలుడిని మృత్యువు.. నిద్ర రూపంలో కబలించింది. ఈ ఘటన శనివారం జిల్లా కేంద్రంలో జరిగింది. పాలకుర్తి మండలం మల్లంపల్లికి చెందిన ఇమామ్ పాషా, భార్య కర్మిషా బతుకుదెరువు నిమిత్తం ఘట్కేసర్కు వెళ్లారు. అక్కడే పాషా ఆటో నడిపించుకుంటూ.. కుమారుడు షరీఫ్(8), ఇద్దరు కూతుళ్లను పోషించుకుంటున్నాడు. రెండో శనివారం స్కూల్ లేకపోవడంతో తన తల్లి అనారోగ్యంగా ఉండడంతో భార్య, బిడ్డలతో కలిసి పాషా సొంత ఆటోలో బయలు దేరాడు. జనగామ పట్టణంలోని కళ్లెం కమాన్ వద్దకు రాగానే.. ముందు సీటులో ఉన్న బాలుడు షరీఫ్ కునుకు తీయడంతో ఆటో నుంచి కిందపడ్డాడు. తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అటుగా వెళ్తన్న ఓ కారు ప్రయాణికులు.. బాబును వెంటనే జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. తీసుకొచ్చిన అరగంట లోపే బాలుడు మృతి చెందాడు. రోదనలతో మిన్నంటిన ఆస్పత్రి.. బాలుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. బాధితుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం మిన్నంటింది. బాలుడు షరీఫ్ మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించగానే.. తల్లిదండ్రులు అక్కడే కుప్పకూలిపోయారు. మృతుడి ఇద్దరు చెల్లెళ్లు.. అన్నా మాట్లాడు అంటూ విగత జీవిగా ఉన్న తమ సోదరుడిని తట్టి లేపుతుంటే అక్కడే ఉన్న పేషెంట్లు, వైద్యులు కన్నీరు కార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చెల్లికి సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసిన అన్న.. బహుమతి చూసి ఆమె..
కుటుంబంలో అన్ని బంధాలు ఎంతో భావోద్వేగంతో కూడుకున్నవి. ముఖ్యంగా అక్కా-తమ్ముడు, చెల్లి-అన్న బంధాలు.. కొన్ని సందర్భాల్లో ఎంతో భావోద్వేగానికి గురిచేస్తాయి. అయితే, తెలిసితెలియని వయసులో వీరి మధ్య చాడీలు చెప్పుకోవడం, ఒకరిపై ఒకరు పేరెంట్స్‌కు కంప్లాయింట్స్ చేసుకోవడం సరదాగా అనిపిస్తుంది. కానీ, ఒక ఏజ్ వచ్చాక.. సోదరికి బ్రదర్.. బహుమతి ఇచ్చిన సందర్భాల్లో వారు ఎంతో ఎమోషనల్‌గా ఫీల్ అవుతారు అనేది చాలా మంది చూసే ఉంటారు. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో అన్నా-చెల్లిని చూసిన నెటిజన్లు ఎమోషనల్‌గా కామెంట్స్ చేస్తున్నారు. వివరాల ప్రకారం.. వీడియోలో తన చెల్లికి అన్న.. ఆమె ఊహించని విధంగా బహుమతి ప్లాన్ చేశాడు. ఐశ్వర్య అనే యువతి తన సోదరుడు ఓ గిఫ్ట్ బాక్స్ ఇస్తాడు. ఈ క్రమంలో ఆ బాక్స్ లోపల ఏముందోనని చాలా ఆమె ఎంతో ఇంట్రెస్టింగ్గా తెరుస్తుంది. తెరవడంతోనే దాని లోపల ఉన్నది చూసి ఆశ్చర్యపోతుంది.అందులో ఒక బైక్ కీ ఉండడం చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంది. కానీ.. ఇంతలోనే తన అన్న గిఫ్ట్‌గా ఇచ్చిన స్కూటీని చూసి ఆమె సంతోషంలో కన్నీళ్లు పెట్టుకుంది. అతనిని కౌగిలించుకుంది. ఈ క్షణంలో వారి ఇద్దరూ ఎమోషనల్‌గా ఫీల్ అవడం వారి కుటుంబ సభ్యులు చూసి భావోద్వేగానికి గురవుతారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని చూసి ఎమోషనల్‌గా కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే మాత్రం తెలియరాలేదు. View this post on Instagram A post shared by ऐश्वर्या भदाणे (@aishwarya_bhadane) -
ప్రేమించి పెళ్లి చేసుకుందని చెల్లెలిపై కత్తితో దాడి
కోవూరు: ప్రేమించి పెళ్లి చేసుకుందని పోలీస్‌స్టేషన్ ఎదుటే చెల్లెలిపై అన్న దాడి చేసి కత్తితో పొడిచిన ఘటన సోమవారం రాత్రి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్‌స్టేషన్ వద్ద జరిగింది. బాధితురాలి కథనం మేరకు.. సంగం మండలం జెండాదిబ్బ ప్రాంతానికి చెందిన శిరీష, కోవూరు మండలం కట్టకింద చెర్లోపాలేనికి చెందిన అశోక్ ప్రేమించుకున్నారు. అశోక్ క్యాటరింగ్ పనులు చేస్తుంటాడు. ఇద్దరూ మేజర్లు కావడంతో మూడు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లికి ఇరు కుటుంబాలు అభ్యంతరం చెప్పాయి. ఈ విషయం కోవూరు పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఎస్ఐ దాసరి వెంకటేశ్వరరావు సోమవారం ఇరు కుటుంబాలను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. రాత్రి కావడంతో వారిని వెళ్లిపోయి మంగళవారం ఉదయం రావాలని చెప్పారు. ఆ సమయంలో స్టేషన్ బయట ఇరు కుటుంబాల వారు మాట్లాడుకుంటున్నారు. శిరీష వారి కుటుంబ సభ్యులతో వెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో శిరీష అన్న హరీష్ ఒక్కసారిగా చెల్లెలుపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె గాయపడింది. పోలీసులు వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. హరీష్‌ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. -
రక్షా బంధన్ రోజునే అక్కాతమ్ముడి మృతి..
అక్కా తమ్ముడు, అన్నా చెల్లెళ్ల అనుబంధంగా జరుపుకునే రక్షాబంధన్ రోజునే అక్కా తమ్ముడి నిండు ప్రాణాలు రోడ్డు ప్రమాద రూపంలో కబళించుకుపోయాయి. కష్టసుఖాలు పంచుకుంటూ అన్నింటిలోనూ తోడునీడగా ఉన్న వారు మరణంలోనూ కలిసి తిరిగిరానిలోకాలకు చేరారు. తీవ్రంగా గాయపడిన తమ్ముడి మేనకోడలు మృత్యువుతో పోరాడు తోంది. సాక్షి,చెన్నూరు: రోడ్డు ప్రమాదంలో అక్కాతమ్ముడు ఇండ్ల వెంకట లక్షుమ్మ (47), చెరువు మల్లేష్ (45) మృతిచెందారు. ఆదివారం సాయంత్రం చెన్నూరు పెన్నా బ్రిడ్జిపై ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో లక్షుమ్మ కుమార్తె లావణ్యకు కాలు తెగిపడగా, తలకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల సహకారంతో 108 వాహనంలో గాయపడిన వారిని రిమ్స్‌కు తరలించారు. సకల మర్యాదలు చేయాలని... చాపాడు మండలం నక్కలదిన్నె అనంతపురానికి చెందిన చెరువు మల్లేష్‌కు ఇద్దరు అన్నదమ్ములు. ఇద్దరు అక్కలు ఉన్నారు. మల్లేష్ పెద్ద అక్క కుమార్తెను వివాహం చేసుకోగా మృతుడు మల్లేష్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. మల్లేష్ సీకే దిన్నె మండలం జమాల్పల్లెలో జేసీబీ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో రాఖీ పండుగ సందర్భంగా ఆదివారం కడప నగరం అల్మాస్‌పేటలో నివసిస్తున్న అక్క వెంకట లక్షుమ్మ దగ్గర రాఖీ కట్టించుకునేందుకు ద్విచక్ర వాహనంపై వచ్చాడు. అక్క చేత రాఖీ కట్టించుకుని చిన్ననాటి ముచ్చట్లను గుర్తు చేసుకుని అనేక విషయాలు మాట్లాడుకున్నారు. అనంతరం తనతోపాటు అక్క, మేనకోడలిని ద్విచక్ర వాహనంపై తన ఊరికి తీసుకెళ్లి సకల మర్యాదలు చేయాలనుకున్నాడు. అందులో భాగంగా సాయంత్రం అక్క, మేనకోడలు లావణ్యను తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని ఊరికి బయలుదేరాడు. వీరు ప్రయాణిస్తున్న వాహనం చెన్నూరు పరిధిలోని పెన్నా బ్రిడ్జి వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం వేగంగా వెనుకవైపునుంచి వచ్చి ఢీకొంది. దీంతో అక్కాతమ్ముడు మృతిచెందగా, లావణ్య కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటనతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాద స్థలాన్ని పోలీసులు పరిశీలించి, కేసు నమోదు చేశారు. చదవండి: షాకింగ్: నటి ప్రియాంక పండిట్ న్యూడ్ వీడియో లీక్, స్పందించిన నటి -
Raksha Bandhan: ఆవుపేడతో అందమైన రాఖీలు
సాక్షి, జగిత్యాల: ప్లాస్టిక్‌తో తయారయ్యే వస్తువులు పర్యావరణం, మనిషి ఆరోగ్యానికి హానికరంగా మారాయి. ఈనేపథ్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా లెక్చరర్‌గా పనిచేస్తున్న ఓ అభ్యుదయ మహిళ, ఆవు పేడ, సహజసిద్ధమైన పూలతో అందమైన రాఖీలు తయారు చేసి, హైదరాబాద్ లాంటి నగరాల్లో విక్రయిస్తూ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లికి చెందిన డాక్టర్ చెన్నమనేని పద్మ హైదరాబాద్‌లో లెక్చరర్‌గా పనిచేస్తోంది. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు ఎలాంటి రసాయనాలు లేని పంటలు పండించడమంటే ఇష్టం. బోర్నపల్లిలో 200 దేశీయ ఆవులతో మురిళీధర గోదామం గోశాల ఏర్పాటు చేసింది. వీకెండ్‌తో పాటు సెలవుల్లో ఆవు మూత్రం, పేడతో రకరకాల ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు దీపావళికి ప్రమిదలు, వరలక్ష్మీ పూజకు అవసరమైన సామగ్రి తదితర వస్తువులను ఆవు పేడతో తయారు చేసి శభాష్ అన్పించుకుంది. గోమయ రాఖీలు.. గోశాలలో ఆవులు విసర్జించిన పేడను దాదాపు నెల రోజుల పాటు ఎండబెట్టారు. పిడకల మాదిరిగా తయారైన ఆవుపేడను గ్రైండర్ లేదా ప్రత్యేక మిషన్‌లో వేసి గోధుమ పిండిలా తయారు చేశారు. అలా తయారైన మెత్తటి పేడకు గోరు గమ్ పౌడర్ (సోయా చిక్కుడుతో తయారైనది)తో పాటు కొంత చెరువు మట్టిని రొట్టె పిండిలా కలిపి రకరకాల డిజైన్ సాంచా(మోడల్)ల్లో పెట్టి నీడలో ఆరబెట్టి, దారాన్ని అతికించారు. తర్వాత చామంతి, గులాబీ పూలను ఎండబెట్టి, పూల రేకులను గ్రైండ్ చేసి రంగులు తయారు చేస్తారు. రాఖీలకు ఏ రంగు అవసరమనుకుంటే ఆ రంగులను వాడుతారు. ఉపయోగాలు.. రక్షాబంధన్ అనంతరం చేతిక కట్టిన రాఖీ తీసివేసిన తర్వాత అది ఎరువుగా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా రాఖీ చేతులకు ఉన్నా లేదా ఇంట్లో ఉన్నా గోమయ రాఖీ యాంటీ రేడియేషన్గా పనిచేసి, శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. దీంతో వీటికి నగరాలు, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ పెరిగింది. అయితే వీటి ద్వారా సంపాదన కంటే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. జీవితం విలువైనది మనిషి జీవితం చాలా విలువైనది. ప్రస్తుత మన అలవాట్లు, వాడే రసాయన పదార్థాల వల్ల అనారోగ్యం పాలవుతున్నాం. ఆవు మూత్రం, పేడను పంటలకు ఎరువుగానే కాకుండా, మనిషి రోజు వారీ అవసరాలకు కూడా ఉపయోగించవచ్చు. దీంతో రాఖీలు తయారు చేశాం. – డాక్టర్ పద్మ, గోమాయ రాఖీల తయారీదారు గి‘రాఖీ’ వెలుగులు సిరిసిల్ల: కొన్నేళ్ల క్రితం వరకు రాజన్న సిరిసిల్ల్ల వస్త్రోత్పత్తి, బీడీల తయారీకి ప్రసిద్ధి చెందింది. నేత కుటుంబంలోని మహిళలు బీ డీలు తయారు చేస్తూ ఇంటి పోషణలో తోడుగా నిలిచేవారు. ఈనేపథ్యంలో చాలా రోజులు గా సిరిసిల్లలో బీడీ పరిశ్రమ కుదేలై పనిదొ రక్క సతమతమవుతున్న మహిళలు ప్రత్యామ్నాయ ఉపాధిగా రాఖీలు తయారు చేస్తూ ఆర్థికంగా సంపాదిస్తున్నారు. బీడీల తయారీ కంటే మంచిది కావడంతో యువత, విద్యార్థులు, గృహిణులు ఉత్సాహంగా ఏడాదిలో పదినెలలు రాఖీలు తయారు చేస్తున్నారు. కలిసొచ్చిన లాక్డౌన్.. లాక్డౌన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి రాఖీల దిగుమతి చాలా వరకు తగ్గింది. అయితే సిరిసిల్ల, చందుర్తిలో రాఖీ పరిశ్రమను శ్రీహరి–తేజస్విని దంపతులు ఏళ్ల తరబడి నిర్వహిస్తున్నారు. ఇక్కడి రాఖీలు ప్రజలను ఆకట్టుకోవాలంటే మహా నగరాల్లో నుంచి వచ్చే రాఖీలకు దీటుగా తయారు చేయాలి. ఈక్రమంలో రాఖీల తయారీకి ముడి సరుకును ముంబాయిలోని మల్లాడ్ ప్రాంతం నుంచి తీసుకొస్తున్నారు. రంగురాళ్లు, సిల్వర్, గోల్డెన్, దేవుళ్ల బొమ్మలు, వివిధ పార్టీల గుర్తులతో రాఖీలు తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. మణికంఠ రాఖీ సెంటర్ బ్రాండ్ పేరు పక్క జిల్లాలకు పాకింది. రాఖీల నాణ్యత ఎక్కువ, ఖరీదు తక్కువ కావడం, లాక్‌డౌన్‌తో ఇతర రాష్ట్రాల్లో రాఖీల తయారీ తగ్గడం సిరిసిల్ల రాఖీలకు మరింత కలిసొచ్చింది. తక్కువ ధరల్లో.. సిరిసిల్లలో తయారయ్యే రాఖీలు చూసేందుకు అందంగా, తక్కువ ధరలో దొరకడం వీటికి క్రేజ్ పెరిగింది. రూ.2 నుంచి రూ.100 వరకు ఖరీదు చేసే రాఖీలు ఇక్కడ తయారవుతున్నాయి. ఏటా జిల్లా కేంద్రంతో పాటు చందుర్తి మండలం లింగంపేట లో సుమారు 16లక్షల రాఖీలు తయారు చేస్తున్నా రు. జిల్లాతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ తది తర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. -
సోదరీసోదరుల అనురాగ అనుబంధాల మిఠాయి
సోదరీసోదరుల అనురాగ అనుబంధాల తియ్యటి పండుగ.. సోదరుడి నోరు తీపి చేయటానికి సోదరి ఆప్యాయతను కలబోసి తినిపించే మిఠాయిల పండుగ తనకు రక్షణగా ఉండమని సోదరుడిని భరోసా కోరే రక్షాబంధన్ పండుగ.. 1. దూద్ పాక్ కావలసినవి: చిక్కటి పాలు – 5 కప్పులు; కుంకుమ పువ్వు – కొద్దిగా; చల్లటి పాలు – ఒక టేబుల్ స్పూను; బాస్మతి బియ్యం – ఒక టేబుల్ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను; పంచదార – అర కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; గార్నిషింగ్ కోసం: బాదం పప్పుల తరుగు – ఒక టేబుల్ స్పూను; పిస్తా పప్పుల తరుగు – ఒక టేబుల్ స్పూను తయారీ ఒక చిన్న పాత్రలో టేబుల్ స్పూను పాలు, కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీరు ఒంపేసి, నెయ్యి జత చేసి పక్కన ఉంచాలి. పాలను మరిగించాక, నెయ్యి జత చేసిన బియ్యం అందులో పోసి, సన్నని మంట మీద మధ్యమధ్యలో కలుపుతూ, ఉడికించాలి. పంచదార, కుంకుమ పువ్వు జత చేసిన పాలు, ఏలకుల పొడి వేసి బాగా కలిపి, సన్నని మంట మీద మధ్యమధ్యలో కలుపుతూ ఆరేడు నిమిషాలు ఉంచి, దింపేయాలి. చల్లారాక ఫ్రిజ్‌లో అరగంట సేపు ఉంచి బయటకు తీయాలి. బాదం పప్పుల తరుగు, పిస్తా పప్పుల తరుగుతో అలంకరించి, అందించాలి. చదవండి: రొయ్యల ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో తెలుసా? 2. కాజు కోప్రా షీరా కావలసినవ: జీడి పప్పుల పొడి – అర కప్పు (రవ్వలా ఉండాలి); కొబ్బరి తురుము – అర కప్పు; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; పంచదార – 5 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా తయారీ చిన్న గ్లాసులో కొద్దిగా నీళ్లు, కుంకుమ పువ్వు వేసి కలిపి పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, జీడి పప్పు పొడి, కొబ్బరి తురుము వేసి మీడియం మంట మీద మూడు నిమిషాల పాటు ఆపకుండా కలుపుతుండాలి. ఒక పాత్రలో పావు కప్పు నీళ్లలో పంచదార వేసి కరిగించి, వేయించిన జీడి పప్పు మిశ్రమానికి జత చేసి, బాగా కలపాలి. కుంకుమ పువ్వు నీళ్లను జత చేసి మరోమారు కలపాలి. ఏలకుల పొడి జత చేసి, కలిపి, దింపేసి, చల్లారాక అందించాలి. 3. కేసర్ మలై కుల్ఫీ కావలసినవి: కుంకుమ పువ్వు – కొద్దిగా; చల్లటి పాలు – ఒక టేబుల్ స్పూను; కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూను; చిక్కటి పాలు – నాలుగున్నర కప్పులు; పంచదార – 5 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – పావు టీ స్పూను తయారీ ఒక గ్లాసులో కొద్దిగా పాలు, కుంకుమ పువ్వు వేసి కలిపి పక్కన ఉంచాలి. చిన్న పాత్రలో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు, కార్న్ ఫ్లోర్ వేసి కలిపి పక్కన ఉంచాలి. స్టౌ మీద మందపాటి గిన్నెలో పాలు పోసి సన్నటి సెగ మీద మధ్యమధ్యలో కలుపుతూ మరిగించాలి. కార్న్ ఫ్లోర్ నీళ్లు, పంచదార జత చేసి సన్నటి మంట మీద సుమారు అరగంట సేపు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించి దింపేయాలి. మిశ్రమం బాగా చల్లారాక కుంకుమ పువ్వు పాలు, ఏలకుల పొడి జత చేయాలి. తయారైన మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్‌లోకి పోసి, డీప్ ఫ్రీజర్‌లో సుమారు ఎనిమిది గంటలు ఉంచాక తీసుకుని తినాలి. – వైజయంతి పురాణపండ చదవండి: బ్రెడ్ పిజ్జా ఎలా తయారు చేయాలో తెలుసా? -
అక్కపై దారుణం, ఎంత పనిచేశావ్ తమ్ముడు
పూణే:"అమ్మా నాన్నలు అక్కని ప్రేమగా చూసుకుంటున్నారు. కానీ నన్ను మాత్రం పట్టించుకోవడం లేదు. నేనేం పాపం చేశాను. ఎందుకు ఈ పార్షియాలిటీ. కూతుర్ని ఎలాగైతే చూసుకుంటున్నారో.. నన్నుకూడా అలాగే చూసుకోవాలి కదా. కానీ అలా చేయడం లేదంటూ" ఆగ్రహం వ్యక్తం చేసిన తమ్ముడు.. నిద్రపోతున్న అక్కపై గొడ్డలితో దాడి చేశాడు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. పూణేలోని హింగ్నే ఖుర్ద్ ప్రాంతానికి చెందిన మనీషా,శంకర్ అక్కా తమ్ముడు. మనీషాకు పెళ్లై తన భర్తతో కలిసి వేరే ప్రాంతంలో నివాసం ఉంటుంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తుంది. అయితే తల్లిదండ్రులను చూసేందుకు పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 5గంటల సమయంలో నిద్రపోతున్న అక్క మనీషాపై తమ్ముడు శంకర్ గొడ్డలితో దాడి చేశాడు. అడ్డొచ్చిన తల్లిదండ్రుల్ని బెదిరించాడు. దాడి జరిగే సమయంలో పక్కనే ఉన్న మనీషా కొడుకు రోహన్ దారుణాన్ని ఆపేందుకు ప్రయత్నించాడు. మేనమామ శంకర్‌ను పక్కకు తోసేసి తీవ్రగాయాల పాలైన తల్లిని ఆస్పత్రికి తరలించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆస్తికోసమే దారుణం..! దర్యాప్తులో భాగంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణ సమయంలో తల్లిదండ్రులు తన అక్క మనీషాను ప్రేమగా చూసుకుంటున్నారని, తనని మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే మనీషా కొడుకు రోహన్ మాత్రం.. వారసత్వం కింద తాతకు చెందిన ఆస్తి మనవడికి రాయడం మేనమామ శంకర్ నచ్చలేదని, అందుకే తన తల్లిపై దాడి చేశాడని తెలిపాడు. -
అనంతపురం: పెనుకొండలో అన్నాచెల్లెళ్లు ఆత్మహత్య
-
విషాదం: అన్న, ఇద్దరు చెల్లెళ్లు ఆత్మహత్య
అనంతపురం: అన్నాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకోవడం పెనుకొండలో విషాదం నింపింది. ఒకేరోజు ముగ్గురు విష పదార్థం సేవించి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెనుకొండలోని పదవీ విరమణ పొందిన బ్యాంక్ ఉద్యోగి అశ్వర్థప్ప (65) నివాసంలో దుర్వాసన వస్తోంది. దీంతో స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించగ అశ్వర్థప్ప, అతడి ఇద్దరు సోదరిలు విగతజీవులుగా పడ్డారు. అయితే వారు కొన్నిరోజుల కిందట విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనపై పెనుకొండ పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. అయితే వారు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారో అనే విషయం ఇంకా తెలియరాలేదు. -
ప్రేమ ముద్ద..!
వేటపాలెం : దీపావళి అనగానే చీకట్లను తరిమే కాంతి గుర్తుకు వస్తుంది. చెడుపై విజయం సాధించిన మంచి మదిలో మెదులుతుంది. తెలుగు లోగిళ్లలో దీపపు కాంతి కనిపిస్తుంది. అలాగే ఈ వేడుకలో భగినీ హస్తభోజనానికీ చోటు ఉంటుంది. భగినీ అంటే సోదరి అని అర్థం. సోదరి చేతివంట తినడం భగినీ హస్తభోజనం. ఇది దీపావళి వెళ్లిన రెండోరోజు వస్తుంది. దీనినే యమ ద్వితీయ అని కూడా అంటారు. వేటపాలెంలో ఈ వేడుక ప్రతి ఏటా ఉల్లాసంగా జరుగుతుంది. శనివారం యమ ద్వితీయ. అసలు దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి పాఠకుల కోసం ఈ కథనం. యమధర్మరాజు సోదరి యమునానది. ఆమె తన అన్న దగ్గరకు నిత్యం వెళ్లి.. తన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లాలని కోరేదట. నరకలోక పాలనతోనే సతమతమైపోయే యమధర్మరాజుకు సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేయడానికి తీరిక దొరకలేదు. కానీ ఎలాగైనా వెళ్లి తీరాలని సంకల్పించుకున్నాడు. చివరికి ఆయనకు కార్తీకమాసం, శుక్లపక్షం ద్వితీయతిధి నాడు విరామం దొరికింది. ఆరోజున సోదరైన యమున ఇంటికి వెళ్లాడు. ఆనందించిన ఆమె తన అన్నకు షడ్రషోపేతమైన విందు భోజనాన్ని వడ్డించింది. యముడు తన సోదరి భక్తితో చేసిన వంటలన్నీ చక్కగా ఆరగించాడు. అమృతాన్ని తాగినంత ఆనందం యమధర్మరాజుకు కలిగింది. తన చెల్లెలి చేతివంటను మెచ్చుకొని ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడామె ‘అగ్రజా నీవు ప్రతి సంవత్సరం ఇదే రోజున నా ఇంటికి వచ్చి నా చేతివంటను తినాలి. అంతేకాక ప్రతి సంవత్సరం కార్తీక శుక్లద్వితీయనాడు లోకంలో ఏ అన్నలు తమ చెల్లెళ్లు వండిన పదార్థాలను భోజనం చేస్తారో అలాంటి వాళ్లకు నరకబాధ ఉండకూడదు’ అని వరం కోరింది. యముడు తథాస్తు అని వరమిచ్చాడు. నాటి నుంచి ఈ వేడుక ‘యమ ద్వితీయ, భ్రాతృ ద్వితీయ, అన్నదమ్మల భోజనాలు’గా ప్రసిద్ధి కెక్కాయి. బాంధవ్యాల పటిష్టత కోసం.. భగినీ హస్తభోజనం అనాదిగా వస్తున్న ఆచారం. ఇందులో మానవ జీవన విశేషాలు, పరమార్థాలు ఇమిడి ఉన్నాయి. మనిషి కుటుంబజీవి కనుక కుటుంబాన్ని విడిచి జీవించలేడు. కుటుంబంలో తల్లిదండ్రులు ముఖ్యులు. కని, పెంచి, పోషించి విద్యాబుద్ధులను ప్రసాదిస్తారు. ఆ తర్వాత ఆత్మీయులైనవారు తోబుట్టువులైన అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్మల్లే. తల్లిదండ్రులు వయసులో పెద్దవారు కాబట్టి తమ సంతానం జీవించినంతకాలం వారు ఉండలేరు. అందుకే సోదరసోదరీలతో కలిసి ఏడాదికి ఒక్కసారైనా భోజనం చేయకపోతే ఆత్మీయతలు ఎలా నిలుస్తాయి? అంతేకాక ఒకరి కష్టసుఖాలు మరొకరు తెలుసుకొని స్పందించే అవకాశం కూడా ఉంటుంది. అలా ఈ అన్నదమ్ముల భోజన సంప్రదాయం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య జీవితాంతం ప్రేమాభిమానాలు ఉండే అవకాశం లభిస్తుంది. దూరం పెరిగింది.. ఈ ఆధునిక కాలంలో ఉపాధి కోసం రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు దాటిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏడాదికొకసారి కాదు కదా రెండు, మూడేళ్ల వరకూ ఆత్మీయులను, తోబుట్టువులను కలిసే అవకాశం ఉండటంలేదు. అందుకే ఈ ఆచారాన్ని పాటిస్తే ఆత్మీయబంధాలు వర్థిల్లుతాయి. ‘ఆత్మావై పుత్రనామాసి’ అన్నది వేదం. అంటే తల్లిదండ్రుల ఆత్మలే సంతానంలో ఉంటాయని అర్థం. అందువల్ల అక్కాచెల్లెళ్లు అమ్మకు ప్రతి రూపాలే. అమ్మ చేతివంట అమృతంకు సమానం అయితే అక్కాచెల్లెళ్ల చేతివంటకూడా సుధామయమే. ఆచారం ఎప్పుడూ దోషభూయిష్టమై ఉండదు. యుక్తాయుక్త విచక్షణగల మానవులు తమ ఆచరణల్లో ఏయే లోపాలున్నాయో తెలుసుకుని వాటిని సవరించుకొని చక్కగా ఆచరించాలి. అదే విజ్ఞత. -
కృష్ణమ్మ సాక్షిగా..
కొల్లిపర: అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను కృష్ణమ్మ సాక్షిగా గురువారం నిర్వహించారు. కృష్ణాపుష్కరాలు జరుగుతున్న నదీ పరివాహక ప్రాంతాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం చెలెళ్లు అన్నలకు రాఖీలు కట్టారు. మండల కేంద్రంలోని తిరుపతమ్మగుడికి సమీపంలో ఉన్న కృష్ణానది వద్ద పలువురు చెలెళ్లు అన్నలకు రాఖీలు కడుతూ కనిపించారు. పొట్టిదిబ్బలంకకు చెందిన ముగ్గురు చెలెళ్లు అన్నకు కృష్ణమ్మ సాక్షిగా రాఖీ కట్టారు.