Telangana Crime News: అక్క ఆశీర్వాదమే.. అతనికి ఆఖరి రోజు..
Sakshi News home page

అక్క ఆశీర్వాదమే.. అతనికి ఆఖరి రోజు..

Published Thu, Aug 17 2023 1:44 AM | Last Updated on Thu, Aug 17 2023 11:23 AM

- - Sakshi

మహబూబాబాద్‌: అక్క ఆశీర్వాదం కోసం వచ్చిన తమ్ముడు రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఈ ఘటన మండలంలోని కొండపర్తి గ్రామంలో జరిగింది. మామునూరుకు చెందిన ఎర్ర భానుప్రకాష్‌ (26) మంగళవారం రాత్రి కొండపర్తిలో నివాసమంటున్న తన అక్కాబావ మాదాసు భార్గవి, శ్రీధర్‌ ఇంటికి వచ్చాడు. బుధవారం సాయంత్రం బైక్‌పై మామునూరుకు వెళ్తున్నాడు.

అదే సమయంలో వరంగల్‌ నుంచి కొండపర్తికి ఆటో వస్తుంది. ఈ క్రమంలో కొండపర్తి గ్రామ చివర మలుపు వద్ద ఎదురెదురుగా ఆటో, బైక్‌ ఢీకొన్నాయి. ఈ ఘటనలో భాను ప్రకాష్‌కు తీవ్ర గాయాలుకావడంతో స్థానికులు ఎంజీఎం తరలించారు. అయితే భానుప్రకాష్‌ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, భాను ప్రకాశ్‌కు గాయత్రితో వివాహం కాగా ఇటీవల కొడుకు జన్మించాడు.

మంగళవారం కొడుకుకు 21 రోజు ఫంక్షన్‌ను చేశాడు. మరుసటి రోజు అక్క ఆశీర్వాదం తీసుకోవడం వారి సంప్రదాయం. దీంతో అతను కొండపర్తికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి పెద్దనాన్న కొడుకు భరత్‌ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపారు. భాను ప్రకాష్‌ మామునూరు బెటాలియన్‌లో అవుట్‌ సోర్సింగ్‌ కుక్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement