Jayashankar District Latest News
-
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
పలిమెల: ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అశోక్‌కుమార్ అధికారులను అదేశించారు. మండల కేంద్రంలో జరుగుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, తదితర ప్రభుత్వ పథకాల సర్వే తీరును అయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబితాలో లేని వారు ఉంటే దరఖాస్తులు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ అనిల్, ఎంపీఓ ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు కాటారం: అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా సర్వే కొనసాగించాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ అన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం కాటారం మండలం చింతకానిలో కొనసాగుతున్న సర్వేను సోమవారం సబ్ కలెక్టర్ పరిశీలించారు. సబ్ కలెక్టర్ వెంట మండల ప్రత్యేకాధికారి నరేశ్, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, సర్వే సిబ్బంది ఉన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు చిట్యాల: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటుచేసి ఆమె మాట్లాడారు. లబ్ధిదారుల ఎంపిక పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశ్రీ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు గుంటూరుపల్లిలో సర్వేను పరిశీలించారు. -
గ్రామాల అభివృద్ధికి పెద్దపీట
● మంత్రి సీతక్క భూపాలపల్లి రూరల్: గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి భూపాలపల్లి మండలం బావుసింగ్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మిపురం తండాలో రూ.10లక్షల వ్యయంతో నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, రోడ్డు, రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం ద్వారా వాణిజ్య కార్యకలాపాలకు కూడా మేలు జరుగుతుందన్నారు. రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఓ నారాయణ రావు, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
కార్మికులను పట్టించుకోని వైద్యులు
భూపాలపల్లి అర్బన్: సింగరేణి ఏరియా ఆస్పత్రికి వెళ్లిన కార్మికులను వైద్యులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య ఆరోపించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య పరీక్షల నిమిత్తం ఏరియా ఆస్పత్రికి వెళ్తే ఆస్పత్రిలో యంత్రాలు పనిచేయక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. ఈసీజీ యంత్రం పనిచేయడం లేదని.. కార్పొరేట్ ఆస్పత్రికి పంపిస్తున్నారన్నారు. అక్కడికి వెళ్తే ఎలాంటి సమస్య లేదని తిరిగి పంపిస్తున్నట్లు తెలిపారు. దీంతో కార్మికులు మూడు నాలుగు రోజులు వేతనాలు కోల్పోతున్నారని ఆరోపించారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కార్మికులకు యాజమాన్యం మెడికల్ టెస్ట్ నిర్వహిస్తుందని.. ఈ టెస్టులకు ఒక్క రోజు యాజమాన్యం వేతనంతో కూడిన సెలవు ఇస్తుందన్నారు. యంత్రాలు పనిచేయకపోవడంతో కార్మికులు మరో రెండు రోజులు సెలవులు తీసుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి ఆస్పత్రుల్లో మెరుగైన యంత్రాలు, సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు జనార్దన్, ప్రసాద్‌రెడ్డి, శ్రీనివాస్, బాపు, జయశంకర్, శ్రీధర్, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు. పటిష్టంగా సూర్యఘర్ పథకం అమలు కాటారం: పీఎం సూర్యఘర్ పథకం అమలుకు ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ట్రాన్స్‌కో జిల్లా ఎస్ఈ మల్చూర్ సూచించారు. సూర్యఘర్ పథకం అమలుపై కాటారం మండలకేంద్రంలోని రైతువేదికలో ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా కాటారం గ్రామం మోడల్ విలేజ్‌గా ఎంపికై ందన్నారు. గ్రామంలో 1,080 విద్యుత్ కనెక్షన్లు ఉండగా ప్రతీ ఇంటికి సూర్యఘర్ పథకంలో భాగంగా ఉచితంగా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సోలార్ విద్యుత్ పథకం ఏర్పాటు కోసం సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహిస్తారని లబ్ధిదారులు తమ విద్యుత్ బిల్లు, ఆధార్‌కార్డు, బ్యాంక్ అకౌంట్ సర్వే సిబ్బందికి అందజేయాలని సూచించారు. మోడల్ విలేజ్‌లో సోలార్ విద్యుత్ ఏర్పాటుకు ప్రణాళికతో ముందుకెళ్తునట్లు ఎస్ఈ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ రెడ్కో డీఎం మహేందర్, ఏడీఈ నాగరాజు, సబ్ ఇంజనీర్ ఉపేందర్, సిబ్బంది పాల్గొన్నారు. నాణ్యమైన వైద్యసేవలు అందించాలి కాటారం: ప్రభుత్వ ఆస్పత్రి ద్వారా రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని జాతీయ నాణ్యత ప్రమాణాల బృందం(ఎన్‌క్యూఏఎస్) సభ్యులు డాక్టర్ ఆనంది సత్యకుమార్, డాక్టర్ కిరణ్ పాటిల్ సూచించారు. మహాముత్తారం మండలం బోర్లగూడెంలోని హెల్త్ వెల్నెస్ సెంటర్‌ను సోమవారం పరిశీలించారు. వెల్నెస్ సెంటర్ ద్వారా అందుతున్న వైద్యసేవలు, మందుల స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి రోజు వారి రోగుల వివరాలపై ఆరాతీశారు. అనంతరం వెల్నెస్ సెంటర్ ఆవరణలో సమావేశం నిర్వహించారు. వైద్యులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించేలా వైద్య సేవలు అందించాలన్నారు. ఆస్పత్రులు, వెల్నెస్ సెంటర్లలో వైద్యసిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆవరణలో పరిశుభ్రత ఉండేలా చూసుకోవాలన్నారు. బృందం సభ్యుల వెంట జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, జిల్లా ప్రోగ్రామింగ్ అధికారిణి డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ ప్రమోద్, స్థానిక వైద్యులు డాక్టర్ సందీప్, క్వాలిటీ మేనేజర్ శరత్, డీపీఓ చిరంజీవి, డీడీఎం మధుబాబు, తదితరులు ఉన్నారు. -
లెక్క పక్కాగా..
జిల్లాలో కొనసాగుతున్న పశుగణనకాటారం: జిల్లాలో పశుజాతుల లెక్కింపు ప్రక్రియ పక్కాగా కొనసాగుతోంది. పశువైద్య సిబ్బంది ఇంటింటా తిరిగి ఆయా జాతులకు సంబంధించిన పశువుల వివరాలను నమోదు చేస్తున్నారు. పశుజాతులకు సంబంధించిన సంక్షేమ పథకాల రూపకల్పన చేయడంతో పాటు పశుపోషకుల ఆర్థిక పరిపుష్టిని అంచనా వేసేందుకు పశుగణన ఉపయోగకరంగా ఉంటుంది. దీని కోసం ప్రతి ఐదు సంవత్సరాల కు ఒకసారి ప్రభుత్వ ఆదేశాలతో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో పట్టణాలు, గ్రామాల్లో పశుజాతుల లెక్కింపు చేపడుతున్నారు. 2018–19 సంవత్సరంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఐదేళ్లు పూర్తి కావడంతో రెండు నెలల క్రితం పశుగుణన సర్వే ప్రారంభించారు. జిల్లాలో 12 మండలాలు ఉండగా 241 గ్రామపంచాయతీల్లో పశుగుణన కొనసాగుతోంది. ఇప్పటివరకు 70శాతం మేర పశువుల లెక్కింపు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 28లోపు పశుగణన పూర్తిచేయాలని ప్రభుత్వం గడువు విధించగా నిర్దేశిత సమయంలోగా జిల్లాలో లక్ష్యం పూర్తి చేయాలనే ఉద్దేశంతో పశువైద్యశాఖ అధికారులు, సిబ్బంది ముందుకెళ్తున్నారు. 61మంది ఎన్యుమరేటర్లు.. జిల్లాలో అక్టోబర్ 25న పశుగణన సర్వే ప్రారంభమవగా 61మంది ఎన్యుమరేటర్లు ఇంటింటా తిరిగి పశువుల లెక్కింపు చేపడుతున్నారు. పశుగణన సర్వే పర్యవేక్షణ కోసం 10మంది సూపర్వైజర్లు, జిల్లాస్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఆధ్వర్యంలో సర్వే కొనసాగుతుండగా ఎప్పటికప్పుడు వివరాలను రాష్ట్రస్థాయి అధికారులకు అందజేస్తున్నారు. పశువైద్యశాఖలో సిబ్బంది కొరత ఉండగా గోపాలమిత్రల సహాయం తీసుకొని సర్వేను ముందుకు నడిపిస్తున్నారు.పశుధన్ యాప్‌లో నమోదు.. పశుగణన 1919వ సంవత్సరంలో ప్రారంభమవగా ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒకసారి పశుగణన లెక్కిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు 20సార్లు పశుగణన చేపట్టారు. మునుపెన్నడు లేని విధంగా తొలిసారి పశుగణన ఆన్లైన్ ద్వారా చేపడుతున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన పశుధన్ అనే యాప్ ద్వారా 16 పశుజాతులకు సంబంధించిన వివరాలను ఎన్యూమరేటర్లు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఆవులు, ఎద్దులు, గేదె జాతి పశువులు, గొర్రెలు, మేకలు, పందులు, గుర్రాలు, గాడిదలు, కుక్కలు, పెంపుడు కుక్కలు, ఒంటెలు, పొట్టి గుర్రాలు, కుందేళ్లు, ఏనుగులు, కోళ్ల రకాలను లెక్కిస్తున్నారు. పశుపోషణలో ఉన్న రైతులు, కుటుంబాల వివరాలను సేకరించడంతో పాటు పశువుల వయసు సైతం సేకరించి ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. సర్వే పూర్తయిన ప్రతి ఇంటికి స్టిక్కరింగ్ చేస్తున్నారు.●నిర్ణీత గడువులోగా లెక్కింపు పూర్తి.. జిల్లాలో రెండు నెలలుగా పశుగణన కొనసాగుతోంది. ఎన్యూమరేటర్లు ఇంటింటా తిరిగి 16 రకాల పశుజాతులకు సంబంధించిన వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ప్రతీ అంశాన్ని పక్కాగా ఆన్లైన్లో నమోదుచేసి పారదర్శకంగా సర్వే కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 70శాతం మేర పశుగణన పూర్తయింది. ప్రభుత్వం విధించిన గడువులోగా పశుగణన పూర్తి చేస్తాం. – కుమారస్వామి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిజిల్లా సమాచారం.. ఇప్పటివరకు 70శాతం మేర పూర్తి ఫిబ్రవరి 28లోపు పూర్తయ్యే అవకాశం -
ప్లాట్లు అందేనా..
నూతనంగా ఏర్పాటుచేసిన ఆర్అండ్ఆర్ కాలనీ మల్హర్: ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందక భూ నిర్వాసితులు రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. జెన్కో, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. తమ ప్రాంత అభివృద్ధి కోసం ఇళ్లు, జాగలను వదిలి దిక్కులేని వారిలాగా సొంత ఊళ్లోనే పరాయివారుగా నివసించాల్సి వస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్హర్ మండలం తాడిచర్ల బ్లాకు–1 ఓపెన్‌కాస్ట్ విస్తరణలో భాగంగా తాడిచర్ల గ్రామం ఎస్సీకాలనీలో 49 పైచిలుకు, కాపురం గ్రామంలో 136 ఇండ్లను జెన్కో సేకరించింది. సేకరించిన ఇళ్లకు పరిహారం సైతం చెల్లించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో కేటాయింపులో భాగంగా తాడిచర్ల గ్రామం ఎస్సీకాలనీలో 69మంది, కాపురం గ్రా మంలో 202మంది లబ్ధిదారులను గుర్తించారు. వీరిలో కొందరికి పరిహారంతో పాటు ప్లాట్లను కేటాయించారు. మరికొంతమందికి మాత్రం పరిహారం అందజేసి ప్లాట్లు కేటాయించలేదు. 134మందికే నివాస స్థలాలు.. తాడిచర్ల బ్లాక్–1లో మొత్తం 271మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. ఇందులో తాడిచర్ల ఎస్సీ కాలనీలో 69మంది, కాపురంలో 202మందిని పీడీఎఫ్ లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటి వరకు ఎస్సీ కాలనీవాసులకు 69మందికి, కాపురంలోని 65మందికి మొత్తం 134మందికి మాత్రమే రెండు విడుతలగా ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇంకా కాపురం గ్రామంలోని 137మందికి ఇళ్ల స్థలాలను కేటాయించాల్సి ఉండగా పెండింగ్‌లోనే ఉన్నాయి. రెండేళ్లుగా స్థలా లను కేటాయించాలని నిర్వాసితులు కోరినా పలు కారణాలతో నెట్టుకుంటూ వస్తున్నారు. తాడిచర్ల చుట్టుపక్కల ఈ ప్యాకేజీకి అవసరమైన భూమి అందుబాటులో లేకపోవడంతోనే ఇబ్బంది ఎదురవుతుందని సదరు అధికారులు పేర్కొంటున్నారు. గతంలో 8ఎకరాలకు పైగా ప్రైవేట్ భూమి కొనుగోలు చేసి నిర్వాసితులకు ప్లాట్లు ఇ వ్వాలని చూసినా అది కార్యరూపం దాల్చలేదు. భూమి కన్నా.. పరిహారం మిన్న.. ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో పెండింగ్‌లో ఉన్న 137మంది తమకు నివాస స్థలాలకు బదులు అంతమేర పరిహారం నగదు రూపంలో చెల్లించాలని కోరుతున్నారు. ఇప్పటికే చాలామంది నిర్వాసితులు ఆర్అండ్ఆర్ ద్వారా వచ్చిన డబ్బులతో వివిధ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసుకున్నారు. స్థిర నివాసం ఏర్పరుచుకునేందుకు సిద్ధమయ్యారు. గతంలో సైతం తమకు ఇళ్ల స్థలాలకు బదులు పరిహారం చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని గతంలో ఆర్డీఓకు వినతిపత్రాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. తమ సమస్యలు దృష్టిలో ఉంచుకుని నగదు రూపంలో ఓ పరిహారం అందేలా చూడాలని నిర్వాసితులు కోరుతున్నారు. న్యాయం చేయాలి ఓపెన్‌కాస్ట్‌లో ఇళ్లు కోల్పోయిన మాకు అధికారులు న్యాయం చేయాలి. సంవత్సరాలు గడుస్తున్నా ప్లాట్లకు సంబంధించిన అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ప్లాట్లు ఇవ్వకుండా పరిహారం ఇవ్వాలని గతంలో 30మందికి ఆర్డీఓకు వినతి పత్రాలు ఇచ్చాం. జిల్లా అధికారులు స్పందించి తమకు సత్వర న్యాయం చేయాలి – గుమ్మడి రవి, తాడిచర్ల, మల్హర్డబ్బులు ఇవ్వాలి కాపురం గ్రామంలో ఇళ్లు కోల్పోయాను. ఇండ్లకు డబ్బులు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద పరిహారం చెల్లించారు. సంవత్సరాలు గడుస్తున్నా ప్లాట్ మాత్రం కేటాయించలేదు. అప్పటి కలెక్టర్ ప్లాట్‌కు బదులుగా డబ్బులు ఇస్తామని చెప్పడంతో ఇతర చోట స్థలం తీసుకున్నాను. అధికారులు ప్లాట్‌కు బదులుగా డబ్బులు ఇవ్వాలి. – ముడతనపల్లి సంపత్, తాడిచర్ల, మల్హర్●సబ్ డివిజన్ కార్యాలయానికి పంపిస్తాం.. కాటారం సబ్ డివిజన్‌కు సంబంధించిన భూసేకరణ ఫైళ్లను నూతన ఏర్పడిన కాటారం సబ్ కలెక్టర్(సబ్ డివిజన్) కార్యాలయానికి పంపిస్తాం. మల్హర్ మండలం తాడిచర్ల, కాపురం గ్రామాలు భూ సేకరణకు పెండింగ్ భూసేకరణకు సంబంధించని పనులు అక్కడి నుంచి జరుగుతాయి. – రవి, భూపాలపల్లి ఆర్డీఓరెండేళ్లుగా ఎదురుచూపులే.. పట్టించుకోని జెన్కో, రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పడుతున్న నిర్వాసితులు -
గ్రామసభలు విజయవంతంగా నిర్వహించాలి
భూపాలపల్లి రూరల్: గ్రామసభలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. గ్రామసభలు నిర్వహణపై సోమవారం ఐడీఓసీ కార్యాలయం నుంచి మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మొదటిదశలో క్షేత్రస్థాయి విచారణ సజావుగా, సక్రమంగా చేశారని అదే స్ఫూర్తితో గ్రామసభలు విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగిన క్షేత్రస్థాయి విచారణలో భాగస్వాములైన అధికారులను, సిబ్బందిని అభినందించారు. 21నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న గ్రామసభల్లో ఇందిరమ్మ కమిటీలను భాగస్వాములను చేయాలని ముందస్తు సమాచారం అందించి ఆహ్వానించాలని సూచించారు. గ్రామసభల ప్రారంభానికి ముందు ప్రభుత్వం నుంచి వచ్చిన సందేశాన్ని చదివి వినిపించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, భూపాలపల్లి మున్సిపాలిటీతో సహా 72 గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామసభలు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, పౌర సరఫరాల అధికారి శ్రీనాధ్, డీఆర్డీఓ నరేష్, డీపీఓ నారాయణరావు, అన్ని మండలాల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు. షెడ్యూల్ ప్రకారం గ్రామసభలు టేకుమట్ల: నేటి (మంగళవారం) నుంచి ఈ నెల 24వరకు షెడ్యూల్ ప్రకారం గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మండలంలోని ఆశిరెడ్డిపల్లి, పంగిడిపల్లిలో నేడు జరుగనున్న గ్రామసభల ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామసభల నిర్వహణ సమాచారాన్ని గ్రామస్తులందరికీ తెలిసేలా దండోరా వేయించాలని సూచించారు. ప్రభుత్వం అర్హులందరికీ రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సాగుకు యోగ్యం కాని భూముల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారని, ఆ భూముల వివరాలను గ్రామ సభల్లో వెల్లడిస్తారని చెప్పారు. నూతన రేషన్ కార్డుల కోసం గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతరం ప్రక్రియ అని చెప్పారు. అనంతరం గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి సేకరించిన భూములను పరిశీలించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, తహసీల్దారు విజయలక్ష్మి, ఎంపీడీఓ అనిత, ఆర్ఐ సంతోష్‌కుమార్, ఎంపీఓ సురేష్ పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాహుల్‌శర్మ -
రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి
కాటారం: డ్రైవర్లు, వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణాలు సాగించాలని కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కాటారం మండల కేంద్రంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్‌స్టేషన్ నుంచి ప్రధాన కూడలి వరకు పోలీసులు ఆటోలతో ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్రధాన కూడలిలో రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ రూల్స్, ప్రమాదాల నివారణ తదితర అంశాలపై ఆటోడ్రైవర్లు, వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ డ్రైవర్లు, వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించడంతో పాటు నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. తమపై తమ కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటారనే విషయాన్ని డ్రైవర్లు అనునిత్యం గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. మైనర్లకు, డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి వాహనాలు ఇవ్వరాదని.. ఏదైనా ప్రమాదానికి గురైతే వాహన యజమానులు జైలుపాలు కావాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, సీఐ నాగార్జునరావు, ఎస్సై మ్యాక అభినవ్ పాల్గొన్నారు.కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి -
హేమాచల క్షేత్రంలో ఏఎస్పీ పూజలు
మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహాస్వామిని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ దంపతులు వారి కుటుంబ సభ్యులతో ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ సంప్రదాయం ప్రకారం పూజారులు స్వాగతం పలికారు. అనంతరం ఏఎస్పీ దంపతులు, వారి కుటుంబ సభ్యుల పేరిట స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. అనంతరం స్వామివారి విశిష్టత, ఆలయ చరిత్రను వివరించి స్వామివారి శేష వస్త్రాలు బహుకరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందచేశారు. వందలాదిగా తరలివచ్చిన భక్తులు.. ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వందలాదిగా తరలివచ్చి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకున్నారు. ఆయా ప్రాంతాల నుంచి కార్లు, ఆటోలు, వివిద ప్రైవేట్ బస్సులు తదితర వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి హేమాచల కొండపై ఉన్న ఆలయానికి చేరుకున్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో స్వయంభు స్వామివారిని దర్శించుకున్న భక్తులు లక్ష్మీనర్సింహాస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు పూలు, పండ్లు నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు రాజశేఖర్‌శర్మ కారంపుడి పవన్‌కుమార్ ఆచార్యులు, స్వామివారికి తిల తైలాభిషేకం పూజలు నిర్వహించారు. మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ పూజారులు గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి శఠారితో ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేశారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందచేశారు. భక్తులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు సందడి నెలకొంది. -
అర్హులందరికీ రేషన్ కార్డులు
మొగుళ్లపల్లి: అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డులు జారీ చేస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. రైతు భరోసా, రేషన్ కార్డులు జారీకోసం ఆదివారం మొగుళ్లపల్లి మండలకేంద్రంలో జరుగుతున్న క్షేత్రస్థాయి విచారణ ప్రక్రియను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ప్రజలు ఆందోళన చెందొద్దని తెలిపారు. ప్రస్తుతం రేషన్కార్డ్ల లబ్ధిదారుల జాబితా సామాజిక, ఆర్ధిక, కుల, రాజకీయ సర్వే ఆధారంగా తయారు చేసిందని, ఇది తుది జాబితా కాదని స్పష్టం చేశారు. గతంలో స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తుల జాబితాలో అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియ పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునిత, ఎంపీడీఓ హుస్సేన్, వ్యవసాయాధికారి సురేందర్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి సునిత తదితరులు పాల్గొన్నారు. సర్వే పకడ్బందీగా నిర్వహించాలి చిట్యాల: రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వేను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మండలంలోని తిర్మలాపూర్, లక్ష్మీపూర్‌తండాలో జరుగుతున్న సర్వేను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హేమ, ఎంపీడీఓ జయశ్రీ, ఆర్ఐ రాజు, ఏఈఓ రమణకుమార్, పంచాయతీ కార్యదర్శులు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు. నేటి ప్రజావాణి రద్దు భూపాలపల్లి రూరల్: నేడు (సోమవారం) కలెక్టరేట్లో జరుగనున్న ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో రైతు భరోసా, నూతన రేషన్ కార్డుల విచారణ ప్రక్రియలో జిల్లా, మండల స్థాయి అధికారులు భాగస్వాములైనందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
భక్తుల కోలాహలం
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం భారీగా తరలివచ్చారు. ఫిబ్రవరి 12నుంచి 15వ తేదీ వరకు మినీ మేడారం జాతరను పురస్కరించుకొని భక్తులు ముందస్తుగా అమ్మవార్లను దర్శించుకునేందుకు మేడారానికి తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే మేడారానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీతో సమ్మక్క సారలమ్మల గద్దెల ప్రాంగణం కోలాహలంగా మారింది. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, చీర సారె, నిలువెత్తు బంగారం, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సారలమ్మ నామస్మరణతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం మార్మోగింది. మహారాష్ట్రకు చెందిన మాజీ మంత్రి, అయ్యిరి ఎమ్మెల్యే అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారం జాతర అభివృద్ధి కోసం మహారాష్ట్ర సీఎం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తానన్నారు. అనంతరం భక్తులు వివిధ ప్రాంతాలలోని చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకున్నారు. డీఎస్పీ రవీందర్ పర్యవేక్షణలో వందల సంఖ్యలో పోలీసులు విధులు నిర్వహించారు. -
నేటితో గడువు ముగింపు
భూపాలపల్లి అర్బన్: శాసీ్త్రయ ధృక్పథాన్ని మరింతగా పెంపొందించి తద్వారా విద్యార్థులను విజ్ఞానవంతులుగా మార్చేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ) కృషి చేస్తోంది. ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏటా హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నారు. సబ్జెక్టును మరింతగా చేరువయ్యేలా నూతన మార్గాలను సైన్స్ ఉపాధ్యాయులు అన్వేషించాలనే ఉద్దేశంతో సెమినార్ నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు తమ మేధస్సును మరింత పదును పెట్టుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈమేరకు వారినుంచి పరిశోధన పత్రాల దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏటా ఒక్కో అంశంపై సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ప్రధాన అంశంగా ‘మన ప్రపంచంలో సైన్స్’ని నిర్దేశించగా ఐదు ఉప అంశాలను విభజించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలల్లోని సైన్స్ ఉపాధ్యాయులు సెమినార్లో పాల్గొనవచ్చు. ఒక్క రోజే అవకాశం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 69 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 45 ప్రైవేట్ పాఠశాలలు, 25 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియన్, ఐదు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వాటిలో పనిచేసే ఆసక్తి ఉన్న సైన్స్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమ పరిశోధన పత్రాలను వెయ్యి పదాలకు మించకుండా నాలుగు పేజీల్లో రాసి నేడు(సోమవారం) సాయంత్రం వరకు పంపాలి. ఆంగ్లం, తెలుగు భాషలో ఏదైనా ఒక దాన్ని ఎంచుకుని పీడీఎఫ్ రూపంలో మెయిల్ ఐడీకి పంపాలి. వాటిని పరిశీలించి ఎంపికై న వారికి ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సదస్సులో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. సైన్స్ ఉపాధ్యాయులకు సెమినార్ పరిశోధన పత్రాలకు దరఖాస్తుల స్వీకరణ ‘మన ప్రపంచంలో సైన్స్’ అనే అంశం ఐదు ఉప అంశాలుగా విభజనఅంశాలు.. ఏటా నిర్వహిస్తున్న సైన్స్ సెమినార్లో శాస్త్ర సాంకేతికతను ఉన్నతీకరిస్తూ ప్రధాన అంశాన్ని రూపొందిస్తున్నారు. ఇందుకనుగుణంగా ఈ ఏడాది ‘మన ప్రపంచంలో సైన్స్’ అనే ప్రధానాంశంపై సెమినార్ ఉంటుంది. దీనికి ఐదు ఉప అంశాలు ఉంటాయి. సైన్స్ బోధనలో కృత్రిమ మేథ చర్య, ప్రభావం పాఠశాలల్లో సుస్థిర పర్యావరణ వ్యవస్థ నిర్వహణ కోసం వ్యూహాలు విద్యార్థుల శ్రేయస్సుకు ఆహార విద్య, ఉపాధ్యాయుల పాత్ర సైన్స్‌లో విద్యాప్రమాణాలు మెరుగుపర్చేందుకు శాసీ్త్రయ మార్గాలు రసాయన శాస్త్రం నేర్చుకునేందుకు సాధనాలు, కొత్త బోధన పద్ధతులు అనే అంశాలు ఉన్నాయి. వీటి ఆధారంగా ఉపాధ్యాయులు తమ అనుభవాలను పరిశోధన పత్రాల రూపంలో పంపాల్సి ఉంటుంది. నిర్దేశిత అంశాల్లో ఏదో ఒకటి ఎంచుకుని లింకు ద్వారా పత్రాలను సమర్పించాలి. ప్రతిభ ఆధారంగా ఎస్సీఈఆర్టీ అధికారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. -
టీబీజీకేఎస్ అఽధికార ప్రతినిధిగా గోవర్ధన్
భూపాలపల్లి అర్బన్: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) బ్రాంచ్ కమిటీ అధికారి ప్రతినిధిగా సుంకరి గోవర్ధన్‌ను నియమించినట్లు బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం బ్రాంచ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్రాంచ్ కార్యదర్శులుగా బాషనపల్లి కుమార్, రాంచందర్, వెంకట్రాజం, నరేందర్, మైనింగ్ స్టాఫ్ ఇన్చార్జ్గా చీకటి వంశీలను నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సదానందం, మధు, నరేష్, రాజేందర్, వంశీ పాల్గొన్నారు. -
పారదర్శకంగా సర్వే
మల్హర్: ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం చేపడుతున్న సర్వే పారదర్శకంగా నిర్వహించాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ సూచించారు. మల్హర్ మండలం తాడిచర్ల గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న రైతుభరోసా సర్వేను సబ్ కలెక్టర్ ఆదివారం పరిశీలించారు. సబ్ కలెక్టర్ వెంట తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ శ్యామ్‌సుందర్, సర్వే టీం సభ్యులు ఉన్నారు. పెండింగ్ పనులు ప్రారంభం కాళేశ్వరం: కాళేశ్వరాలయ పెండింగ్ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆలయ అభివృద్ధికి రూ.25కోట్లు మంజూరయ్యాయి. ఎండోమెంట్ శాఖ పనులు పూర్తికాగా.. పంచాయతీరాజ్ పనులు కొనసాగుతున్నాయి. వచ్చేనెల కుంభాభిషేకం, మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో పెండింగ్ పనులపై అధికారులు దృష్టిసారించారు. ఆలయ రాజగోపురం నుంచి రామాలయం వరకు రూ. 50లక్షలతో మెట్లమార్గం నిర్మాణం పనులు వారం కిందట ప్రారంభించారు. రూ.8కోట్ల వ్యయంతో చేపట్టిన వందగదులు(86)భవనం పనులు కాంట్రాక్టర్లకు ఎస్టిమేషన్లు పెరుగడంతో వదిలేశారు. మళ్లీ ఇటీవల షార్ట్టెండర్కు అదే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. ఆదివారం ఆ వంద గదుల నిర్మాణం పనులు కాంట్రాక్టర్ ప్రారంభించారు. చుట్టూరా డోజర్, జేసీబీలతో పనులు మొదటు పెట్టారు. నేడు నల్లబ్యాడ్జీలతో నిరసన భూపాలపల్లి అర్బన్: మతోన్మాద శక్తుల జోక్యాన్ని నిరసిస్తూ నేడు(సోమవారం) జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టనున్నట్లు ఆయా సంఘాల నాయకులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మతోన్మాద శక్తులు చేసిన ఘటనలకు వ్యతిరేకం చేపట్టనున్న నిరసనలో ఉపాధ్యాయులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ‘కుసుమ్’ దరఖాస్తులు నిల్ఏటూరునాగారం: పోడు భూములకు హక్కుపత్రాలు కలిగి ఉన్న గిరిజన రైతులు సోలార్ ప్లాంట్స్ ఏర్పాటుచేసుకునేందుకు పీఎం కుసుమ్ పథకం కింద దరఖాస్తులు ఆహ్వానించగా ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఒక్కటి కూడా రాలేదు. ఐటీడీఏ పరిధిలోని పోడు భూముల్లో నాలుగు ఎకరాలు కలిగి ఆర్ఓఎఫ్ఆర్ పట్టా లేదా రెవెన్యూ పట్టా కలిగి ఉన్న రైతుల నుంచి భూములను 25 సంవత్సరాలపాటు లీజుకు తీసుకొని ఆ భూములకు ఎకరానికి సంవత్సరానికి రూ.12,500 చెల్లించనున్నారు. ఈ విధంగా నెలకొల్పిన సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను స్వయం సహాయక సంఘాల ద్వారా నిర్వహించనున్నారు. దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 15నుంచి 19వరకు అవకాశం ఇచ్చినప్పటికీ ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం గమనార్హం. గిరిజన రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై ఏటీడీఓ క్షేత్రయ్యను వివరణ కోరగా పీఎం కుసుమ్ పథకం గురించి అనుమానాలు అడుగుతున్నారని, ఎవరు కూడా ఇంత వరకు దరఖాస్తు చేసుకోలేదని తెలిపారు.నాణ్యతా ప్రమాణాలతో చెరువు పనులువెంకటాపురం(ఎం): మారేడు గుండ చెరువు మరమ్మతు పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మండలంలోని మారేడుగొండ చెరువు మరమ్మతు పనులకు రూ.2.86 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేయగా.. ఆదివారం మంత్రి సీతక్క శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం అకాల వర్షాలతో మారేడుగొండ చెరువు కట్ట పూర్తిగా తెగి ప్రాణనష్టంతో పాటు పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ పాల్గొన్నారు. -
పారదర్శకంగా సంక్షేమ పథకాల సర్వే
రేగొండ: ఈ నెల 26నుంచి అమలుచేయనున్న నాలుగు సంక్షేమ పథకాల సర్వేను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. రేగొండ మండలంలోని లింగాల, కొత్తపల్లిగోరి మండలంలోని జగ్గయ్యపేట గ్రామాలలో జరుగుతున్న ఫీల్డ్ సర్వేను ఆదివారం ఆయన పరిశీలించారు. కొత్త రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. జాబితాలో పేర్లు లేని లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. పేర్లులేని లబ్ధిదారులు గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాధ్, తహసీల్దార్ శ్వేత, పంచాయతీ కార్యదర్శులు వేణుగోపాల్, రాము, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ -
మా పేరు లేదు..!
రేషన్‌కార్డు దరఖాస్తుల సర్వే జాబితాలో పేర్లు గల్లంతు ● కుల గణన సర్వే, ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చినా జాబితాలో లేని వైనం ● ఆందోళన చెందుతున్న పేద కుటుంబాలు ● మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చంటున్న అధికారులు భూపాలపల్లి/రేగొండ: రేషన్‌కార్డుల సర్వే జాబితాలో వేలాది కుటుంబాల పేర్లు గల్లంతయ్యాయి. కుల గణన సర్వే, ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చినా జాబితాలో పేర్లు రాకపోవడంతో అర్హులైన పేదలు ఆందోళన చెందుతున్నారు. పదేళ్లుగా కార్డుల కోసం వేచి చూసినా.. మళ్లీ నిరాశ ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాబితాలో 8,191 కుటుంబాలే.. జిల్లాలోని 12 మండలాల్లో తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు సుమారు 1,23,659 ఉన్నాయి. గడిచిన పదేళ్లుగా కొత్త కార్డులను మంజూరు చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పర్యాయాలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించగా సుమారు 22వేలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుత ప్రభుత్వం 2024 ఫిబ్రవరి నెలలో ప్రజాపాలనలో భాగంగా రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించింది. మళ్లీ ఇటీవల కుల గణన సర్వే చేపట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆన్లైన్లో స్వీకరించిన దరఖాస్తులు, ప్రజాపాలనలో స్వీకరించిన వాటిని పరిగణలోకి తీసుకోకుండా కుల గణన సర్వేలో వెల్లడించిన వివరాల ఆధారంగానే రేషన్‌కార్డు లేని కుటుంబాల జాబితాను తయారు చేశారు. ఈ మేరకు జిల్లాలో 8,191 కుటుంబాలను గుర్తించి సర్వే చేపడుతున్నారు. ఆందోళనలో అర్హులు.. వివాహాలు చేసుకొని తల్లితండ్రుల నుంచి విడిపోయిన వారు, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన కుటుంబాలు జిల్లాలో సుమారు 22వేలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా పలుసార్లు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు సమర్పించారు. ప్రస్తుత సర్వే జాబితాలో సగానికి పైగా కుటుంబాల పేర్లు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పదేళ్లుగా రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్నామని, మళ్లీ నిరాశే ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో జాబితాలో పేర్లు లేని వారు పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కూలీ పని చేసుకొని బతికే తమ పేర్లు జాబితాలో ఎందుకు రాలేదని సర్వేకు వచ్చిన అధికారులను నిలదీస్తున్నారు. ఇదిలా ఉండగా జాబితాలో విశ్రాంత ఉద్యోగులు, బడా వ్యాపారుల కుటుంబాల పేర్లు ఉండటం గమనార్హం.సర్వే జాబితాలో ఉన్న దరఖాస్తుదారుల సంఖ్యమండలం కుటుంబాల సంఖ్య మహాముత్తారం 583 మల్హర్ 556 మహదేవపూర్ 728 పలిమెల 315 కాటారం 803 టేకుమట్ల 485 కొత్తపల్లిగోరి 406 చిట్యాల 676 రేగొండ 687 గణపురం 691 మొగుళ్లపల్లి 577 భూపాలపల్లి రూరల్ 804 భూపాలపల్లి మున్సిపాలిటీ 880 మొత్తం 8191 -
త్వరితగతిన పనులు పూర్తిచేయాలి
పలిమెల: మండలంలోని పలు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ ఎల్.విజయలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ భవన స్థలం, పీహెచ్సీ భవనం, జీపీ, అంగన్వాడీ భవన నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నూతన భవనాలను త్వరితగతిన పూర్తిచేయించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సర్వాయిపేట గ్రామాన్ని సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ సాయిలు, ఏఈ రవీందర్, ఎంపీఓ ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు. -
ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష
భూపాలపల్లి అర్బన్/కాటారం: జిల్లాలోని రెండు పరీక్ష కేంద్రాల్లో శనివారం నిర్వహించిన జవహర్ నవోదయ విద్యాలయాల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కాటారం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. భూపాలపల్లి పరీక్షా కేంద్రంలో 240 మంది విద్యార్థులకు గాను 167 మంది, కాటారం పరీక్షా కేంద్రంలో 115మంది విద్యార్థులకు గాను 92మంది హాజరైనట్లు తెలిపారు. డీఈఓ వెంట పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్లు ఉమారాణి, లక్ష్మీప్రసన్న, సీఎల్ఓలు షకీల్ అహ్మద్, రమేశ్, కృష్ణమోహన్ పాల్గొన్నారు. -
సీఈఆర్ క్లబ్ పునఃపారంభం
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని సీఈఆర్ క్లబ్‌ను పున:ప్రారఃభించారు. ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి క్లబ్‌కు మరమ్మతులు చేయించి శనివారం ప్రారంభించా రు. రెండు సంవత్సరాలుగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఈవీఎంల భద్రత కోసం క్లబ్‌ను ఉపయోగించారు. జిమ్ పరికరాలు విని యోగంలోకి తీసుకువచ్చినట్లు జీఎం తెలి పారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, మారుతి, వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. ఐఎన్టీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీగా సమ్మిరెడ్డి భూపాలపల్లి అర్బన్: కోల్ మైన్ లేబర్ యూనియన్(ఐఎన్టీయూసీ) డిప్యూటీ జనరల్ సెక్రెటరీగా ఏరియాకు చెందిన రత్నం సమ్మిరెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీ నియామకం చేపట్టగా శనివారం యూనియన్ ప్రధాన కార్యదర్శి, మినిమం వేజేస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ జనక్‌ప్రసాద్ నియామక పత్రం అందజేశారు. సివిల్ సర్వీస్ ఉద్యోగులకు క్రీడాపోటీలు భూపాలపల్లి అర్బన్: అఖిల భారత సివిల్ సర్వీస్ ఉద్యోగులు ఈ నెల 23, 24 తేదీల్లో హైదరాబాద్‌లో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ ఇన్చార్జ్ అధికారి రఘు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రీడా పోటీల్లో పాల్గొనే సివిల్ సర్వీస్ ఉద్యోగులు ఈ నెల 20వ తేదీలోపు డీవైఎస్ఓ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. కళాజాతా భూపాలపల్లి అర్బన్: గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాలలో వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించేందుకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కళాజాత ప్రదర్శనలు ప్రారంభించినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. క్షయ, కుష్ఠు నివారణ, మాతా శిశు సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాలు, క్రిమి కీటకాల ద్వారా సంక్రమించే వ్యాధులు, రక్తహీనత, హెచ్ఐవీ, ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు, వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు పట్ల కళాజాత ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో అంబట్పల్లి, ఆజాంనగర్, మహాముత్తారం పీహెచ్‌సీల పరిధిలోని 30 గ్రామపంచాయతీలలో కళాజాత కార్యక్రమాలు ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సౌత్ జోన్ డైరెక్టర్‌గా శ్రీధర్ భూపాలపల్లి అర్బన్: టెన్నిస్ క్రికెట్ అసోసియేషన్ సౌత్ జోన్ డైరెక్టర్‌గా మండలంలోని గొర్లవీడు గ్రామానికి చెందిన మామిడి శ్రీధర్‌ను నియమించినట్లు ప్రధాన కార్యదర్శి ఆశిష్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీ10 టెన్నిస్ క్రికెట్ అసోసియేషన్‌లో డైరెక్టర్‌గా నియమించడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేసి భవిష్యత్‌తో మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని కోరారు. హేమాచలక్షేత్రంలో భక్తుల కోలాహలంమంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం భక్తజనంతో శనివారం కిటకిటలాడింది. వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణంతో పాటు చింతామణి జలపాతం, వనదేవత(దైతఅమ్మవారి) ప్రాంతమంతా సందడిగా మారింది. ఆయా ప్రాంతాల నుంచి కార్లు, ఆటోలు, వివిధ ప్రైవేట్ బస్సులు తదితర వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి హేమాచల కొండపై ఉన్న ఆలయానికి చేరుకున్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న భక్తులు లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు పూలు, పండ్లు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు రాజశేఖర్‌శర్మ కారంపుడి పవన్‌కుమార్ ఆచార్యులు, ఈశ్వర రామానుజదాస్ స్వామివారికి నువ్వుల నూనెతో తిల తైలాభిషేకం, ప్రత్యేక అర్చనలు జరిపించారు. -
కాల్వపల్లి కన్నీరు
● ఎన్కౌంటర్లో కన్నుమూసిన మావోయిస్టు అగ్రనేత ● రెండు రాష్ట్రాల్లో ఆయనపై రూ.50 లక్షల రివార్డు ● ఇటీవల దామోదర్ తల్లిని కలిసిన ఎస్పీ ● లొంగిపోవాలని వేడుకున్న తల్లి ● ఇంతలోనే మృతి చెందినట్లు మావోల ప్రకటనకాల్వపల్లిలో ముగిసిన మావోయిస్టు కుటుంబాల ప్రస్థానం ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్టుల కంచుకోటగా పేరుగాంచిన కాల్వపల్లిలో చివరి ఉద్యమ నాయకుడిగా ఉన్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందడంతో కాల్వపల్లిలో మావోయిస్టు కుటుంబాల ప్రస్థానం ముగిసినట్లయింది. 1980 దశకం నుంచి ఉద్యమానికి ఊపిరిగా కాల్వపల్లి నిలిచింది. కాగా.. ఎల్జీఏ, పీఎల్జీఏ, పీపుల్స్‌వార్, మావోయిస్టు పార్టీల్లో కింది స్థాయి నుంచి ఒడిశా, ఛతీ్త్సగఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో డివిజనల్ కమిటీ సభ్యులుగా కొనసాగిన బడె నాగేశ్వర్రావు అలియాస్ ప్రభాకర్, బడె మురళి అలియాస్ పున్నంచందర్, సిద్ధబోయిన భారతక్క అలియాస్ సారక్క, సిద్ధబోయిన అశోక్ అలియాస్ శ్రీధర్ గతంలోనే మృతి చెందారు. దీంతో కాల్వపల్లిలో మావోయిస్టుల ప్రస్థానం ముగిసినట్లయింది.ములుగు/ఎస్‌ఎస్‌తాడ్వాయి: సీపీఐ(మావోయిస్టు) పార్టీ ఉద్యమ చరిత్రలో బడే దామోదర్ అలియాస్ చొక్కారావుది ఓ మరపురాని అధ్యాయం. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని పూజారి కాంకేర్ నక్సల్స్ క్యాంపుపై గురువారం, శుక్రవారం రెండు రోజులపాటు భద్రతా దళాలు జరిపిన మెరుపు దాడి విషయం తెలిసిందే. ఈఘటనలో ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన మావోయిస్టు కీలకనేత, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు మృతి చెందినట్లు శనివారం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) ఒక ప్రకటనలో పేర్కొంది. ఆయన మరణ వార్త సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో కాల్వపల్లి ఉలిక్కిపడింది. బంధువులు, గ్రామస్తులు స్నేహితులు ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కాల్వపల్లిలోని మావోయిస్టుల అమరవీరుల స్తూపం ఇటీవల దామోదర్ తల్లిని కలిసిన ఎస్పీ డిసెంబర్ 27న ఎస్పీ డాక్టర్ శబరీశ్, ఇన్చార్జ్ ఓఎస్డీ, ములుగు డీఎస్పీ రవీందర్.. కాల్వపల్లిలో దామోదర్ తల్లి బతుకమ్మను కలిశారు. దామోదర్ లొంగిపోతే ప్రభుత్వం తరఫున పునరావాసం కల్పించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ‘ఇంటికి రా కొడుకా’ అని బతుకమ్మ కంటనీరు పెట్టుకుంటూ వేడుకుంది. ఇంతలోనే దామోదర్ మృతి చెందినట్లు వార్త విన్న బతుకమ్మ కన్నీరుమున్నీరుగా విలపించింది. -
సింగరేణి కళాకారులకు జీఎం సన్మానం
భూపాలపల్లి అర్బన్: ఇటీవల పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఈసీఐఎల్ కంపెనీలో జరిగిన కోలిండియా స్థాయి సాంస్కృతిక పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన కళాకారులను ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి, అధికారులు శనివారం ఘనంగా సన్మానించారు. కూచిపూడి నృత్యంలో ఆడిచెర్ల శ్రీనివాస్ ప్రథమ స్థానంలో గోల్డ్ మెడల్, భారతీయ జానపద గ్రూప్ డ్యాన్స్‌లో శ్రీనివాస్, ఎం.కేశవులు, యు.సురేష్, జి.రవి, బి.రాజ్‌కుమార్, జె.నరేష్, ఆర్.విజయ్‌కుమార్ తృతీయ స్థానంలో కాంస్య పతకాలు కై వసం చేసుకున్నారు. జీఎం కార్యాలయంలో ఏరియా అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో కలిసి సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, జ్యోతి, వెంకటరామిరెడ్డి, మారుతి, భిక్షమయ్య, కార్మిక సంఘాల నాయకులు రాజ్‌కుమార్, మధుకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఇంటికో డప్పుతో కదలాలి
భూపాలపల్లి రూరల్: ఎస్సీ వర్గీకరణ కోసం ప్రపంచానికి తెలిపే విధంగా వేల గొంతులు, లక్షల డప్పులతో ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్‌లో చేస్తున్న మహాసభకు రాష్ట్రంలోని మాదిగలు ప్రతి ఇంటి నుంచి డప్పుతో కదలిరావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ అంబాల చంద్రమౌళి అధ్యక్షతన శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ ఎస్సీల్లో 59 కులాల్లో 58 కులాలు వర్గీకరణకు అనుకూలంగా ఉంటే మాలకులం మాత్రం వర్గీకరణను అడ్డుకుంటుందని ఆరోపించారు. వర్గీకరణకు అనుకూలంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం కోర్టుకు లేఖ ఇచ్చిందని, దీంతో కోర్టు కూడా వర్గీకరణకు అనుకూలంగా 2024ఆగస్టు 1న తీర్చు ఇచ్చిన విషయం తెలిసిందేనన్నారు. వర్గీకరణ విషయంలో పార్టీలోని మాల నాయకుల ఒత్తిడితో కాంగ్రెస్ వెనుకడుగు వేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీలోని మాల నాయకులు పలుకుబడి, డబ్బుతో వర్గీకరణను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ సారి వర్గీకరణ జరగపోతే మళ్లీ అవకాశం లేదన్నారు. కాబట్టి జిల్లాలోని ప్రతిఒక్కరు సభకు హాజరుకావాలని కోరారు. ఈ సదస్సులో మాజీ ఎమ్మెల్యే లింగయ్య, నాయకులు నోముల శ్రీనివాస్, గాజుల భిక్షపతి, బొల్లిబాబు, దోర్నాల సారయ్య, భద్రయ్య, చంటి తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణ ఇప్పుడు కాకపోతే మరోసారి గెలవలేం సన్నాహక సదస్సులో మంద కృష్ణమాదిగ -
పకడ్బందీగా సర్వే నిర్వహించాలి
భూపాలపల్లి అర్బన్: అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా పకడ్బందీగా సర్వే నిర్వహించాలని జిల్లా ప్రత్యేకాధికారి వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి, భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని సుభాష్ కాలనీలో జరుగుతున్న రైతు భరోసా, ఆహార భద్రతా కార్డుల విచారణ ప్రక్రియను శనివారం ఆయన తనిఖీ చేశారు. నమోదు చేస్తున్న వివరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా చేస్తున్న ఈ సర్వేలో అర్హులైన ఏ ఒక్కరు తప్పిపోకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చాలని సూచించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న విచారణ ప్రక్రియను ఈ నెల 20వ తేదీ వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. పొరపాటుకు తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సాగుకు యోగ్యమైన భూములను సర్వేనంబర్ల వారీగా వ్యవసాయ, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా నిర్ధారించడం జరుగుతుందని, ఆహార భద్రతా కార్డులకు అర్హత కలిగిన కుటుంబాలకు అందించేందుకు వీలుగా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విచారణ బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నాయని తెలిపారు. ఈ నెల 26వ తేదీన ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలుకు శ్రీకారం చుట్టి లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చనుందని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, డీఎస్ఓ శ్రీనాద్, భూపాలపల్లి, గణపురం తహసీల్దార్లు శ్రీనివాసులు, సత్యనారాయణస్వామి పాల్గొన్నారు. పారదర్శకంగా సర్వే కాటారం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న నాలుగు పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం చేపడుతున్న సర్వే పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. కాటారం మండలం అంకుషాపూర్, బయ్యారం గ్రామపంచాయతీల్లో కొనసాగుతున్న సర్వేను అదనపు కలెక్టర్ శనివారం పరిశీలించారు. అదనపు కలెక్టర్ వెంట ఎంపీడీఓ బాబు, ఎంపీఓ వీరస్వామి, ఏఈఓ దివ్యజ్యోతి, సర్వే టీం సభ్యులు ఉన్నారు. సర్వే పరిశీలన మల్హర్: మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో కొనసాగుతున్న సర్వేను శనివారం అదనపు కలెక్టర్ అశోకుమార్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీఎస్ఓ శ్రీనాథ్, తహసీల్దార్ రవికుమార్ ఏఓ శ్రీజ, తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రత్యేకాధికారి వినయ్‌కృష్ణారెడ్డి -
‘మోడల్’ బస్టాండ్
వంతెనలతో బస్టాండ్‌కు కళ.. మహారాష్ట్ర ప్రభుత్వం 2016లో కాళేశ్వరం వద్ద అంతర్రాష్ట్ర వంతెనను రూ.250కోట్ల వ్యయంతో నిర్మించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం భూపాలపట్నం వద్ద రూ.140కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణంతో ఆ రెండు రాష్ట్రాలతో పాటు ప్రాణహితపై మరో వంతెనను మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేయడంతో మూడు రాష్ట్రాల నుంచి భారీ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులు కాళేశ్వరం వస్తున్నాయి. ప్రతి నిత్యం వేలమంది భక్తులు పలు రాష్ట్రాలకు తరలివెళుతుంటారు. ● ‘కాళేశ్వరం’ ఆధునికీకరణకు రూ.3.95 కోట్ల నిధులు మంజూరు ● మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక శ్రద్ధ ● సరస్వతీ పుష్కరాల వరకు అందుబాటులోకి.. ● హర్షం వ్యక్తంచేస్తున్న భక్తులు, గ్రామస్తులుకాళేశ్వరం: కాళేశ్వరం బస్టాండ్‌ను భక్తులు, సందర్శకులు, ప్రయాణికులు, ప్రజలను ఆకర్షించే విధంగా ఆధునికీకరించనున్నారు. రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ శనివారం పలు ఆర్టీసీ బస్సు డిపోలకు, బస్టాండ్లకు నిధులు మంజూరు చేస్తూ ఉత్వర్వులు ఇచ్చారు. కాళేశ్వరం బస్టాండ్ ఆధునీకరణకు రూ.3.95 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. దీంతో తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు కూడలి ప్రాంతమైన కాళేశ్వరం పుణ్యక్షేత్రం బస్టాండ్‌కు మంచిరోజులు రానున్నాయి. జీర్ణోద్ధరణ సమయంలో.. 1978నుంచి 1982 వరకు పురాతన ఆలయాన్ని అప్పటి రోడ్డు రవాణాశాఖ మంత్రి జువ్వాడి చొక్కారావు ఆధ్వర్యంలో మహదేవపూర్ టు కాళేశ్వరం వరకు మట్టి రోడ్డు నిర్మాణం చేశారు. అప్పుడే కాళేశ్వరంలో రేకులతో బస్టాండ్ నిర్మాణం చేశారు. అప్పటి నుంచి బస్టాండ్‌కు వచ్చి రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు తరలివెళ్తున్నారు. అదే సమయంలో ఆలయాలన్నీ జీర్ణోద్ధరణ జరిగి బాహ్యప్రపంచానికి కాళేశ్వరం గురించి తెలిసింది. సరస్వతీ పుష్కరాలకు అందుబాటులోకి.. మే 15నుంచి 26వరకు 12రోజుల పాటు మూడు రాష్ట్రాల ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలకు ఆర్టీసీ సేవలందించడానికి మోడల్‌గా తీర్చిదిద్దనుంది. మోడల్‌గా మారడంతో దీనికోసం ముందస్తుగానే నిధులు మంజూరు చేయడంపై పలువురు భక్తులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మోడల్ బస్టాండ్ సేవలను సరస్వతీ పుష్కరాల వరకు అందుబాటులోకి తీసుకువరావడానికి అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలిసింది.చంద్రాపూర్ మోడల్‌గా ఆధునికీకరిస్తాం.. బస్టాండ్ ఆధునికీకరణకు నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఉన్న బస్టాండ్‌ను మోడల్‌గా మార్చనున్నాం. చంద్రాపూర్ బస్టాండ్ మోడల్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాలతో పరిశీలిస్తున్నాం. ఇంకా పైనల్ కాలేదు. తాత్కాలికంగా సరస్వతీ పుష్కరాలకు భారీగా వచ్చే బస్సుల కోసం హనుమాన్ ఆలయం వద్ద స్థలం ఏర్పాటు చేస్తున్నాం. – ఇందు, డిపో మేనేజర్, భూపాలపల్లికాళేశ్వరం బస్టాండ్ -
సర్వేలో వేగం పెంచాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక సర్వేలో మరింత వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడానికి క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న సర్వేపై శనివారం రెవెన్యూ, పంచాయతీ రాజ్, మండల ప్రత్యేక అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వేలో తప్పులు లేకుండా బాధ్యతగా, పారదర్శకంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రతి లబ్ధిదారుడి వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, అవసరమైన డేటాను సక్రమంగా నమోదు చేయాన్నారు. టీములు ప్రజలతో నేరుగా మమేకమై సమగ్ర సమాచారం సేకరించాలని, ప్రజలకు ప్రభుత్వ పథకాలు లబ్ది చేకూరేలా చూడటమే కర్తవ్యమని కలెక్టర్ సూచించారు. రైతు భరోసా పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ యోగ్యమైన భూములకు ఆర్థిక సహాయం అందించేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. వ్యవసాయానికి పనికిరాని భూముల వివరాలను నమోదు చేయాలన్నారు. సర్వే 20వ తేదీ వరకు పూర్తి చేయాల్సి ఉందన్నారు. రానున్న రెండు రోజులు మండల ప్రత్యేక అధికారులు సర్వేపై మరింత ఫోకస్ చేయాలని వెల్లడించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, భూపాలపల్లి ఆర్డీఓ రవి, మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. వేగవంతంగా చేస్తున్నాం రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం జిల్లాలో చేపడుతున్న సర్వేను వేగవంతం చేశామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు అవసరమైతే మళ్లీ దరఖాస్తులు స్వీకరించి పరిశీలన చేస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి శనివారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ పథకాలపై రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ శాంతికుమారిలతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అర్హులుగా ఉన్న ప్రతీ ఒక్కరికి రేషన్ కార్డు అందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. మంత్రి పలు సూచనలు, సలహాలు అందించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రస్తుతం వెల్లడించిన జాబితా పర్మనెంట్ కాదని, అర్హుల పేర్లు లేకుంటే ప్రభుత్వం సూచించిన మేరకు మళ్లీ దరఖాస్తులు స్వీకరించి పరిశీలిస్తామని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ఐడీఓసీ కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, పౌర సరఫరాల అధికారి శ్రీనాధ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సిద్ధాంతానికి కట్టుబడి మూడు దశాబ్దాలు
కాల్వపల్లి గ్రామానికి బడే ఎల్లయ్య, బతుకమ్మ కుమారుడు బడే దామోదర్ అలియాస్ చొక్కారావు. ఏటూరునాగారం ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి పూర్తి చేశాడు. గోవిందరావుపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో మావోయిస్టు భావా జాలానికి ఆకర్షితుడయ్యాడు. 1977లో బడే నాగేశ్వర్రావు అలియాస్ ప్రభాకర్ స్ఫూర్తితో కొత్తగూడెం లోకల్ గెరిల్లా స్క్వాడ్ (ఎల్జీఎస్) కమిటీలో చేరాడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమిటీ దళ కమాండర్‌గా ఎదిగాడు. అనంతరం తెలంగాణ రాష్ట్ర పోలీసులకు కొరకరాని కొయ్యగా మారాడు. ఆయన ఆధ్వర్యంలో ఎంతో మంది పార్టీలో చేరగా.. మోస్ట్‌వాంటెడ్ లిస్టులో తెలంగాణ ప్రభుత్వం రూ.20, లక్షలు, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.30 లక్షల రివార్డులు ప్రకటించాయి. సుమారు మూడు దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన మృతి చెందాడన్న వార్త కలకలం రేపింది.