శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోu
కాళేశ్వరం: జిల్లా అడవుల్లో ఉచ్చులతో వేటగాళ్ల అడవి జంతువుల వేట మళ్లీ ప్రారంభమైంది. భూపాలపల్లి, మహదేవపూర్, పలిమెల, టేకుమట్ల, మహాముత్తారం, మల్హర్ అటవీప్రాంతాల్లో ఎక్కువగా వేట జరుగుతుందని సమాచారం. దీనికి తోడు కొన్ని రోజులుగా కాటారం సబ్‌డివిజన్ పరిధి మహదేవపూర్, కాటారం, పలిమెల మండలాల్లో పెద్దపులి సంచారం పెరిగింది. దీంతో వేటగాళ్లు అమర్చిన ఉచ్చులకు పెద్దపులి చిక్కితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
జిల్లా అడవిలో ఉచ్చులు
● నిర్వీర్యం చేయని అధికారులు
● కాటారం సబ్‌డిజన్‌లో పాగా వేసిన పెద్దపులి
● పట్టించుకోని అటవీశాఖ అధికారులు
మాంసానికి డిమాండ్
కాటారం సబ్‌డివిజన్ అడవుల్లో వేటాడిన దుప్పులు, కుందేలు, అడవి పందులు, ఏదు, కొండగొర్లు, అడవిపక్షులను ఉచ్చులు, కత్తులతో హతమార్చి మాంసాన్ని పట్టణాలకు, తమ బంధువులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెట్‌లో అడవి మాంసం విలువ కిలోకు రూ.600లకు పైగా పలుకుతుండడంతో కొనుగోలు చేసేందుకు మాంసం ప్రియులు ఇష్టపడుతున్నారు. వరంగల్, హనుమకొండ, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు నిత్యం ఆర్టీసీతో పాటు ఇతర ప్రైవేట్ వాహనాల్లో తరలిపోతున్నట్లు సమాచారం.
ఉచ్చులతో బలి..
అడవుల్లో వేట షరా మామూలుగానే జరుగుతుంది. నిత్యం వేటగాళ్లు వేట కోసం విద్యుత్ తీగలకు ఉచ్చులు తయారు చేసి వేస్తున్నారు. దానికి మూగజీవాలతో పాటు జిల్లాలో మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. గతేడాది 2023 నవంబర్‌లో కాటారం–మహదేవపూర్ అటవీప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న యువ పోలీసు కానిస్టేబుల్ విద్యుత్ ఉచ్చుకు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఫిబ్రవరిలో మల్హర్ మండలం శాత్రాజ్‌పల్లి వద్ద వేటగాళ్ల ఉచ్చులు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వారంలో కుదురుపల్లి వాగు, మహదేవపూర్ అయ్యప్ప ఆలయం సమీపంలో ఉచ్చులను స్థానికులు గుర్తించారు. నిత్యం అడవి జీవరాశుల కోసం వేటగాళ్లు రాత్రులంతా గస్తీ నిర్వహిస్తూ యథేచ్ఛగా వేటాడుతున్నారు. మండల కేంద్రాలకు కూతవేటు దూరంలో ఉచ్చులు అమర్చి వన్యప్రాణుల ప్రాణాలు తీస్తున్నారు. అధికారులు ఉచ్చులను నిర్వీర్యం చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025
శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment