సవాళ్లను అధిగమిస్తేనే సాధికారత
భూపాలపల్లి: ఆధునిక సమాజంలో మహిళలు సాధికారత సాధించాలంటే సవాళ్లను సమర్థవంతంగా అధిగమించాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. నేడు(శనివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో రాణించిన మహిళా పోలీసులు, భరోసా, సఖి సిబ్బందిని ఎస్పీ సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళల్లో సంకల్ప శక్తి ఎక్కువగా ఉందని, వారు ఏదైనా సాధించగలరని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని పేర్కొన్నారు. మహిళలకు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ సమాన హక్కులు ఉన్నాయని, మహిళా అధికారులందరూ తమ పూర్తి శక్తితో పని చేయాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లో రిసెప్షన్ విధులు, కోర్టు డ్యూటీ ఆఫీసర్, రైటర్ వంటి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, ఏఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్, డీపీఓ ఫర్హాన తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ కిరణ్ ఖరే
Comments
Please login to add a commentAdd a comment