పులికాదు.. అడవి పిల్లి
రేగొండ: కొత్తపల్లిగోరి మండల కేంద్రంలోని శివార్లలోని పంట పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు వదంతులు వచ్చాయని, అది అడవి పిల్లి (వైల్డ్ క్యాట్) అని చెల్పూర్ ఇన్‌చార్జ్ రేంజ్ అధికారి నరేష్ తెలిపారు. కొత్తపల్లిగోరి శివారు పంచరాయిలో ఉన్న పంట పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు బుధవారం సాయంత్రం సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. దీంతో అటవీ అధికారులు గురువారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. పంట పొలాలు, బొక్కి చెరువు సమీపంలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ప్రాంతంలో లభించిన పాదముద్రలను పరిశీలించిన అధికారులు ఆ పాదముద్రలు అడవి పిల్లివని నిర్ధారించారు. వన్యప్రాణులు కనబడితే తమ దృష్టికి తీసుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎఫ్‌ఆర్‌ఓ శంకర్, ఎఫ్‌ఎస్‌ఓ గౌతమి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment