భూపాలపల్లి: భూపాలపల్లి పట్టణానికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కొత్త హరిబాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కోర్టుకు వెళ్లిన భూపాలపల్లి పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి ఫిబ్రవరి 19న రాత్రి తన ఇంటికి వెళ్తున్న క్రమంలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 23న పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చూపించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 1వ తేదీన ఏ9గా ఉన్న పుల్ల నరేష్‌ను సైతం అదుపులోకి తీసుకొని అరెస్ట్ చూపించారు. ఏ8గా ఉన్న భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్‌చైర్మెన్, బీఆర్‌ఎస్ నాయకుడు కొత్త హరిబాబు, ఏ10గా ఉన్న పుల్ల సురేష్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న హరిబాబు ఇటీవల హైకోర్టును ఆశ్రయించి, ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నట్లు సమాచారం. బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 10న వాదనలు జరుగనున్నట్లు తెలిసింది.
ముందస్తు బెయిల్ కోసం
పిటిషన్ దాఖలు
రాజలింగమూర్తి హత్య కేసులో
ఏ8గా కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment