విద్యా సామర్థ్యాలను పెంపొందించాలి
చిట్యాల: పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు విద్యా సామర్థ్యాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర విద్యా పరిశీలకులు (ఎస్సీఈఆర్టీ) రాంబాబు అన్నారు. మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలను మంగళవారం పర్యవేక్షించారు. అనంతరం రిజిస్టర్లను పరిశీలించారు. వి ద్యార్థులను గ్రూపులుగా విభజించి వారి విద్యా సా మర్థ్యాలను పెంపొందించే కోసం పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మాని టరింగ్ అధికారి కె.లక్ష్మన్, ఎంఈఓ కొడెపాక రఘుపతి, ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీరాం రఘుపతి, ఉపాధ్యాయులు బొమ్మ రాజమౌళి, బుర్ర సద య్య, రామనారాయణ, ఉస్మాన్ అలీ, శంకర్, శ్రీని వాస్, నీలిమా రెడ్డి, సరళాదేవి, విజయలక్ష్మి, కల్పన, సుజాత, మౌనిక, సీఆర్‌పి రాజు పాల్గొన్నారు.
ప్రణాళికలపై సమీక్ష
గణపురం: పదో తరగతి విద్యార్థుల ప్రగతి, ఫ్రీ పైనల్ ఫలితాలతో పాటు వారి విద్యాభివృద్ధి కోసం ఉపాధ్యాయులు చేపట్టిన ప్రణాళికలపై రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి పరిశోధకులు రాంబాబు సమీక్ష నిర్వహించారు. మండలకేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల/కళాశాలను ఆయన సందర్శించారు. అనంతరం పాఠశాలలోని పలు రికార్డులను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఉప్పలయ్య, పాఠశాల ప్రిన్సిపాల్ తిరుపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎస్సీఈఆర్టీ రాష్ట్ర పరిశీలకులు రాంబాబు