
కాళేశ్వరాలయంలో ‘పంచాంగ శ్రవణం’
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో శ్రీవిఽశ్వావసు నామసంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వేదపండితులు ‘పంచాంగ శ్రవణం’ భక్తులకు చదివి వినిపించారు. ఆదివారం సాయంత్రం ఆలయం అనివెట్టి మండపంలో ఆలయ ప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణమూర్తిశర్మ, ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సుబ్రహ్మణ్యశర్మ, బైకుంఠపాండాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాశులవారీగా ఆదాయ, వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానాలను వివరించారు. అనంతరం ఉగాది పచ్చడి, ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేశారు. స్వామివారి గర్భగుడిలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ ధర్మకర్తలు కామిడి రాంరెడ్డి, శ్యాం సుందర్ దేవుడ, నాయకులు శ్రీనివాసరెడ్డి, మోహన్‌రెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
కవి సమ్మేళనం..
ఉగాది పర్వదినం సందర్భంగా కవులు, రచయితలు కవి సమ్మేళనం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన పలువురు పాల్గొన్నా రు. వారిని దేవదాయశాఖ అధికారులు శాలు వాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. సూపరింటెండెంట్ శ్రీనివాస్, అర్చకులు కృష్ణమూర్తిశర్మ ఉన్నారు. కవులు గడ్డ లక్ష్మయ్య, మా డుగుల భాస్కరశర్మ తదితరులు పాల్గొన్నారు.

కాళేశ్వరాలయంలో ‘పంచాంగ శ్రవణం’

కాళేశ్వరాలయంలో ‘పంచాంగ శ్రవణం’