
హేమాచలక్షేత్రంలో ప్రత్యేక పూజలు
మంగపేట:హేమాచలక్షేత్రంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామికి ఆలయ పూజారులు ముక్కామల రాజశేఖర్‌శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పల్లకీలో ప్రతిష్టించి మంగళవాయిద్యాల నడుమ మల్లూరు గ్రామానికి తీసుకువచ్చారు. భక్తులు దర్శించుకునేందుకు స్వామివారి విశ్రాంతి మండపంపై రాత్రి 8గంటలకు ప్రతిష్టించారు. 9గంటలకు పూజారులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. గ్రామంలోకి పల్లకీపై వచ్చిన ఉత్స వ మూర్తులసేవకు గ్రామస్తులు, భక్తులు ఎదురేగి బిందెలతో నీళ్లుబోసి స్వాగతం పలికారు. అనంతరం దేవాతామూర్తులను పురవీధుల్లో ఊరేగించా రు. ఈ కార్యక్రమంలో ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారాములు, సిబ్బంది శేషు, నూతులకంటి అజయ్, సెగ్గెం పుల్లయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.
వ్యవసాయ అధికారులకు
ఫోన్ నంబర్లు
ములుగు: జిల్లాలోని ఆయా మండలాల వ్యవసాయ అధికారులకు ప్రభుత్వం ప్రత్యేక ఫోన్ నంబర్లు కేటాయించింది. ఇకపై సదరు మండలాల రైతులు అధికారులతో మాట్లాడేందుకు సంబంధిత నంబర్లను సంప్రదించాలని జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ తెలిపారు. రేపటి నుంచి అధికారులు ఆయా నంబర్లలో అందుబాటులో ఉంటారని వివరించారు.