ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు
భూపాలపల్లి అర్బన్: రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదివారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పవిత్రమైన నెలగా త్యాగం, భక్తి, మానవతా విలువల ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఉపవాస దీక్ష, ప్రార్థనలు, దానం వంటి ఆచారాలు సామాజిక సమగ్రతను పెంపొందిస్తాయని తెలిపారు. అందరూ కలిసికట్టుగా సమాజంలో శాంతి, ఐకత్యను చాటాలని పిలుపునిచ్చారు. ఈ పండగను ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.
ధన్వాడలో మంత్రి పూజలు
కాటారం: ఉగాది నేపథ్యంలో తన స్వగ్రామం ధన్వాడలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో మంత్రి శ్రీధర్‌బాబు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ప్రజలు ఆదివారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలకేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు అయ్యప్ప స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఆలయాల్లో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు చీమల సందీప్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, యూత్ అధ్యక్షుడు చిటూరి మహేశ్‌గౌడ్, ఆలయాల పురోహితులు పాల్గొన్నారు.
సమస్యలపై మంత్రికి వినతి
కాటారం: తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆదివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జేపీఎస్‌గా మార్చి రెగ్యూలర్ చేయడంతో పాటు రాష్ట్రంలోని జేపీఎస్‌లుగా ఉన్న వారిని రెగ్యూలర్ పంచాయతీ కార్యదర్శులుగా ప్రమోట్ చేయాలని మంత్రిని కోరారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు సంఘం నాయకులు తెలిపారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సంఘం జిల్లా నాయకులు కరుణాకర్, సృజన్, వేణు ఉన్నారు.
జాతీయ కమిటీ సభ్యుడిగా రాజయ్య
భూపాలపల్లి అర్బన్: ఆలిండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్(ఏఐసీడబ్ల్యూఎఫ్) జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఏరియాకు చెందిన కంపేటి రాజయ్య ఎన్నికయ్యారు. ఈ నెల 28నుంచి 30వ తేదీ వరకు జార్ఘండ్ రాష్ట్రంలోని రాంచీలో జరిగిన జాతీయ మహాసభల్లో రాజయ్యను జాతీయ కమిటీ సభ్యుడిగా ఎన్నుకున్నారు. కమిటీలో అవకాశం దక్కడం పట్ల రాజయ్య సంతోషం వ్యక్తం చేశారు.
రాములోరి కల్యాణానికి రూ.లక్ష విరాళం
రేగొండ: మండలంలోని రూపిరెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలకు గ్రామానికి చెందిన రావుల వనజ అశోక్ దంపతులు రూ.1,11,116 విరాళం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దైవకార్యానికి తనవంతు సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ముడుతనపల్లి శంకర్, కమిటీ సభ్యులు శ్రీనివాస్, రవి, శంకర్, రాజుకుమార్, శ్రీధర్, రఘు పాల్గొన్నారు.
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు


