శుక్రవారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2025
కాళేశ్వరంలోని త్రివేణి సంగమం
సమయం లేదు..
మే 15నుంచి 26 వరకు జరిగే పుష్కరాలకు ముందే పనులు అన్ని పూర్తి చేయాలి. కానీ ఇక్కడ నిధులు విడుదల చేసి నెలలు గడుస్తోంది. పనులకు టెండర్లు పూర్తయి నెల దగ్గరికి వచ్చినా పనులకు సంబంధించిన ప్లానింగ్, డిజైన్స్ కాంట్రాక్టర్లకు ఇప్పటికీ ఇవ్వలేదు. వర్క్ ఆర్డర్స్ కూడా ఇవ్వకపోవడంతో పనులు ప్రారంభించాలా లేదా అనే సందిగ్ధంలో ఉన్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 15నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడంతో నాన్చుతూ వచ్చారు. మార్చి 3న కోడ్ ముగిసినా ఎలాంటి ఆర్డర్స్ ఇంకా ఇవ్వలేదు. పుష్కరాల సమయం సమీపిస్తుండడంతో సమయం లేకపోవడంతో ఇటు అధికారులు అటు కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు.
● పనులకు ఇప్పటికీ ఆర్డర్స్.. డిజైన్స్ ఇవ్వని ఉన్నతాధికారులు
● ఫిబ్రవరి 15న పుష్కరాల పనుల టెండర్లు పూర్తి
● నెలరోజులు కావస్తున్నా ప్రారంభం కాని పనులు
● కాంట్రాక్టర్లు మెటీరియల్ సమకూర్చి ఎదురుచూపు
కాళేఽశ్వరం: జిల్లాలోని మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని గోదావరి, ప్రాణహిత నదులతో కలిసి అంతర్వాహిణిగా ప్రవహిస్తున్న సరస్వతి నదికి ఈ ఏడాది మే 15నుంచి 26 వరకు పుష్కరాలు నిర్వహించడానికి ప్రభుత్వం ఘనంగా సన్నాహాలు చేస్తుంది. 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సరస్వతి పుష్కరాలు జరుగగా.. మళ్లీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా సరస్వతి పుష్కరాలు వస్తుండడంతో ప్రభుత్వం పుష్కరాల అభివృద్ది పనులకు రూ.25కోట్ల నిధులు మంజూరు చేసి నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంకా 62రోజులే మిగిలి ఉండడంతో పాటు సమయం లేకపోవడంతో త్వరగా కలెక్టర్ స్పందించి పనులకు ఆర్డర్స్, డిజైన్స్ అందించేలా చర్యలు తీసుకుని పనులు ప్రారంభించాల్సి ఉంది.
కాళేశ్వరంలో చదును చేసిన జ్ఞాన సరస్వతి ఘాట్
న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment