మల్హర్ : మండలంలోని అడ్వాలపల్లి, దుబ్బపేట, గాదంపల్లి గ్రామాల్లోని గుడుంబా స్థావరాలపై మంగళవారం ఎకై ్సజ్ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా గుడుంబా తయారీ కేంద్రాల్లో నిల్వ ఉన్న 600 లీటర్ల చక్కెర పానకాన్ని అధికారులు ధ్వంసం చేశారు. 40 కేజీల చక్కెర, 12 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు కాటారం ఎకై ్సజ్ ఎస్సై కిష్టయ్య పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గుడుంబా తయారీ అనర్ధాలపై అవగాహన కల్పించారు. గుడుంబా తయారు చేసినా, కలిగి ఉన్న, రవాణా చేసిన, విక్రయించిన చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ రాంచందర్, కానిస్టేబుళ్లు వెంకట రాజు, రామకృష్ణ పాల్గొన్నారు.