పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న సదరు డాన్ మండలాల వారీగా ఉన్న దళారులతో ప్రతీరోజు మాట్లాడుతూ.. ‘అధికారులందరినీ చూసుకుంటున్నా.. మీకేం ఇబ్బంది లేదు. లోకల్ పోలీసులు, నిఘా విభాగం, సివిల్ సప్లయీస్, రెవెన్యూ అధికారులందరికీ నెలవారి మామూళ్లు ఇస్తున్నా..’ అని బాహాటంగానే చెప్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాను చెప్పిన చోటకే బియ్యాన్ని పంపాలని, ఇంకెక్కడ అమ్మకూడదని హుకుం జారీ చేసినట్లు సమాచారం. దళారుల వద్ద కేజీ బియ్యం రూ.26 చొప్పున కొనుగోలు చేస్తున్న సదరు డాన్ సుమారు రూ.30 చొప్పున మిల్లర్లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment