
కార్పొరేట్ సెలూన్లను రద్దుచేయాలి
భూపాలపల్లి రూరల్: జిల్లా కేంద్రంలో ప్రారంభం కాబోతున్న కార్పొరేట్ సెలూన్లను వెంటనే రద్దు చేయాలని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు పందిళ్ల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాస్ రాజశేఖర్, జిల్లా గౌరవాధ్యక్షుడు కురిమిల్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని మంజూరునగర్ ప్రాంతంలో పింక్స్ ఇన్ బ్లూస్ బ్యూటీ పార్లర్ అనే పేరుతో కార్పొరేట్ సెలూన్ అండ్ పార్లర్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని, ఆదివారం పార్లర్‌ముందు నిరసన చేపట్టారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. కార్పొరేట్ సెలూన్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. నిరవధిక నిరాహార దీక్ష చేయడానికై నా సిద్ధమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ముల్కనూర్ బిక్షపతి, జిల్లా కోశాధికారి గిద్దమారి సుధాకర్, మండల అధ్యక్షులు మంతెన భూమయ్య, ప్రధాన కార్యదర్శి గిద్దమరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment