విద్యార్థులతో పనులపై కలెక్టర్‌ సీరియస్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులతో పనులపై కలెక్టర్‌ సీరియస్‌

Published Mon, Mar 3 2025 1:31 AM | Last Updated on Mon, Mar 3 2025 1:27 AM

విద్య

విద్యార్థులతో పనులపై కలెక్టర్‌ సీరియస్‌

ఇద్దరిపై చర్యలు

కాటారం: మండలంలోని గంగారం మోడల్‌ స్కూల్‌లో విద్యార్థులతో పనులు చేయించిన ఘటనపై కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సీరియస్‌ అయ్యారు. ఫిబ్రవరి 28న మోడల్‌ స్కూల్‌లో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యాన్ని పదో తరగతి విద్యార్థులు ఎత్తడం వివాదాస్పదంగా మారింది. మార్చి 1న పలు పత్రికల్లో ప్రచురితం కావడంతో కలెక్టర్‌ దృష్టికి వెళ్లింది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు తహసీల్దార్‌ నాగరాజు విచారణ జరిపి నివేదిక అందజేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ మనోహర్‌ను సస్పెండ్‌ చేయడంతో పాటు ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పాఠశాలలో పనిచేస్తున్న అటెండర్‌ కేక్యానాయక్‌ను విధుల నుంచి తొలగిస్తూ డీఈఓ రాజేందర్‌ ఉత్తర్వులు జారీచేశారు.

ఆర్చరీ జాతీయస్థాయి

పోటీలకు ఎంపిక

కాటారం: మండలకేంద్రానికి చెందిన రామిళ్ల రాజశేఖర్‌ కుమార్తె రామిళ్ల అనయ ఆర్చరీ విభాగంలో రాణిస్తుంది. తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని కొల్లూర్‌ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో ప్రతిభ కనబరిచింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి అనయ మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్‌ మెడల్‌ గెలుచుకుంది. దీంతో నిర్వాహకులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెల 17న గుంటూరులో జరగబోయే జాతీయస్థాయి పోటీల్లో అనయ పాల్గొననుంది. ఈ కార్యక్రమంలో మాస్టర్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు రామారావు, తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజు, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ చైర్మన్‌ పవన్‌ కళ్యాణ్‌ పాల్గొని మెడల్‌ అందజేశారు. జాతీయ స్థాయికి ఎంపికై న అనయను కోచ్‌ శ్రీనివాస్‌, అభిషేక్‌ అభినందించారు.

మాజీ స్పీకర్‌ శ్రీపాదరావుకు నివాళి

భూపాలపల్లి అర్బన్‌: మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహించారు. కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ రాహుల్‌శర్మ హాజరై శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. దుద్దిళ్ల శ్రీపాదరావు ప్రజా సేవకు అంకితమై ప్రజాస్వామ్య పరిపరక్షణకు విశేషంగా కృషి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి రఘు, డీఎల్‌పీఓ వీరభద్రయ్య, గృహ నిర్మాణ శాఖ అధికారి రాయలింగు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో

తీవ్ర గాయాలు

కాటారం: కాటారం–మంథని ప్రధాన రహదారిపై కాటారం శివారులో జరిగిన రహదారి ప్రమాదంలో ఒకరు తీవ్రగాయాల పాలయ్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేగులగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని గోపాలపూర్‌ గ్రామానికి చెందిన ఆకుదారి రమేశ్‌ కాటారం వచ్చి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో కాటారం శివారు పెట్రోల్‌ పంప్‌ సమీపంలోకి రాగానే ద్విచక్ర వాహనాన్ని మళ్లించే క్రమంలో ఎదురుగా వచ్చిన బొగ్గు లారీ ఢీకొని కిందపడి తల, చేతులకు తీవ్రగాయాలై రక్తస్రావమైంది. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్‌లో భూపాలపల్లి ఆస్పత్రికి తరలించారు. రమేశ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
విద్యార్థులతో పనులపై  కలెక్టర్‌ సీరియస్‌
1
1/2

విద్యార్థులతో పనులపై కలెక్టర్‌ సీరియస్‌

విద్యార్థులతో పనులపై  కలెక్టర్‌ సీరియస్‌
2
2/2

విద్యార్థులతో పనులపై కలెక్టర్‌ సీరియస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement