ఆలిండియా పోటీలకు ఎంపిక
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం నాగెపల్లి గ్రామానికి చెందిన గుర్సింగ విజయలక్ష్మి ఆల్‌ఇండియా సివిల్ సర్వీసెస్ ఖోఖో పోటీలకు ఎంపికై ంది. తెలంగాణ తరఫున జట్టులో శుక్రవారం నుంచి ఈనెల 24 వరకు న్యూఢిల్లీలో జింఖాన గ్రౌండ్‌లో జరుగనున్న జాతీయస్థాయి ఖోఖో పోటీలకు తెలంగాణ తరఫున ఎంపికై నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడలో జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ హాకీ క్రీడలో తెలంగాణ తరఫున జట్టులో ఆడినట్లు పేర్కొన్నారు. ఆమె కాటారంలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. ఆమె ఎంపిక కావడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు, క్రీడాకారులు అభినందనలు తెలిపారు.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
రాష్ట్రస్థాయి అధ్లెటిక్స్ పోటీలకు మహదేవపూర్ జెడ్పీహెచ్‌ఎస్ బాలికల, బాలుర పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు పీడీ గుర్సింగ పూర్ణిమ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాలికల విభాగంలో 100 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలో 9వ తరగతి విద్యార్థిని బద్దెల విష్ణుప్రియ, 8వ తరగతి విద్యార్థిని వసంత అనుజ్ఞ, 7వ తరగతి విద్యార్థిని మాడిగ అక్షిత, 6వ తరగతి విద్యార్థిని పెద్ది మధులత, బాలుర విభాగం నుంచి 9వ తరగతి విద్యార్థి సంగం అభిరాంప్రసాద్, 6వ తరగతి విద్యార్థి సుంకరి ప్రద్యున్ ఎంపికయ్యారు. ఈనెల 23న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థులను పాఠశాల హెచ్‌ఎం సరిత, ఉపాధ్యాయులు అభినందించారు.
ఆలిండియా పోటీలకు ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment