డిజిటల్ క్రాప్ సర్వే
పకడ్బందీగా పంటల లెక్క..
జిల్లా వివరాలు..
సర్వే ఇలా..
సర్వే నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందించింది. ఏఈఓలు పంటల సాగు విస్తీర్ణం, పంట రకం అంశాలను అందులో నమోదు చేస్తున్నారు. సర్వే నంబర్ ఎంట్రీ చేయగానే ఆ పరిధిలో ఉన్న రైతుల వివరాలు కనిపిస్తాయి. కావాల్సిన రైతు పేరు ఎంచుకోగానే వారి పేరిట ఉన్న భూమి వివరాలు దర్శనమిస్తాయి. అందులో రైతు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నాడో నమోదు చేయాలి. సాగు ఫొటోను అప్‌లోడ్ చేయాలి. ఒక వేళ సాగులో లేని భూమి ఉంటే వాటిని నాన్‌క్రాప్ కింద నమోదు చేయాల్సి ఉంటుంది.
● క్షేత్రస్థాయిలో వివరాలు నమోదుచేస్తున్న ఏఈఓలు
● పంటకాలం వరకు గడువు
● నివేదిక ఆధారంగా పంట దిగుబడి కొనుగోళ్లు
మండలాలు
12
డిజిటల్ క్రాప్
సర్వే చేయాల్సిన భూమి
88,000
ఎకరాలు
వ్యవసాయ శాఖ సబ్ డివిజన్లు – 2 (భూపాలపల్లి,
మహదేవపూర్)
కాటారం: డిజిటల్ క్రాప్ సర్వేతో పంటల లెక్క ఇక పక్కాగా ఉండనుంది. ప్రతి వ్యవసాయ క్లస్టర్ పరిధిలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోంది, ఏఈఓలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ సర్వే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఆయా పంటల సాగు వివరాలు పక్కాగా తేలనున్నాయి. వీటి ఆధారంగా రైతుల పంట దిగుబడులను ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. పంటకాలం పూర్తయ్యే వరకు సర్వే ముగించాల్సి ఉంటుంది.
సర్వే
పూర్తయింది 33,000
ఎకరాలు
వ్యవసాయశాఖ క్లస్టర్లు
45
రైతులు
1,33,412
ఏఈఓలు
45 మంది
జిల్లాలో
సాగు భూమి 2,43,112
ఎకరాలు
ప్రతి సర్వే నంబర్‌కు వెళ్లాల్సిందే..
వ్యవసాయ శాఖ సమకూర్చిన ట్యాబ్స్‌తో ఏఈఓలు సర్వే చేస్తున్నారు. తమ వద్ద ఉన్న ట్యాబ్‌లలో యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఈ యాప్‌లోనే క్లస్టర్ పరిధిలోని ఏయే సర్వే నంబర్లలో సర్వే చేయాలనే వివరాలు ఉన్నాయి. ప్రతీ సర్వే నంబర్‌తో పాటు సబ్ సర్వే నంబర్ వద్దకు ఏఈఓలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతీ సర్వే నంబర్‌లో 25 మీటర్లకు మించి దూరం ఉంటే వివరాలు చూపించడం లేదు. దీంతో ఏ ఒక్క సర్వే నంబర్ సమాచారం లేకున్నా అప్‌లోడ్ కాదు. ప్రతీ సర్వే నంబర్ వద్దకు ఏఈఓలు వెళ్తున్నారు.
పలుచోట్ల ఇబ్బందులు..
సర్వేలో భాగంగా ఏఈఓలు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ఓ పక్క పెరుగుతున్నా ఎండలు ముప్పుతిప్పలు పెడుతుంటే కొన్ని చోట్ల ఇంటర్‌నెట్ సౌకర్యం అందుబాటులో లేకపోవడం, యాప్ ఓపెన్ కాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పలు చోట్ల సర్వర్ నెమ్మదించడం, మరికొన్ని చోట్ల రైతుల చేలల్లో లొకేషన్ తప్పుగా చూపించడం, సర్వేనంబర్లు కనిపించకపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు ఏఈఓలు చెబుతున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏఈఓలు క్రాప్ సర్వేను నిర్వహిస్తున్నారు.
పంటల నమోదు ఆధారంగా కొనుగోళ్లు..
సర్వేతో రైతులు సాగుచేసే పంటల వివరాలు పక్కాగా తేలనున్నాయి. తదనుగుణంగా వచ్చే దిగుబడిని రైతులు మార్కెట్‌లో ప్రభుత్వరంగ సంస్థకు మద్దతు ధరతో విక్రయించేందుకు అవకాశం ఉంటుంది. డిజిటల్ క్రాప్ సర్వే రైతులకు ఎంతో మేలు చేకూర్చనుంది. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు బీమా పొందడానికి, పంట నష్టం అంచనా వేయడానికి దోహదపడుతుంది. రైతులు తాము పండించిన పంటలను మార్కెట్‌కు తీసుకువెళ్లి మద్దతు ధర పొందడానికి ఉపయోగపడుతుంది. వానాకాలంలో డిజిటల్ క్రాప్ సర్వే చేయించుకోకపోవడంతో పత్తి అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
రైతులు సహకరించాలి
జిల్లావ్యాప్తంగా డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఏఈఓలు రైతుల చేలు, పంట పొలాల వద్దకు వెళ్లి సాగు వివరాలు అక్కడే నమోదు చేస్తున్నారు. క్రాప్ సర్వే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రైతులు తాము పండించిన పంటలను అమ్ముకోవడానికి, పంటల బీమా, పరిహారం పొందడానికి సహాయపడుతుంది. రైతులు సర్వేకు వచ్చే ఏఈఓలకు సహకరించాలి. – విజయభాస్కర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
●
డిజిటల్ క్రాప్ సర్వే
Comments
Please login to add a commentAdd a comment