సమర్థంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ
భూపాలపల్లి రూరల్: అధికారులు సమన్వయంతో పనిచేసి, రైతులకు ఇబ్బందులు లేకుండా యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో యాసంగి (రబీ) 2024–25 కాలానికి ధాన్యం కొనుగోలు కమిటీ సమావేశం నిర్వహించారు.ఽ ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, పంట కోత, గున్నీలు, పరికరాల లభ్యత టార్పాలిన్లు, కేలిబర్స్, పాడీ క్లీనర్లు సిద్ధంచేయాలని సూచించారు. రవాణా సౌకర్యాల వంటి కీలక అంశాలపై చర్చించారు. రైతులకు గిట్టుబాటు ధర అందించే విధానాలు, పంట కోత అనంతరం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసే చర్యలపై సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాధ్, డీఎం రాములు, డీఆర్‌డీఓ నరేష్, డీసీఓ వాలియా నాయక్, తూనికలు కొలతల అధికారి శ్రీలత వ్యవసాయ, రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్
అశోక్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment