50 నిమిషాల్లోనే..
తూతూమంత్రంగా ప్రజావాణి
● 19 దరఖాస్తుల స్వీకరణ
● గ్రీవెన్స్ అనంతరం మరో 26..
భూపాలపల్లి అర్బన్: సుమారు రెండు నెలల అనంతరం సోమవారం జరిగిన ప్రజావాణిని అధికారులు కేవలం 50 నిమిషాల్లోపే పూర్తిచేశారు. బాధితులు తమ సమస్యలను విన్నవించేందుకు పది గంటలకే కలెక్టరేట్‌కు రాగా అధికారులు మాత్రం నెమ్మదిగా చేరుకున్నారు. 10:30గంటల వరకు నలుగురు అధికారులు మాత్రమే వచ్చారు. 11 గంటల వరకు అధికారులందరూ కార్యాలయానికి చేరుకున్నారు. 11 గంటల నుంచి 11:50 గంటల వరకు ఫిర్యాదులను అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ స్వీకరించారు. అనంతరం ప్రజావాణి ముగించగా జిల్లా అధికారులు వారివారి కార్యాలయాలకు తిరిగి వెళ్లారు. అనంతరం కూడా మరో 25 మంది దరఖాస్తులు రాగా కొన్ని అదనపు కలెక్టర్ స్వీకరించారు. మరికొందరు ఇన్‌వార్డ్‌లో ఫిర్యాదులను అందజేశారు.
ఫిర్యాదుదారుడితో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్
కల్యాణలక్ష్మి రావడం లేదు..
మా అత్తమామలు చంద్రగిరి లక్ష్మి–మల్లయ్య గతేడాది కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేశారు. ఇప్పటివరకు కల్యాణలక్ష్మి డబ్బులు రావడం లేదు. ఇప్పటికి మూడు సార్లు కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో దరకాస్తు పెట్టినం. అయినప్పటికీ డబ్బులు రావడం లేదు.
– బీరెల్లి మణికుమార్, వజినపల్లి, మహాముత్తారం
సర్వే చేశారు.. బోర్లు వేయడం లేదు..
పోలారం గ్రామశివారులో దళిత కుటుంబాలకు చెందిన 20మంది రైతులం దాదాపు 50 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నాం. ఈ భూమిలో పీఎం అజయ్ పథకం ద్వారా 10 బోర్లు వేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాం. ఎస్పీ కార్పొరేషన్, భూగర్భ జలశాఖ వారు సర్వే చేశారు. కానీ బోర్లు మాత్రం వేయడం లేదు. అధికారులు కలెక్టర్ స్పందించి బోర్లు వేయించాలి.
– సల్లూరి శంకర్, పోలారం, మహాముత్తారం
ట్రాక్టర్ ఉందని.. ఇల్లు రాదన్నారు..
గతేడాది ఇందిరమ్మ ఇంటికోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైంది. గతంలో అధికారులు సర్వే చేస్తున్న సమయంలో నాకు ట్రాక్టర్ లేకున్నా.. ఉన్నట్లు నమోదు చేసుకున్నారు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల సర్వేకు వచ్చిన అధికారులు ట్రాక్టర్ ఉంది కాబట్టి ఇళ్లు రాదన్నారు.
– ఆకుదారి నరేందర్, భూపాలపల్లి
ఆస్తులున్నాయని పింఛన్ ఇయ్యట్లే..
2021 సంవత్సరంలో వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. పింఛన్ మంజూరైందని ఏడాది తర్వాత గ్రామకార్యదర్శి ఫోన్‌చేసి చెప్పాడు. ఆ తర్వాత నెల పింఛన్ తీసుకునేందుకు వెళ్తే పేరును తొలగించారు. కారణం అడిగితే నీకు ఆస్తులు ఉన్నాయని అందుకే తొలగించామని చెప్పారు. నాకు ఎలాంటి ఆస్తిపాస్తులూ లేవు.
– సుద్దాల సదవలి, మహబూబ్‌పల్లి, మహాముత్తారం
●
50 నిమిషాల్లోనే..
50 నిమిషాల్లోనే..
50 నిమిషాల్లోనే..
50 నిమిషాల్లోనే..
Comments
Please login to add a commentAdd a comment