ఓసీలో బ్లాస్టింగ్‌లతో ఇళ్లు ధ్వంసం
గణపురం: మండలంలోని ఓసీ–3 ప్రాజెక్టులో నిత్యం పేలుస్తున్న బాంబులతో తమ ఇళ్లు ధ్వంసం కావడంతో పాటు తీవ్రంగా దుమ్ము ధూళి బయటకు వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నామని పరుశరాంపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఓసీ–3 ప్రాజెక్టుకు వెళ్లే ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం నుంచే ఆందోళనకు దిగారు. ఓసీ–3 ఓపెన్ కాస్టు గనిలో రోజు బొగ్గు తవ్వకాలకు ఉపయోగిస్తున్న భారీ బాంబులతో తమ ఇండ్లు పగుళ్లు పట్టడంతో పాటు గని నుంచి పెద్దఎత్తున దుమ్ము ఇండ్లలోకి చేరుకుంటుందని ఆరోపించారు. సింగరేణి అధికారులు వెంటనే తమ గ్రామాన్ని నిర్వాసిత గ్రామంగా ప్రకటించి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పనులు అడ్డుకుంటామని హెచ్చరించారు. గ్రామస్తుల ఆందోళనతో పెద్దఎత్తున గనిలోకి వెళ్లి వచ్చే బొగ్గు లారీలు రోడ్డుపై నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సింగరేణి అధికారులు, పోలీసులు ఆందోళన వద్దకు చేరుకొని గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ తమకు ఖచ్చితమైన హామీ ఇస్తే తప్ప ఆందోళన విరమించమని భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి ఆందోళన వద్దకు వచ్చి తమకు లిఖిత పూర్వకంగా రాసిస్తే సీఎండీ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.
ఆందోళనకు దిగిన
సమీప గ్రామాల ప్రజలు
సీఎండీ దృష్టికి తీసుకెళ్లి
పరిష్కరిస్తానని జీఎం హామీ
Comments
Please login to add a commentAdd a comment