భూ సేకరణపై గ్రామసభ
కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా గారెపల్లిలో నిర్మించనున్న పైప్‌లైన్ కోసం భూ సేకరణపై సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకారం గారెపల్లిలో సేకరించనున్న 4.38 గుంటల భూమికి సంబంధించిన రైతుల వివరాలు గ్రామసభలో చదివి వినిపించారు. రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఎక్కువ భూమి కోల్పోతున్నప్పటికీ అధికారులు రికార్డుల్లో తక్కువ భూమి నమోదు చేశారని కాటారం సబ్ కలెక్టర్, భూ సేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మయాంక్‌సింగ్ దృష్టికి నిర్వాసిత రైతులు తీసుకొచ్చారు. గతంలో నిర్ణయించిన భూమి కంటే ఎక్కువగా ఎందుకు సేకరించాల్సి వస్తుందని, గతంలో భూమి కోల్పోయిన రైతులకు ఇప్పటివరకు పరిహారం అందలేదని అధికారులను నిలదీశారు. గతంలో సర్వే చేసిన దానికంటే రీఅలైన్‌మెంట్ ఎక్కువ ఎందుకు చేయాల్సి వస్తుందని ప్రశ్నించారు. నష్టపరిహారంతో పాటు ఉపాధి కల్పించాలని రైతులు కోరారు. నిర్వాసిత రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని సబ్ కలెక్టర్ రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఆర్‌ఐ వెంకన్న, భూ సేకరణ విభాగం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment