క్రీడల్లో గెలుపోటములు సహజం
భూపాలపల్లి రూరల్: క్రీడలు మానసికంగా, శారీరకంగా ఉపయోగపడతాయని, క్రీడలలో గెలుపోటములు సహజమని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో మహిళలకు క్యారంతో పాటు వివిధ క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఇన్‌చార్జ్ జిల్లా సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి మల్లీశ్వరి హాజరై క్రీడలను పర్యవేక్షించారు. అనంతరం మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి రఘు, మహదేవ్‌పూర్ సీడీపీఓ రాధిక, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
నేడు సరస్వతీ పుష్కరాలపై సమీక్ష
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగు సరస్వతీ పుష్కరాల నేపథ్యంలో ఽబుధవారం హైదరాబాద్ దేవాదాయశాఖ కార్యాలయంలో ఆశా ఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్‌తో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళేశ్వరం దేవస్థానం అధికారులు, అర్చకులతో పాటు జిల్లాస్థాయి అధికారులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. రెండు రోజుల కిందట 12న బుధవారం కాళేశ్వరంలో సమీక్ష జరుగునుందని అధికారుల ద్వారా తెలిసింది. రూ.25కోట్ల నిధులు రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసి పరిపాలన అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. పనులు కొన్ని ప్రారంభం కాగా, పనుల పురోగతిపై సమీక్షలో చర్చించనున్నారు.
కనులవిందుగా
కల్యాణ మహోత్సవం
కాటారం: మండలంలోని ఒడిపిలవంచలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం శ్రీ భూనీళ సహిత వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం కనులవిందుగా సాగింది. పురోహితులు మాడుగుల నాగరాజుశర్మ స్వామి వారి కల్యాణాన్ని వేద మంత్రోచ్ఛరణల నడుమ వైభవోపేతంగా నిర్వహించారు. గ్రామస్తులు, ఆలయ నిర్వాహకులు, భక్తులు కల్యాణ తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులు కల్యాణాన్ని వీక్షించి తరించారు. ఈ కార్యక్రమంలో నరివెద్ది సత్యనారాయణ, రఘువరణ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
గంజాయి పట్టివేత
కాళేశ్వరం: మహదేవపూర్ మండలకేంద్రంలోని డిగ్రీ కాలేజీ గ్రౌండ్ సమీపంలోగంజాయితో తిరుగుతున్న మండలకేంద్రానికి చెందిన షేక్ లుక్మాన్‌ను పోలీసులు పట్టుకొని రిమాండుకు తరలించారు. మహదేవపూర్ ఎస్సై పవన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..మంగళవారం పోలీసులు డిగ్రీకాలేజీ సమీపంలో పెట్రోలింగ్ చేస్తుండగా లుక్మాన్ నంబర్ ప్లేటు లేని నల్లని స్పెండర్ బైక్‌పై వస్తుండగా అనుమానం వచ్చి ఆపి తనిఖీ చేశారు. తనిఖీల్లో బైక్ ట్యాంక్ కవర్‌లో నల్లని సంచిలో ఎండిన గంజాయి లభించింది. గంజాయి 625గ్రాములు వరకు ఉంటుంది. బైక్, గంజాయిని స్వాదీనం చేసుకొని అతన్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ యువత మత్తుపదార్థాలకు బానిస కావొద్దన్నారు. మంచిగా చదువుకోవాలని చెప్పారు. చెడు వ్యసనాలు, మత్తుకు అలవాటుపడితే చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
క్రీడల్లో గెలుపోటములు సహజం
Comments
Please login to add a commentAdd a comment