సమర్థవంతంగా పనిచేయండి
భూపాలపల్లి: పోలీస్ వ్యవస్థను ప్రజలు గౌరవించేలా సేవలు అందించేందుకు సమర్థవంతంగా పనిచేయడానికి కృషిచేయాలని ఎస్పీ కిరణ్‌ఖరే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 22మంది ఫిర్యాదుదారుల పిటిషన్‌లను ఎస్పీ స్వీకరించి ఆయా పోలీస్‌స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సామాన్య ప్రజలకు పోలీసులు అండగా ఉండాలన్నారు. స్నేహభావంతో మెలుగుతూ వారి ఫిర్యాదులను స్వీకరించి సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు, సంఘవ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు తెలపాలని ఆయన పేర్కొన్నారు.
ఎస్పీ కిరణ్‌ఖరే
Comments
Please login to add a commentAdd a comment