సైక్లింగ్ పోటీల్లో క్రీడాకారుల ప్రతిభ
ములుగు: ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా సైక్లింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చూపారు. కోచ్ శ్రీరాంనాయక్ ఆధ్వర్యంలో 24మంది పోటీలలో పాల్గొనగా అండర్–14 విభాగంలో క్రీడాకరులు ఐశు సిల్వర్, బ్రాంజ్, దివ్య బ్రాంజ్, నవీన్ సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు. అండర్–16 విభాగంలో సాయి చరణ్ గోల్డ్, వర్షిణి రెండు సిల్వర్ మెడల్స్, అండర్–18 విభాగంలో కుశ్వంత్ రెండు గోల్డ్ మెడల్స్, చక్రవర్తి రెండు గోల్డ్ మెడల్స్ సాధించగా జిల్లాకు మొత్తంగా 12 మెడల్స్ వచ్చాయి. ఈ మేరకు సోమవారం జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్, డీవైఎస్‌ఓ తుల రవీందర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోశాధికారి ఎలగందుల మోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొమురవెళ్లి హరినాథ్‌లు క్రీడాకారులతో పాటు కోచ్‌ను శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ జిల్లాకు మంచి పేరు తీసుకరావడం శుభపరిణామం అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం క్రీడాకారులకు సైకిళ్లను అందిస్తానని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment