మంగళవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2025
బ్యాటరీ సైకిల్ కావాలి..
ఈ ఫొటోలో కనిపిస్తున్న దివ్యాంగుడి పేరు పూల్యాల చంద్రలింగం. మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామం. షుగర్ వ్యాధితో మూడేళ్ల క్రితం ఎడమ కాలును తొలగించారు. అతనికి సదరం సర్టిఫికెట్ వచ్చినప్పటికీ దివ్యాంగుల పింఛన్ రాకుండా రూ.2వేల వృద్ధాప్య పింఛన్ మాత్రమే వస్తుంది. తనకు బ్యాటరీ సైకిల్ ఇవ్వాలని ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నాడు. బ్యాటరీ సైకిల్ ఇస్తే కూరగాయల వ్యాపారం చేసుకుంటానని వేడుకున్నాడు. పని చేయకపోవడంతో భర్యాభర్తలం బతకడం ఇబ్బందికరంగా మారిందని అధికారులకు మొరపెట్టుకున్నాడు.
మంగళవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment