ఎల్‌ఆర్‌ఎస్ ఉంటేనే రిజిస్ట్రేషన్లు
భూపాలపల్లి అర్బన్: 2020 సంవత్సరానికి ముందు ఏర్పాటుచేసి నాన్‌లేఅవుట్‌కు దరఖాస్తు చేసుకొని ఉన్న ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు భూపాలపల్లి సబ్ రిజిస్ట్రార్ రేగళ్ల రాము తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై సోమవారం ఎస్‌ఆర్‌ఓ కార్యాలయంలో సబ్‌రిజిస్ట్రార్ రాము టౌన్‌ప్లానింగ్ అధికారి సునిల్‌తో కలిసి రియల్టర్లు, ఏజెంట్లు, దస్తావేజుల లేఖరులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2020 సంవత్సరంలో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 31వ తేదీ వరకు రూ.25శాతం ఫీజు రాయితీ అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేయనివారు సేల్ డీడీ సమయంలో ఎల్‌ఆర్‌ఎస్, రిజిస్ట్రేషన్ చార్జీలు ఎస్‌ఆర్‌ఓ కార్యాలయంలో చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment