మంగళవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2025
చిట్యాల మండలం కొత్తపేట గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ జరిపించాలని చిగురు రాజ్‌కుమార్, దొడ్డి శంకర్ కోరారు. కారోబార్ దేవేందర్ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీలో అక్రమాలకు పాల్పడ్డాడని, పనిచేయని కూలీలను హాజరు రిజిస్టర్‌లో నమోదు చేసి, కూలీ డబ్బులు చెల్లించి, అందులో నుంచి సగం డబ్బులు తీసుకుంటున్నాడని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని, తగు విచారణ జరపాలని కోరారు.
అవినీతిపై విచారణ చేపట్టాలి..