నాలుగేళ్లు సాగుచేస్తే రూ.40వేల ఆదాయం
ఏటూరునాగారం: కంకవనాలను సాగు చేసి నాలుగేళ్లపాటు సంరక్షిస్తే రైతులకు సంవత్సరానికి రూ.40వేలు ఆదాయం వస్తుందని సెర్ప్ సీసీ నర్సింహారావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని శివాపురం గ్రామంలో జగదాంబ గ్రామైక్య సంఘానికి ఆయన కంకవనాల పంట సాగుపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆమోదితమైన ఓ కంపెనీ ద్వారా 15 గుంటలు పట్టా భూమి ఉన్న మహిళా రైతుకు 60 కంక మొక్కలను ఉచితంగా అందిస్తారని తెలిపారు. ఆ తర్వాత ప్రతిరోజూ మొక్కకు నీరుపట్టి సంరక్షించినందుకు రూ.15 నాలుగేళ్లపాటు అందిస్తారని చెప్పారు. నాలుగు ఏళ్ల వరకు పంటను కాపాడితే మొక్కలు ఇచ్చిన కంపెనీ వారు కర్రను తీసుకెళ్లి రూ.40వేలు ఇస్తారని తెలిపారు. ఇలా పంట దిగుబడి వచ్చినన్ని రోజులు కొనుగోలు చేస్తారని వివరించారు. రైతుకు ఉపాధి హామీ కార్డు ఉంటే మొక్కల సంరక్షణ, నాటడం, మట్టి పనులు చేసినందుకు కూలి డబ్బులు కూడా వస్తాయని తెలిపారు. గ్రామంలోని మహిళలు, రైతులు కంకవనం(వెదురు) పంటపై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో వీఓఏ ప్రశాంతి, గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు ఎట్టి రమ, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
సెర్ప్ సీసీ నర్సింహారావు
కంకవనం సాగుపై అవగాహన
Comments
Please login to add a commentAdd a comment