భక్తులకు అసౌకర్యం కలగొద్దు
రేగొండ: కోటంచ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం కొడవటంచ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కోటంచ బ్రహ్మోత్సవాల కోసం చేస్తున్న ఏర్పాట్లను అధికా రులతో కలిసి పరిశీలించారు. జాతరలో భద్రత ఏర్పాట్లు, మంచినీటి సదుపాయాలు, పార్కింగ్, పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. అధికారులు, నిర్వాహకులు కలిసి సమన్వయంతో పని చేసి భక్తులకు ఉత్తమ సేవలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కా ర్యక్రమంలో ఈఓ మహేష్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, ఏఎస్పీ బోనాల కిషన్, జి ల్లా వైద్యాధికారి మధుసూదన్, ఆర్‌డబ్ల్యూస్ ఈఈ నిర్మల, విద్యుత్ డీఈ పాపిరెడ్డి, తహసీల్దార్ శ్వేత, మండల ప్రత్యేకాధికారి సునీల్ కుమార్, ఆలయ చైర్మన్ ముల్కనూరి భిక్షపతి, ధర్మకర్త శ్రీధర్, ఆ లయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ
Comments
Please login to add a commentAdd a comment