జిల్లా ప్రజలకు కలెక్టర్ హోలీ శుభాకాంక్షలు
భూపాలపల్లి: హోలీ పండుగను జిల్లా ప్రజలు ఆనందంగా, భద్రతతో, సంప్రదాయాలను పాటిస్తూ జరుపుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రజలు హోలీ ఆడిన అనంతరం బావులు, వాగులు, చెరువులు, గోదావరిలో స్నానాలకు వెళ్లొదని తెలిపారు. సరదా మాటున ప్రమాదం పొంచి ఉందని తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చిన్న పిల్లల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, బయటకు వెళ్లకుండా తల్లితండ్రులు పర్యవేక్షణ చేయాలని సూచించారు.
టెన్త్‌లో మెరుగైన
ఫలితాలు సాధించాలి
భూపాలపల్లి అర్బన్: పదో తరగతి ఫలితాల్లో గతంలో వచ్చిన ఫలితాలకంటే మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా విద్యార్థులను సిద్ధం చేస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతున్న తరుణంలో విద్యార్థులు ఒత్తిడి లేకుండా ఈ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. నవంబర్ మొదటివారం నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 3,449 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరు కానున్నట్లు వెల్లడించారు.
మావోయిస్టులకు
సహకరించొద్దు
వాజేడు: ప్రజలు మావోయిస్టులకు సహకరించవద్దని వారి సమాచారం తెలిస్తే పోలీసులకు చెప్పాలని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. మండల పరిధిలోని మొరుమూరులో గురువారం వాజేడు ఎస్సై ఎన్.రాజ్‌కుమార్, సివిల్, సీఆర్‌పీఎఫ్ పోలీసులతో కలిసి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఏఎస్పీ మాట్లాడుతూ యువ త చెడు వ్యసనాలకు అలవాటు పడవద్దన్నారు. గంజాయి, గుడుంబా, గుట్కా ప్యాకెట్లకు దూరంగా ఉండాలని సూచించారు. యువత అతి వేగంగా వాహనాలను నడిపి ప్రమాదాలకు గురి కావద్దన్నా రు. వాహనాలను నడుపుతూ సెల్‌ఫోన్ మాట్లాడ వద్దన్నారు. వీటి మూలంగానే రోడ్డు ప్రమదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆడ పిల్లలకు బాల్య వివాహాలను చేయవద్దన్నారు. నేటి కాలంలో చాలా మంది సులభంగా డబ్బులను సంపాధించాలని ఆన్‌లైన్ మోసాలకు గురవుతున్నారని తెలిపారు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలి
భూపాలపల్లి రూరల్: వేసవిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని చీఫ్ ఇంజనీర్ భీకంసింగ్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలో సర్కిల్ కార్యాలయంలో గురువారం భూపాలపల్లి డివిజన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని 33 ఇంటర్లింకింగ్ లైన్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే ఓవర్ లోడ్ ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లకు ఎస్టిమేట్స్ వేసి అదనపు ట్రాన్స్‌ఫార్మర్ పెట్టాలని సూచించారు. 33/11 సబ్ స్టేషన్లలో ఫీడర్ల విభజనను పూర్తి చేయాలని కోరారు. సబ్ స్టేషన్‌లలో ఓవర్‌లోడ్ పవర్ ట్రాన్స్‌ఫార్మర్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశం అనంతరం పెద్దాపూర్ సబ్ స్టేషన్‌కి కొత్తగా వేస్తున్న 33కేవీ ఇంటర్ లింకింగ్ లైన్‌ను పర్యవేక్షించారు. ఈ సమావేశంలో భూపాలపల్లి డివిజనల్ ఇంజనీర్ పాపిరెడ్డి, డివిజనల్ ఇంజనీర్ సదానందం, టెక్నికల్ ఇంజనీర్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రజలకు కలెక్టర్ హోలీ శుభాకాంక్షలు
Comments
Please login to add a commentAdd a comment