కాళేశ్వరం: కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరగనున్న సరస్వతీ నది పుష్కరాల అభివృద్ధి పనులను దేవాదాయశాఖ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. గురువారం ప్రసాదం కౌంటర్ భవనం, కల్యాణ మండపం షెడ్డు నిర్మాణం, పార్కింగ్ స్థలంలో సీసీ ఫ్లోరింగ్, శ్రీసూర్య ఆలయం ఎదుట సీసీ ఫ్లోరింగ్, వీఐపీ ఘాటు వద్ద మండప నిర్మాణాలు, లైటింగ్ ఏర్పాట్లు, సరస్వతి విగ్రహం నిర్మాణ పనులు వివిధ పనులను దేవస్థానం ఈఓ శనిగెల మహేష్, ఎండోమెంట్ ఎస్‌ఈ దుర్గ ప్రసాద్, స్థపతి వల్లి నాయగం పరిశీలించారు. వారివెంట డీఈఈ రమేష్‌బాబు, ఏఈఈలు చందర్, అశోక్ ఉన్నారు.
ఆలయాన్ని సందర్శించిన
దేవాదాయ శాఖ స్థపతి
రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దేవాదాయ, ధర్మదాయ శాఖ స్థపతి శ్రీవల్లీనాయక్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో గర్భగుడి పునర్నిర్మాణానికి పలు సూచనలు చేశారు. ఆలయ విస్తరణ పనులలో భాగంగా కల్యాణ మండపం, సింహద్వారం, నాగమయ్య గుడి, బాలాలయ్య గుడి నిర్మాణం కోసం స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు త్వరితగతిన సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఎస్‌ఈ దుర్గప్రసాద్, డీఈ రమేష్, ఆలయ ఈఓ మహేష్, ఆలయ చైర్మన్ భిక్షపతి, నాయకులు నాయినేని సంపత్‌రావు, పబ్బ శ్రీనివాస్, శివాజీ, కోటేశ్వరరావు, కమలాకర్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
సమగ్ర విచారణ జరిపించాలి
● అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే
గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి: గత నెలలో దారుణ హత్యకు గురైన నాగవెల్లి రాజలింగమూర్తి కేసును సమగ్ర విచారణ జరిపించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గురువారం అసెంబ్లీలో కోరారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో జరిగిన అవినీతి, గత ఎమ్మెల్యే చేసిన అవినీతిపై పోరాడినందుకు రాజలింగమూర్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు అనేక కేసులు నమోదు చేయించారన్నారు. ప్రాణభయం ఉందని అతడు పోలీస్‌స్టేషన్‌లో ముందే తెలిపాడన్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆత్మ అయిన మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ కొత్త హరిబాబు హత్య కేసులో నిందితుడిగా ఉండి ప్రస్తుతం జైలులో ఉన్నాడన్నారు. ఈ హత్య కేసుపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. నియోజకవర్గంలోని భీంఘన్‌పూర్, గణపురం రిజర్వాయర్‌ల చానల్స్ మరమ్మతు, కెనాల్‌ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని సత్యనారాయణరావు కోరారు.
సరస్వతీ పుష్కరాల పనుల పరిశీలన