మే 15 నుంచి 26వరకు సరస్వతీ పుష్కరాలు
కాళేఽశ్వరం: మే 15నుంచి 26వరకు సరస్వతీ నది పుష్కరాలు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. రూ.25కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయి. 40డిగ్రీల ఎండ తీవ్రతతో కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతీ నదుల్లో నీరు తగ్గుముఖం పడుతుంది. ప్రస్తుతం కాళేశ్వరం వద్ద 2వేల క్యూసెక్కులు నీరు తరలిపోతుంది. దీంతో మే నెల వరకు తగ్గే అవకాశం ఉంది. దీని కోసం ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా కన్నెపల్లి సమీపంలో కాఫర్‌డ్యాం లేదా సిమెంట్‌బ్యాగులతో ఇసుక నింపి అంతర్రాష్ట్ర వంతెన దిగువన గోదావరికి అడ్డుగా వేస్తే నీరు నిల్వ పెరిగి నీరు పెరిగే అవకాశం ఉంది.
మే నెలలో 44–45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో ఎండ తీవ్రత పెరిగి గోదావరిలో నీరు తగ్గుముఖం పడుతుంది. ప్రతియేటా వేసవి కాలం మే నెలలో 600–800ల క్యూసెక్కులు ప్రవహిస్తుంది. అప్పటికే గోదావరి నీటిమట్టం తగ్గి చిన్నపాయలాగా పారుతుంది. ఈ సారి పుష్కరాలు ఉండడంతో ప్రాణహితనది నీటిపై ఆధారపడాల్సి రానుంది. దీంతో త్రివేణి సంగమం వద్ద నీరు లేకపోవడంతో పుష్కరాల స్నానాలకు 12 రోజుల పాటు భక్తులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పుష్కరాలకు వచ్చే భక్తులు స్నానాలకు, పితృదేవతలకు పిండప్రదానం పూజలు చేస్తారు. నీరు సమృద్ధిగా ఉంటేనే ఇవి సాధ్యం. జల్లుస్నానాల కింద చేసి నదిలో చేసిన అనుభూతి రాదని భక్తుల విశ్వాసం.
మేలో వందల్లో క్యూసెక్కులు..
ప్రతి ఏడాది మేలో ఎండలతో
పాయలాగే గోదావరి
కన్నెపల్లి వద్ద కాపర్‌డ్యాం లేదా
అడ్డుకట్ట నిర్మాణమే పరిష్కారం
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే
పుష్కరాలకు నీరు