నీరులేక.. బోరు పడక..
టేకుమట్ల మండలం అంకుషాపూర్ గ్రామానికి చెందిన ఒజ్జ రాములు రామకిష్టాపూర్(టి) శివారులో మూడెకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఎకరం భూమిలో యాసంగిలో వరి సాగు చేశాడు. సాగునీటి కోసం పక్కనున్న రైతు బోరు సహాయం తీసుకున్నాడు. భూగర్భ జలాలు అడిగంటిపోవడంతో బోర్లలో నీరు లేకుండాపోయింది. దీంతో భూ యజమానిని సంప్రదించగా.. 20రోజుల క్రితం 150 ఫీట్ల వరకు బోరు వేయించాడు. చుక్కనీరు పడకపోవడంతో చేసేది లేక రైతు వరిపంటను వదిలేసుకున్నాడు. గొర్రెలు, మేకలకు పంట మేతగా మారడంతో లబోదిబోమంటున్నాడు.
– భూపాలపల్లి