విద్యార్థులు మేధాశక్తిని పెంపొందించుకోవాలి
ఏటూరునాగారం: విద్యార్థులు మేధాశక్తి పెంపొందించుకోవాలని హనుమకొండ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ వాసం శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలో రెండు రోజులు జాతీయస్థాయిలో వర్క్‌షాప్ నిర్వహించారు. రెండోరోజు గురువారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఆన్‌లైన్ సెమినార్‌కి ముఖ్యఅతిథిగా శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. ‘ఆన్ ఇంటరాక్షన్ విత్ కెరియర్ గైడెన్స్ సెల్’, ‘కోఆర్డినేషన్ కాంపౌండ్స్’ అనే అంశాల మీద విద్యార్థినులకు అవగాహన కల్పించారు. చదువుతో పాటు సమాజంపై విజ్ఞానం పెంచుకోవాలన్నారు. అనంతరం జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఆన్‌లైన్ వెబ్ నాట్‌కి గెస్ట్‌గా సంగారెడ్డి డిగ్రీ కళాశాల డాక్టర్ సుప్రభాపాండ మాట్లాడారు. ‘ఇన్బార్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం’ అనే అంశం పైన చర్చించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవాణి, రీజినల్ కోఆర్డినేటర్ హరిసింగ్, శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment