ఏటూరునాగారం: సైన్స్‌పై విద్యార్థులు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని కాకతీయ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ రమారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో సైన్స్ వర్క్‌షాపును బుధవారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సాంకేతిక విజ్ఞానం విద్యార్థులకు అవసరం అన్నారు. కంప్యూటర్, సైన్స్‌పై పూర్తిస్థాయిలో అవగాహన ఉండడంతో పాటు అధ్యాపకులు బోధించిన ప్రతీ విషయాన్ని ఏకాగ్రతతో ఒంట పట్టించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన విద్యాసంస్థల సమన్వకర్త శ్రీనివాస్‌రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రేణుక, అధ్యాపకులు నవీన్, వెంకటయ్య, జ్యోతి, జీవవేణి, గిరిజన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవాణిలతో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment