భూపాలపల్లి అర్బన్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. బుధవారం మొదటి రోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తెలుగు పరీక్షను నిర్వహించారు. మొత్తం 1,901 మంది విద్యార్థులకు గాను 1,802 మంది విద్యార్థులు హాజరు కాగా 99 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో 8 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేయగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, తేజస్విని గాంఽధీ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యా నోడల్ అధికారి వెంకన్న తనిఖీ చేశారు. అలాగే కాటారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment