ఫిబ్రవరి 10న కాటారం మండలం నస్తుర్‌పల్లికి వచ్చిన పెద్దపులి ఆవాసం కోసం మహదేవపూర్, పలిమెల మండలాల్లో కలియతిరుగుతుంది. రోజుకో చోట సంచరిస్తుంది. ఆవాసం కోసం వస్తే మాత్రం ఉచ్చులకు పడితే పులి మరణించే అవకాశం ఉందని పలువురు జంతుప్రేమికులు పేర్కొంటున్నారు. రక్షించే బాధ్యత అటవీశాఖ అధికారులపై ఉంది. ఈ అడవుల్లో పులులను వేటాడే వేటగాళ్లు ఏమైనా ఉచ్చులు పెడితే పులికి ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
తగ్గిన నిఘా..
ఎన్ని కౌన్సెలింగ్‌లు చేసినా వేటగాళ్లు వేటాడటం, తినడం మారడం లేదు. వేసవి కావడంతో అడవులు పలచపడి నీటికోసం కుంటలు, వాగుల వద్దకు అడవి జంతువులు వస్తుండడంతో ఉచ్చులు పెడుతున్నట్లు తెలిసింది. కాపలా ఉండే అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అటవీశాఖ ప్రత్యేక నిఘా విభాగాలు రాత్రి వేళల్లో గస్తీలు నిర్వహించడం లేదు. పెట్రోలింగ్ టీంలు, ప్లయింగ్‌స్క్వాగ్ విభాగాల సోదాలు కూడా తగ్గాయని తెలుస్తోంది.
వేటాడితే జైలుకే..
ఉచ్చులు పెట్టినా, వేటాడిన జైలుకు పంపుతాం. అనుమాసం ఉన్న ప్రాంతంలో మా బృందాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. అనుమానిత ప్రాంతాల్లో రాత్రి పెట్రోలింగ్‌ను తీవ్రం చేశాం. ఉచ్చులు బిగించకుండా అడవి మార్గంలో విద్యుత్ లైన్‌లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. పులి తిరిగే ప్రాంతాల్లో ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాం. ప్రమాదం లేదు.
– నవీన్‌రెడ్డి, డీఎఫ్‌ఓ
●
Comments
Please login to add a commentAdd a comment