కూలీలు కొలతల ప్రకారం పని చేయాలి
చిట్యాల: ఉపాధి హామీ కూలీలు కొలతల ప్రకారం పని చేయాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అ న్నారు. బుధవారం మండలంలోని లక్ష్మీపూర్‌తండా గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆమె ఆకస్మీకంగా తనిఖీ చేశారు. కూలీల హాజరు పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీరోజు రూ.300 కూలీ పడే విధంగా కూలీలు కొలతలప్రకారం పని చేసుకోవాలని తెలిపారు. పని ప్రదేశంలో కూలీల కోసం తాగానీరు, నీడ సౌకర్యం, ప్రథమ చికిత్స బాక్స్‌ను అందుబాటులో ఉంచాలని పంచాయితీ కార్యదర్శికి సూ చించారు. ఆమె వెంట ఎంపీడీఓ జయశ్రీ, ఎంపీఓ రామకృష్ణ, ఏపీఓ అలీంపాషా, ఈసీ సుధాకర్, పంచాయితీ కార్యదర్శి శ్రీకాంత్, ఏఫ్‌ఏ రాజు ఉన్నారు.
ఇళ్ల పనులు పూర్తి చేయాలి
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరగా ఇళ్ల పనులు పూర్తి చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి కోరారు. మండలంలో ఇటీవల ఎంపికై న ముచినిపర్తి గ్రామంలో నిర్మించుకుంటున్న ఇందిర మ్మ ఇళ్లను బుధవారం ఆమె పరిశీలించారు. ఎంపీడీఓ జయశ్రీ, ఎంపీఓ రామకృష్ణ ఉన్నారు.
కాటారం: మహాముత్తారం మండలం మదారం మామిడికుంటలో కొనసాగుతున్న ఎంఐ ట్యాంక్, ఫిష్ పాండ్ పనులను డీఆర్‌డీఓ నరేశ్ బుధవారం పరిశీలించారు. పని ప్రదేశంలో సౌకర్యాలు, కూలీల హాజరు, పనుల తీరుపై ఆయన ఆరా తీశారు. కూలీ లకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందజేసి వేసవిలో కూలీ లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఎంపీడీఓ శ్రీనివాస్, ఈసీ నాగేందర్, టీఏ, పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు.
అదనపు కలెక్టర్ విజయలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment