నస్తూర్‌పల్లి అడవిలోకి పులి
కాటారం: మండలంలోని ప్రతాపగిరి పులివాగు సమీపంలో పాదముద్రల ఆధారంగా నస్తూర్‌పల్లి అడవి ప్రాంతంలోకి పులి తిరిగి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. మూడు రోజుల క్రితం మహదేవపూర్ మండలం ఏన్కపల్లి నుంచి ప్రతాపగిరి గొంతెమ్మగుట్ట సమీపంలోకి పులి వచ్చిందనే సమాచారంతో కాటారం డిప్యూటీ రేంజర్ సురేందర్‌నాయక్ ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు పులివాగు వద్ద పులి పాదముద్రలు(ప్లగ్‌మార్క్స్) గుర్తించి నిర్ధారించారు. ఆదివారం అటవీశాఖ అధికారులు, సిబ్బంది మళ్లీ గాలింపు చర్యలు మొదలుపెట్టగా.. మర్రివాగు వైపుగా పులి వచ్చినట్లు ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. నస్తూర్‌పల్లి అటవీ ప్రాంతంలో పూర్తిగా ఆకురాలి ఉండటంతో పులి అడుగులు గుర్తించలేకపోయామని పులి నస్తూర్‌పల్లి అడవిలోకి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పులి జాడ తెలియక అటవీశాఖ అధికారులు అయోమయానికి గురవుతుండగా.. ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. పులి గాలింపు చర్యల్లో కాటారం డిప్యూటీ రేంజర్‌తో పాటు యామన్‌పల్లి డిప్యూటీ రేంజర్ శ్రీనివాస్, ఎఫ్‌బీఓలు మోయినోద్దిన్, మోనకౌసర్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment