భూపాలపల్లి రూరల్: పదో తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి.. జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కలెక్టర్ రాహుల్ శర్మ విద్యార్థులకు సూచించారు. భూపాలపల్లి మండలం గుర్రంపేట జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో శనివారం టెన్త్ విద్యార్థులకు కలెక్టర్ ప్రేరరణ కరపత్రం పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలంటే భయపడకుండా రాయాలన్నారు. ఒత్తిడిని జయించినప్పుడే విజయం వరిస్తుందని తెలిపారు. సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. పరీక్షల సమయంలో ఆరోగ్య పరిరక్షణ చాలా ముఖ్యమని చెప్పారు. విద్య మాత్రమే మనిషిని ఉన్నతస్థాయికి చేర్చగలదన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, ఎంఈఓ లక్ష్మణ్, తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యాబోధన..
భూపాలపల్లి మండలం గుర్రంపేట ఎంపీపీఎస్ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యాబోధన కార్యక్రమాన్ని కలెక్టర్ రాహుల్‌శర్మ ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపునకు కృత్రిమ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విద్యాబోధన ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. విద్యార్థులను చదవడం, రాయడం, లెక్కించడం వంటి ప్రక్రియలలో మెరుగుపరచడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంపై ఈ నెల 11న రాష్ట్రస్థాయిలో ఒక రోజు క్వాలిటీ కోఆర్డినేటర్స్, జిల్లాస్థాయి రిసోర్స్ పర్సన్‌లకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రాథమిక స్థాయిలో ఏఐ బోధన కార్యక్రమ కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమ అమలుకు ప్రస్తుతం గుర్రంపేట, చింతకాని పాఠశాలలను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, ఏఐ క్వాలిటీ కో–ఆర్డినేటర్ కాగితపు లక్ష్మణ్, తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, ఏఐ క్వాలిటీ కో–ఆర్డినేటర్ కాగితపు లక్ష్మణ్, తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి
భూపాలపల్లి: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతీ సోమవారం జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయం నుంచి వివిధ అంశాలపై అన్ని శాఖల జిల్లా అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసినందున యంత్రాంగం పరిపాలనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పెండింగ్ ఫైల్స్ పరిష్కరించాలని సూచించారు. వచ్చే సోమవారం నుంచి ఉదయం 10.30 గంటల నుంచి అన్ని మండలాల్లో ప్రజావాణి నిర్వహించి ప్రజల సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణికి మండల కేంద్రంలో అన్ని శాఖల మండల స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరు కావాలని, హాజరు నివేదిక అందజేయాలని స్పష్టంచేశారు. టెలీ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి
కలెక్టర్ రాహుల్ శర్మ
టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి