
బహుజన వీరుడు సర్వాయి పాపన్నగౌడ్
భూపాలపల్లి రూరల్: బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు అన్నారు. బుధవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా భూపాలపల్లి కలెక్టరేట్‌లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అ యిత ప్రకాశ్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమసమాజ నిర్మాణ స్థాపన కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా వెనుక బడిన తరగతుల అధికారి శైలజ, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సత్యనారాయణరావు