
ఎంపీడీఓ చాంబర్‌లో కునుకు తీసిన కుక్క
అధికారులు విధులు నిర్వర్తించేందుకు.. ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయానికి వస్తుంటారు. కానీ, ఈ శునకం మాత్రం సేదదీరేందుకే ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చినట్టుంది. ఏకంగా ఎంపీడీఓ చాంబర్‌లోనే కునుకు తీసింది. బుధవారం కొత్తపల్లి గోరి ఎంపీడీఓ.. విధుల్లో భాగంగా జిల్లా కేంద్రానికి వెళ్లడం.. కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడంతో ఓ కుక్క దర్జాగా బాస్ గదిలోనే నిద్రించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
– రేగొండ(కొత్తపల్లి గోరి)